ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిందో ఏమో కానీ.. ఓ యువతి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఎందుకంటారా? లిజ్ సాన్ మిలాన్ అనే యువతి మ్యూజిక్ ఆడిషన్‌లో పాల్గొనాలనుకుంది. అందుకోసం ఇంట్లోనే పాట పాడి వీడియో పంపించాలనుకుంది. అనుకున్నట్లుగానే కెమెరా ఆన్ చేసి గొంతు సవరించుకుని అద్భుతంగా పాడటం మొదలు పెట్టింది. ఇంతలో ఆ గదిలో సీలింగ్ విరిగిపోయి అందులో నుంచి ఆమె తల్లి కాళ్లు బయటకు కనిపించాయి. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న కూతురు ఓ మై గాడ్ అంటూ వెనక్కు తిరిగి చూసి కెమెరా ఆఫ్ చేసింది. (చదవండి: జాగ్రత్త! నీ చెయ్యి చికెన్ పీస్ అయిపోద్ది)
"నేను ముఖ్యమైన పని మీద ఉన్నానని తెలిసి కూడా అమ్మ దేని కోసమో అటక ఎక్కింది. ఎక్కడ డిస్టర్బెన్స్ వస్తుందోనన్న భయంతో వీడియోలో నా మొహం కాస్త చిరాకుగా ఉంది . కానీ అమ్మ పడే ముందు వరకు ఎలాంటి శబ్దం చేయలేదు. ప్రస్తుతం ఆమె బాగానే ఉంది. శరీరానికి చిన్న గాయం కూడా కాలేదు" అని లిజ్ పేర్కొంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "నీ పాటకు ఇంటి పునాదులే కదులుతున్నాయి. కాబట్టి పాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో" అని ఓ యూజర్ ఉచిత సలహా ఇచ్చాడు. "అరెరే... అసలైన సమయానికి రాలేదు. వన్ మోర్", "పాడే వాళ్లకన్నా అలా వెనకాల డ్యాన్స్ చేసేవాళ్లే ఇష్టం" "కూతురి కష్టాన్ని నవ్వులపాలు చేసిన తల్లి " అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: స్నేహితుడి కోసం కేక్ చేసిన బిల్‌గేట్స్)
Comments
Please login to add a commentAdd a comment