
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ వాసుల కలల మెట్రో రైలులో ప్రయాణించే వారి సంఖ్య లక్షణంగా ‘లక్ష’దాటింది. ఈ నెల 16న నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్ మార్గంలో ప్రయాణించిన వారి సంఖ్య 1.07 లక్షలుగా ఉందని హెచ్‌ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.
రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతోందని..మెట్రో రూట్లలో క్రమంగా వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గుముఖం పడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ మొదటివారంలో ఎల్బీనగర్–అమీర్‌పేట్ మార్గంలో మెట్రో ప్రారంభం కానుండటంతో ఈ మార్గంలో నిత్యం 2.5 లక్షల మంది మెట్రో జర్నీ చేసే అవకాశం ఉందని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మార్గానికి సంబంధించి త్వరలో కమిషనర్ ఆఫ్ రైల్వేసేఫ్టీ నుంచి భద్రతా ధ్రువీకరణ పత్రం అందనుందని తెలిపారు.