
మారేడుపల్లి: మెట్రోరైలు ఎండీ గొంతు సవరించారు. తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశారు. శుక్రవారం కస్తూర్భా గాంధీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘మెట్రోరైలులో మరదలు మైసమ్మ.. ఏసీలో వచ్చే మరదలు మైసమ్మ.. చెమటలు పట్టేదిలేదు మరదలు మైసమ్మ’.. అంటూ పాటలు పాడి విద్యార్థినులను ఉర్రూతలూగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మెట్రోరైలు రాకతో నగరం గ్లోబల్ సిటీగా మారుతుందన్నారు.
25 వేల కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్ట్ ప్రారంభమైందని, 50 వేల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయని వివరించారు. ఇంటర్ దశ ఎంతో కీలకమని, ఎన్ని కష్టాలు వచ్చినా శ్రద్ధగా చదివి అనుకున్న గమ్యాన్ని చేరాలని సూచించారు. ఈ సందర్భంగా కాలేజీ టాపర్స్‌కు బహుమతులను ప్రదానం చేశారు. కాగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కస్తూర్భాగాంధీ మహిళా కళాశాల చైర్మన్ ఎన్.వి.ఎన్.చార్యులు, సెక్రటరీ హైదర్, ట్రెజరర్ అజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ ప్రతిమారెడ్డి, పలువురు పాల్గొన్నారు.
వార్షికోత్సవ సభలో మాట్లాడుతున్న ఎన్వీఎస్ రెడ్డి