బీజేపీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి | Worlds mother's day special BJP party arrenged a musical program | Sakshi
Sakshi News home page

బీజేపీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి

Published Sun, May 10 2015 11:41 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

Worlds mother's day special BJP party arrenged a musical program

దాదర్: ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా నవీముంబైలోని వాషి పట్టణంలో స్థానిక బీజేపీ పార్టీ తెలుగు విభాగం ఆధ్వర్యంలో సంగీత విభావరి కార్యక్రమం జరిగింది. సెక్టార్ 14, బీజేపీ కార్యాలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి తిరుపతి పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసురాలు, ఆకాశవాణి కళాకారిణి, ‘మధుర సంగీత భారతి’ వరలక్ష్మి నారాయణం హాజరయ్యారు. ‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట, తల్లిని మించి వేరే దైవము లేనే లేదురా-చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గమురా’ వంటి గీతాలతో పాటు అన్నమయ్య, త్యాగరాజ కీర్తనలు వినిపించి శ్రోతలను అలరించారు.

కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు సి.వి. రెడ్డి, ఏక్‌నాథ్ మగద్వార్, విక్రం పారాజులి (బీజేపీ నేతలు), వాణీ శ్రీపాద, కె.ఎస్. మూర్తి, కె.వి. రమణయ్య శెట్టి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాకారిణి వరలక్ష్మిని వాణి శ్రీపాద సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement