mental balance
-
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్‌గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
Ishaa Vinod Chopra: నీకు నువ్వే సాయం చేసుకో
‘లెట్ ఈషా హెల్ప్ ఈషా’ అనుకుందామె. 16 ఏళ్ల వయసులో తనకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉందని డాక్టర్లు చెప్పాక ఈషా వినోద్ చోప్రా తనకు తనే సాయం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆ డిజార్డర్‌తో పోరాటం చేస్తూనే స్త్రీల మానసిక సమస్యల పై చైతన్యం కలిగిస్తోంది. దర్శకుడు విధు వినోద్ చోప్రా కుమార్తె అయిన ఈషా మానసిక సమస్యతో తన పోరాటంపై తాజాగా ‘ఫైండింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ పుస్తకాన్ని వెలువరించింది. అందరూ తెలుసుకోవాల్సిన సంగతులు ఇందులో ఉన్నాయి.భారతదేశంలో 2023 సంవత్సరంలో జరిగిన అంచనా ప్రకారం 7 కోట్ల మంది మానసిక ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వీరిలో స్త్రీల శాతం తక్కువ కాదు. మానసిక సమస్యలు 14 ఏళ్ల వయసు నుంచి కనిపిస్తాయి. 25 ఏళ్ల వయసుకు పూర్తిగా వ్యక్తమవుతాయి. కాబట్టి 14 నుంచి 25 ఏళ్ల మధ్య వయసులో పిల్లల్ని పరిశీలిస్తూ వారి సమస్యను తల్లిదండ్రులు గుర్తించగలిగితే చాలా వరకూ ఆ పిల్లలకు తమ సమస్య అర్థమయ్యి దానిని ఎలా ఎదుర్కోవాలో తెలుస్తుంది. కాని దురదృష్టవశాత్తు ఈ ఎరుక ఉన్న తల్లిదండ్రులు తక్కువ. స్కూల్ టీచర్లు తక్కువ. ‘అందుకే నేను ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేటర్‌గా నా జీవితాన్ని గడపదలుచుకున్నాను. అందుకు అవసరమైన కోర్సును కెనడాలో పూర్తి చేసే దశలో ఉన్నాను. పిల్లల మానసిక సమస్యలనే కాదు... పిల్లలు నార్మల్‌గా ఉండి తల్లిదండ్రులు మానసిక సమస్యలతో బాధ పడుతున్నా పిల్లల జీవితం పెను ఒత్తిడికి లోనవుతుంది. స్కూల్ టీచర్లు ఇలాంటి సమయంలో పిల్లలకు అండగా ఉండాలి. అయితే స్కూల్ టీచర్లకు అలాంటి ట్రయినింగ్ ఉండటం లేదు’ అంటుంది ఈషా వినోద్ చోప్రా.సుప్రసిద్ధ దర్శకుడు విధు వినోద్ చో్ప్రా, అతని రెండవ భార్య షబ్నమ్ సుఖదేవ్‌ల సంతానం ఈషా. వారు తర్వాతి కాలంలో విడాకులు తీసుకున్నారు. ‘మా తాతగారు (అమ్మ తండ్రి) ఎస్.సుఖదేవ్ గొప్ప డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్. ఆయనకు మానసిక సమస్యలు ఉండేవని తర్వాత తెలిసింది. నా సమస్యకు మూలం అక్కడే ఉండొచ్చు’ అంటుంది ఈషా.➡️బైపోలార్ డిజార్డర్ఉన్నట్టుండి బోలెడంత ఉత్సాహం రావడం, భారీ పనులు సంకల్పించడం, అతిగా మాట్లాడటం, నిద్ర పోలేక పోవడం, అయినప్పటికీ ముఖం తాజాగా ఉండటం... ఇది బైపోలార్ డిజార్డర్‌లో ‘మేనియా’ దశ. మరి కొన్నాళ్లకు హటాత్తుగా దేనిమీదా ఆసక్తి లేకపోవడం, నిర్లిప్తత, నిద్ర లేమి, ఏ పనీ సరిగా చేయలేకపోవడం.. ఇది ‘డిప్రెషన్’ దశ. ఈ రెండు దశల మధ్య ఊగిసలాడుతూ మధ్యలో నార్మల్‌గా ఉంటూ మానసికంగా అవస్థ పడే స్థితే ‘బైపోలార్ డిజార్డర్’. ‘నా పదహారవ ఏట డాక్టర్లు దీనిని గుర్తించారు. దీనిని ఎదుర్కొనడానికి సిద్ధమవమన్నారు’ అని తెలిపింది ఈషా.➡️నీకు నువ్వే సాయం చేసుకో‘మానసిక సమస్యలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మొదట తమ మీద తాము విశ్వాసం నిలుపుకోవాలి. పెద్ద కొంపలేం మునగలేదు.. నేనూ అందరిలాంటి వ్యక్తినే... ఇది ఉన్నట్టుగానే గుర్తించక నీ పనిలో పడు అని ధైర్యం చెప్పుకోవాలి. ఆ తర్వాత వైద్య చికిత్సను పూర్తిగా విశ్వసించి డాక్టర్లు చెప్పినట్టు వినాలి. ఇవేవి సరిగా చేయకపోయినా ఇబ్బందిలో పడతాం’ అంటుంది ఈషా. ‘నాకు డిజార్డర్ ఉందని తెలిశాక దాన్ని ఆర్డర్లో పెట్టడానికి నాలోని సృజనాత్మక శక్తులన్నీ వెలికి తీశాను. కథక్ నేర్చుకున్నాను. పెయింటింగ్ నేర్చుకున్నాను. మానసిక సమస్యలకు సంబంధించిన రీసెర్చ్ చేశాను. మానసిక సమస్యల చైతన్యానికై ప్రచార కర్తగా మారాను. ఈ పనులన్నీ నా సమస్యను అదుపు చేయగలిగాయి. ఒక రకంగా చెప్పాలంటే బైపోలార్ డిజార్డర్ నా జీవితాన్ని ఆర్డర్లో పెట్టుకునే శక్తి నాకు ఇచ్చింది. అందుకే నా అనుభవాల గురించి రాసిన పుస్తకానికి ‘ఫైడింగ్ ఆర్డర్ ఇన్ డిజార్డర్’ అనే పేరు పెట్టాను’ అంటోంది ఈషా.➡️గట్టి బంధాలు‘హార్వర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఒక పరిశోధన ప్రకారం గట్టి మానవ సంబంధాలు ఉన్నవారు ఎక్కువ ఆయుష్షుతో ఉంటున్నారట. మానసిక సమస్యలు ఉన్న పేషెంట్లను చూసుకునే తల్లిదండ్రులు, కేర్గివర్లు ఎంత ప్రేమగా ఉంటే పేషంట్లకు అంత ధైర్యం దక్కుతుంది. సాధారణ జీవితంలో కూడా ఆరోగ్యకరమైన మానవ సంబంధాలే మానసిక ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు ఇవాళ గట్టి బంధాలు ఉండటం లేదు. ఒక మనిషి ఉన్నాడనే ధైర్యమే నేడు కావలసింది. నేను నా మానసిక సమస్యను దాదాపుగా జయించడంలో నా భర్త, నా తోబుట్టువుల మద్దతు చాలా ఉంది’ అని ముగించింది ఈషా. -
పక్షులు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయా?
మనుషుల మానసిక ఆరోగ్యంపై పక్షుల ప్రభావం కూడా ఉంటుందని విన్నారా?. అసలు మన మానసిక పరిస్థితికి పక్షులకు లింక్ ఏంటీ. అవి ఎలా మన మనఃస్థితిని ప్రభావితం చేయగలవు అనే కదా సందేహం!. అయితే పరిశోధకులు మాత్రం వాటి వల్లనే మన మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి పక్షులను చూసే అవకాశం ఉండదు కదా! అని అడగొచ్చు దానికి శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే.. పక్షులను చూడటం లేదా వీక్షించటం, వాటి కిలకిలరావాలను వినడం వంటివి చేస్తే తెలియకుండా మానసిక ప్రశాంతత చేకూరి సంతోషంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్ఫన్నం కావని అన్నారు. ఈ మేరకు సుమారు 13 వందల మందిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా...పక్షులను చూడటం, వాటి శబ్దాలను విన్న వారి మానసిక ఆరోగ్యం బాగున్నట్లు గమనించారు. పక్షులతో పనిగట్టుకుని గడపడం మొదలుపెట్టాక నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఈ మెరుగుదలను డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలోనూ, ఆరోగ్యవంతమైన వ్యక్తులలోనూ కనిపించాయన్నారు. అలాగే మరో అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 295 మందిని పక్షులతో గడిపి తమ భావోద్వేగ స్థితిని స్వయంగా అంచనా వేసి చెప్పాలని కోరారు. వారంతా పక్షి పాటలను విన్నప్పటి నుంచి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అంతేగాదు మతిస్థిమితం, మరచిపోవడం వంటి రుగ్మతలు కూడా తగ్గినట్లు వెల్లడించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రకృతితో గడపలేకపోయినా కనీసం పక్షుల కిలకిల రావాలను మనసును ఆహ్లాదపరిచి స్థిమ్మితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై ప్రకృతి ప్రభావం చూపుతోందా? మానసిక ఆరోగ్యంపై ప్రకృతి చూపించే ప్రభావాన్ని సాఫ్ట్ ఫాసినేషన్గా చెప్పొచ్చు. మన దృష్టి ప్రకృతి వద్దకు వచ్చేటప్పటికీ విస్తృతంగా చూసేలా చేసి మెదడు తనను తాను రిఫ్రెష్ చేసుకునేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంత పొంది, మతిమరుపు, మతిభ్రమించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తనకు తానుగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంతేగాదు ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు మనలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు. ఈ పరిశోధన జర్నల్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మెడిసన్‌లో ప్రచురితమయ్యింది. సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా పచ్చని ప్రదేశాలను సందర్శిస్తే..వారి మానసిక స్థితి మాత్రమేగాక, యాంటీహైపెర్టెన్సివ్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని అధ్యయనంలో తేలిందన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైనా పక్షుల అభయారణ్యాలు, పర్వతాలు, బీచ్‌లు, సరస్సులు, నదులు వద్ద గడపండి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. (చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!) -
మరో ‘పబ్జీ’ దారుణం: తల్లిదండ్రులపై దాడికి తెగబడి..
ఉత్తరప్రదేశ్‌లోని జాన్సీకి చెందిన ఒక యువకుడు పబ్జీ ఆడుతూ, తన మనసుపై నియంత్రణ కోల్పోయి, తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చావబాదాడు. రోజూ పాలుపోసే వ్యక్తి వారి ఇంటికి వచ్చినప్పుడు ఈ విషయం వెలుగుచూసింది. పాలుపోసే వ్యక్తి వారి ఇంటిలోకి వెళ్లి చూడగా ఇంటి యజమాని, అతని భార్య రక్తపు మడుగులో అతనికి కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందించిన పాలుపోసే వ్యక్తి ఈ దారుణ ఘటన జాన్సీ పట్టణంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుమనాబాద్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీప్రసాద్(60) అతని భార్య విమల(55) కుమారుడు అంకిత్(28) ఉంటున్నారు. ఉదయం పాలుపోసే వ్యక్తి వారి ఇంటి తలుపు తట్టాడు. లోపలి నుంచి ఎటువంటి సమాధానం వినిపించలేదు. దీంతో అతను ఇంటిలోనికి వెళ్లి చూశాడు. అక్కడ రక్తపుమడుగులో లక్ష్మీప్రసాద్, విమల అతనికి కనిపించారు. వారి పక్కనే అంకిత్ కూర్చుని ఉన్నాడు. ఆసుపత్రికి చేరుకునేలోగానే.. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ దంపతులను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోగానే లక్ష్మీప్రసాద్ మృతిచెందగా, చికిత్స పొందుతూ విమల కన్నుమూసింది. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. నిందితుడు అంకిత్‌ను అరెస్టు చేసి, అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి ఈ కేసు గురించి పోలీసు అధికారి రాజేష్ మాట్లాడుతూ నిందితుడు అంకిత్ తన తల్లిదండ్రులపై కర్రతో తీవ్రంగా దాడి చేశాడని, ఫలితంగానే వారు మృతి చెందారని తెలిపారు. మానసిక స్థితి దెబ్బతినడంతోనే తాను అలా చేశానని అంకిత్ పోలీసుల ముందు తన తప్పు ఒప్పుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అంకిత్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిగా లేదు. నిత్యం పబ్జీ గేమ్ ఆడుతుంటాడు. ఈ గేమ్ కారణంగా అతని మానసిక స్థితి మరింత దిగజారింది. ఈ ఘటనలో అంకిత్ తొలుత తండ్రిపై, తరువాత తల్లిపై దాడి చేశాడని సమాచారం. ఇది కూడా చదవండి: టమాటాలను వదలి అవకాడోలపై పడుతున్న జనం! -
ప్రమాదం అంచున మనదేశం
మీరు ఆరోగ్యంగా ఉన్నారా? అని ప్రశ్నిస్తే కొంతమంది తమ ఆరోగ్య సమస్యల గురించి ఏకరువు పెడతారు. మరికొందరు ‘నాకేమండీ, ఏ జబ్బూ లేదు’ అని ధీమాగా చెప్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటమంటే జబ్బు లేకపోవడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా ఉండటమంటే శారీరకంగా, మానసికంగా, సామాజికంగా క్షేమంగా ఉండటమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. అలాగే మానసిక ఆరోగ్యం లేకుండా శారీరక ఆరోగ్యం ఉండదని హెచ్చరిస్తోంది. కానీ మనం శారీరక సమస్యల గురించి మాట్లాడుకున్నంత స్వేచ్ఛగా మానసిక సమస్యలగురించి మాట్లాడుకోం. మానసిక సమస్యల పట్ల సమాజంలో నెలకొన్న అపోహలే అందుకు కారణం. ఒక సైకాలజిస్టునో, సైకియాట్రిస్టునో కలిశారంటే.. పిచ్చి అని ముద్ర వేస్తారేమోననే భయం. ఈ అపోహలను, భయాలను దూరం చేసేందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం ‘మే’నెలను ‘మెంటల్ హెల్త్ మంత్’గా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో మనదేశంలో మానసిక ఆరోగ్యం స్థితిగతులను, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి? మానసిక ఆరోగ్యమంటే ఒక వ్యక్తి సైకలాజికల్‌గా, ఎమోషనల్‌గా క్షేమంగా ఉండటం. బాలెన్స్డ్ మైండ్, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని కలిగి ఉండటం. ఆలోచనల్లో, ప్రవర్తనలో, భావోద్వేగాల్లో బ్యాలెన్స్ కోల్పోయినప్పుడు మానసిక అనారోగ్యం వస్తుంది. దీర్ఘకాలికంగా కొనసాగే తీవ్రమైన ఒత్తిడి, జీవసంబంధ కారకాలు, మాదకద్రవ్యాల దుర్వినియోగం, ప్రతికూల ఆలోచనలు, ఆర్థిక సమస్యలు, ఒంటరితనం, కుటుంబ కలహాలు వంటి సమస్యలు కూడా మానసిక సమస్యలకు కారణమవుతాయి. దాదాపు 250కి పైగా మానసిక రుగ్మతలు ఉన్నాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, ఫోబియా, ఈటింగ్ డిజార్డర్స్, మానసిక ఒత్తిడి సాధారణ మానసిక రుగ్మతలు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్, క్లినికల్ డిప్రెషన్, సూసైడల్ టెండెన్సీ, పర్సనాలిటీ డిజార్డర్స్ అనేవి తీవ్రమైన మానసిక రుగ్మతలు. వీటిలో కొన్నిటికి కౌన్సెలింగ్, సైకోథెరపీ సరిపోగా, మరికొన్నిటికి మందులు అవసరమవుతాయి. కానీ అన్నింటినీ ‘పిచ్చి’ అనే పరిగణించడం వల్ల కనీసం మాట్లాడేందుకు కూడా భయపడుతున్నారు. అపోహలను ఎలా ఎదుర్కోవాలి? మానసిక రుగ్మతలను పరిష్కరించుకోవాలంటే ముందుగా వాటి పట్ల ఉన్న అపోహలను ఎదుర్కోవాలి. అందుకోసం మీడియాతో పాటు మనమందరం కృషి చేయాలి. అందుకోసం ఈ కింది సూచనలు ఉపయోగపడతాయి. మానసిక అనారోగ్యం సర్వసాధారణం. అది మానసిక బలహీనతకు సంకేతం కాదు. గణాంకాలను చూస్తే మీకు ఈ విషయం అర్థమవుతుంది. మానసిక రుగ్మత లక్షణాలు కనిపించగానే ఎవరో ఏదో అనుకుంటారని భయపడకుండా వెంటనే చికిత్స తీసుకోండి. మీరూ, మీ సమస్య వేర్వేరు. మీ సమస్యతో మిమ్మల్ని ఐడెంటిఫై చేసుకోవద్దు. మీకు ‘బైపోలార్ డిజార్డర్’ ఉంటే, ‘నేను బైపోలార్’ అని కాకుండా ‘నాకు బైపోలార్ డిజార్డర్’ ఉంది అని చెప్పండి. మానసిక అనారోగ్యం గురించి అవగాహన లేనివారి నుంచి మీకు వివక్ష ఎదురుకావచ్చు. దాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. సమస్యను అర్థం చేసుకోలేకపోవడం వారి సమస్యగా పరిగణించండి. మానసిక అనారోగ్యం సిగ్గుపడాల్సిన విషయమేం కాదు. కాబట్టి దాని గురించి మాట్లాడండి. అప్పుడే ప్రజల్లో ఉన్న అపోహలు దూరమవుతాయి. మానసిక అనారోగ్యాల గురించి సరైన వ్యక్తుల నుంచి, సరైన సమాచారాన్ని సేకరించి విస్తృతంగా ప్రచారంలో పెట్టండి. మానసిక రుగ్మత లక్షణాలు నిరంతర ప్రతికూల ఆలోచనలు మరణం లేదా ఆత్మహత్య గురించి ఆలోచించడం ఏకాగ్రత లోపం ఎనర్జీ లెవెల్స్‌లో తీవ్ర మార్పులు ఎక్కువగా ఒంటరిగా గడపాలని కోరుకోవడం నియంత్రించలేని ప్రవర్తన, కోపం, విచారం ఎవరికీ వినిపించని శబ్దాలు వినిపించడం, రూపాలు కనిపించడం ఆత్మహత్యల రాజధానిగా దేశం మన దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక అనారోగ్య లక్షణాలతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో దాదాపు ఆరు నుంచి ఏడు కోట్ల మంది ప్రజలు సాధారణ, తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. ఒక సంవత్సరంలో 2.6 లక్షల ఆత్మహత్య కేసులతో భారతదేశం ప్రపంచ ఆత్మహత్యల రాజధానిగా మారడం బాధాకరమైన విషయం. భారతదేశంలో ప్రతి లక్ష మందికి సగటు ఆత్మహత్యల రేటు 10.9గా ఉందని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు చెబుతున్నాయి. మానసిక నిపుణుల కొరత దేశవ్యాప్తంగా కేవలం 43 ప్రభుత్వ మానసిక ఆరోగ్య సంస్థలు ఉన్నాయి. 11,500 మంది సైకియాట్రిస్టులు అవసరంకాగా కేవలం 3800 మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే నాలుగు లక్షల మందికి ఒక సైకియాట్రిస్ట్ మాత్రమే ఉన్నారు. 17,250క్లినికల్ సైకాలజిస్టులు అవసరం కాగా కేవలం 900 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అలాగే సైకియాట్రిక్ సోషల్ వర్కర్లు, సైకియాట్రిక్ నర్సులు, కౌన్సెలింగ్ సైకాలజిస్టులు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. - సైకాలజిస్ట్ విశేష్ -
బయో బబుల్ కష్టమే.. అయినా భారత క్రికెటర్లు తట్టుకోగలరు
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో ఆయా జట్లు నిర్వహిస్తున్న బయో బబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం కష్టమే అయినప్పటికీ, భారతీయ క్రికెటర్లు మాత్రం సమర్ధవంతంగా తట్టుకోగలరని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేశారు. బయో బుడగలో ఉత్పన్నమయ్యే మానసిక సమస్యలను విదేశీ క్రికటర్ల కన్నా భారతీయ క్రికెటర్లు మెరుగ్గా ఎదుర్కొనగలరని వెల్లడించారు. ఆరేడు నెలలుగా బయో బుడగల్లో విపరీతమైన క్రికెట్ జరుగుతోందని, ఇది చాలా కఠినమైన విషయమని పేర్కొన్నాడు. ఇటువంటి సందర్భాల్లో క్రికెటర్ల మానసిక వైఖరి బాగుంటేనే ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలరని తెలిపాడు. మానసిక ఆరోగ్యం విషయంలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ క్రికెటర్లు చాలా సున్నితంగా ఉంటారని, ఆ విషయాన్ని తాను దగ్గరగా చూశానని వెల్లడించాడు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 14వ సీజన్‌కు ముందు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు మిచెల్ మార్ష్, జోష్ హేజిల్‌వుడ్‌లు బయో బబుల్‌లో రెండు నెలలు గడపడం కష్టమంటూ లీగ్ నుంచి అర్ధంతరంగా వైదొలిగిన విషయాన్ని ఆయన ఉదహరించాడు. కాగా, కోవిడ్-19 నేపథ్యంలో ప్రస్తుతం క్రికెటర్లందరూ బుడగల్లోనే ఉంటూ మానసిక ఒత్తిడి అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం బాహాటంగానే వ్యతిరేకించాడు. చదవండి: ఊపిరి పీల్చుకున్న ముంబై.. ఆటగాళ్లందరికీ కరోనా నెగిటివ్ -
పాతికేళ్లకు కలిసిన పేగు బంధం
సాక్షి ప్రతినిధి, చెన్నై: భర్తపై క్షణికావేశంతో ఆమె ఇల్లు వదిలి వెళ్లింది. రాష్ట్ర సరిహద్దులు దాటినా కుటుంబంపై మమకారం మాత్రం ఆమెను వీడలేదు. కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలను వదిలివచ్చేశానన్న దుఃఖంతో మతిస్థిమితం కోల్పోయింది. అనాథలా ఊళ్లు తిరిగింది. 26 ఏళ్ల తరువాత బిడ్డల చెంతకు చేరింది. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన అంజయ్య భార్య నీలమ్మాళ్ (60). ఈ దంపతులకు సంతోష్‌కుమార్ (34), రాజేష్‌ఖన్నా (32), కవిత (33), మయూరి (30) సంతానం. భర్త అంజయ్య ఏడేళ్ల క్రితం మరణించారు. పిల్లలకు 4 నుంచి 8 ఏళ్ల వయసులో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో నీలమ్మాళ్ ఇల్లు వదిలి బెంగళూరులోని ఒక ఇంటిలో పనిమనిషిగా చేరింది. కొంతకాలానికి మతిస్థిమితం తప్పడంతో బెంగళూరును వదిలి అనేక ప్రాంతాలు తిరిగింది. గతేడాది ఫిబ్రవరిలో చెన్నై ఈస్ట్‌కోస్ట్‌రోడ్డులోని పన్నయూరు బస్టాండ్‌కు చేరుకుంది. అక్కడి ప్రజలు తమిళనాడు నేర రికార్డుల ట్రెజరీ పోలీసుల సహకారంతో ఆమెను ‘లిటిల్ హార్ట్స్’అనే అనాథ శరణాలయానికి చేర్చారు. వైద్యచికిత్సలతో ఆమెకు ఇంటి చిరునామా గుర్తుకువచ్చింది. దీంతో చెన్నై పోలీసులు ఇక్కడి పోలీసుల సహకారంతో నీలమ్మాళ్ పిల్లల్ని చెన్నైకి రప్పించి ఆమెను వారికి అప్పగించారు. -
మానవత్వం మరచిపోయాడు
ఇల్లంతకుంట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో ఓ యువతిపై లైంగిక దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. జనగాం పరశురాం(45) అనే వ్యక్తి మతి స్థిమితం లేని యువతి(19)పై లైంగికంగా దాడికి పాల్పడ్డాడు. మూడు రోజులుగా అతను పరారీలో ఉన్నాడు. ఇల్లంతకుంట పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
అనుమానమే పెనుభూతమై..
రెండు నెలల పాటు కూతుర్నినిర్బంధించిన తల్లి మతిస్థిమితం కోల్పోయిన వైనం స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆస్పత్రికి ఒక్కగానొక్కకూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన ఆ తల్లి చిత్ర హింసలకు గురిచేసింది. అనుమానం పెనుభూతమై తిండీ తిప్పలు లేకుండా చేసింది. ఏకంగా రెండు నెలల పాటు నిర్బంధించింది. ఏవేవో పూజలు చేసింది. చివరకు మతిస్థిమితం కోల్పోయేలా మార్చేసింది. మహిళాసంఘాల సహకారంతో ఆ బాలిక ఆస్పత్రికి చేరింది. ఈ ఘటన రేణిగుంట మండలంలో సోమవారం కలకలం సృష్టించింది. తిరుపతి కార్పొరేషన్: కన్నబిడ్డను కంటికి రె ప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి మూఢనమ్మకాలు, పిచ్చి చేష్టలతో రెండు నెలలుగా గృహ నిర్బంధంలోకి నెట్టింది. సోమవారం ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది. వివరాలు.. రేణిగుంటకు చెందిన ఓ దంపతులకు ఇద్దరు కొడుకులు, కూతురు(17) ఉన్నారు. తల్లి మొదటి నుంచి క్షుద్ర పూజలు, చేతబడులు వంటి వాటిపై నమ్మకం పెంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఇంట్లో అలాంటి వాతావరణాన్ని సృష్టించుకుంది. ఇంటర్మీడియెట్ చదువుతున్న తన ఒక్కగానొక్క కూతురి ప్రవర్తన సరిలేదని గుర్తించింది. క్షుద్రపూజలు చేస్తే మనసు మార్చుకుని దారిలోకి వస్తుందని భావించింది. అంతే పూజల పేరుతో రెండు నెలలు ఇంట్లోనే నిర్బంధించింది. రకరకాల క్షుద్ర పూజలు చేసింది. పైగా కూతురి జడ వెంట్రుకలను కత్తిరించడం, కనీసం అన్నం కూడా పెట్టకుండా నిర్బంధంలో ఉంచడంతో ఆ చిట్టితల్లి మానసికంగా కుంగిపోయింది. పిచ్చిపిచ్చిగా అరవడం, మాట్లాడడం వంటి చేష్టలు చేసేది. దీంతో స్థానికులు గమనించి మహిళా సంఘాలు, సీపీఎం నాయకుల సహకారంతో గృహ నిర్బంధంలో ఉన్న ఆ బాలికను ఆదివారం కాపాడారు. మతి స్థిమితంలేని విధంగా మారిన సదరు బాలికను తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం రుయాలో చికిత్స పొందుతోంది. బాలిక మానసిక పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేవరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు తెలిసింది. -
హార్మోన్ల సమతౌల్యం... హోమియోతో సుసాధ్యం!
ఇటీవలి కాలంలో హైపో థైరాయిడ్, పి.సి.ఓ.డి, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల గురించి తరచూ వింటున్నాం. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి మాత్రమే కాకుండా మన దేహక్రియలు సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు దోహదం చేస్తుంటాయి. వాటి పనితీరులో తేడా వచ్చినప్పుడు దేహానికి ఎదురయ్యే సమస్యలు అనేకం. వాటిలో ముఖ్యమైన సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. హార్మోన్లు అంటే..? హార్మోన్లు పాలీపెప్టైడ్స్తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన కణజాలం లేదా గ్రంథుల నుంచి దేహభాగాలకు రక్తం ద్వారా ప్రవహిస్తూ నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సమతౌల్యంతో పని చేస్తేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఒడుదొడుకులు ఎదురైతే ఆ ప్రభావం జీవక్రియల మీద పడుతుంది. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే మోతాదు చాలా తక్కువే. అయినప్పటికీ వీటి ప్రభావం శరీరంలోని అనేక జీవక్రియల మీద చాలా కీలకంగా ఉంటుంది. సాధారణంగా జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక-మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి ప్రధానమైన పనులను ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ల విడుదల అసమతుల్యతకు లోనయినప్పుడు అది జీవక్రియల మీద ప్రభావం చూపి క్రమంగా తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే (టి3, టి4) హార్మోన్లను థైరాయిడ్ హార్మోన్లు అంటారు. వీటి ఉత్పత్తిలో, పనితీరులో సమతుల్యత లోపించినప్పుడు ఎదురయ్యే సమస్యలను థైరాయిడ్ సమస్యలుగా పరిగణిస్తారు. థైరాయిడ్ హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి శారీరక ఎదుగుదల, జీవక్రియలను నిర్వహణకు తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిని మెదడులోని పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తుంది. దేహంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు తగినంతగా లేనప్పుడు పిట్యూటరీ గ్రంథి అవసరాన్ని గ్రహించి టిఎస్హెచ్ (థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) హార్మోన్‌ని విడుదల చేస్తుంది. టిఎస్హెచ్ సంకేతంతో థైరాయిడ్ గ్రంథి టి3, టి4 హార్మోన్లను విడుదల చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది. ఈ వ్యవస్థ విఫలమై థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు గాయిటర్ అనే దీర్ఘకాలిక సమస్య కూడా వస్తుంది. హైపోథైరాయిడిజమ్: ఇది పిల్లలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. నిస్సత్తువ, చర్మం పొడిబారడం, చెమట తక్కువ, కొద్దిగా బరువు పెరగడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, జుట్టు రాలడం, మతిమరుపు, మలబద్ధకం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం కావడం లేదా త్వరగా జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధుల్లో... కుంగుబాటు, మతిమరపునకు దారి తీస్తుంది. గర్భిణుల్లో... జీవక్రియల వేగం పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అవసరం పెరుగుతుంది. ఆ పెరిగిన అవసరానికి తగినంత ఉత్పత్తి కాకపోయినట్లయితే హైపో థైరాయిడిజమ్ కండిషన్‌కి దారి తీస్తుంది. నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు చేయించుకుంటూ సరైన చికిత్స తీసుకుంటే పుట్టే పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. హైపర్ థైరాయిడిజమ్: హైపో థైరాయిడిజమ్లాగానే ఇది కూడా ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది 20-40 సంవత్సరాల మధ్య వయసులోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని త్వరగా గుర్తించకపోయినా, నిర్లక్ష్యం చేసినా దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు హైపో థైరాయిడిజమ్ లక్షణాలకు భిన్నంగా ఉంటాయి. ఆహారం సరైన మోతాదులో తీసుకున్నప్పటికీ బరువు గణనీయంగా తగ్గిపోవడం, నిద్రలేమి, గుండెదడ, వేడిని తట్టుకోలేకపోవడం, చెమట అధికంగా ఉండడం, చిరాకు, అస్థిమితం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరి త్వరగా రావడంతోపాటు రక్తస్రావం అధికంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయిటర్ అంటే..? థైరాయిడ్ గ్రంథి అసహజంగా వాపుకు గురికావడాన్ని గాయిటర్ అంటారు. ఇది అయోడిన్ లోపం వలన వస్తుంది. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల, రుతుచక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవానికి ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, పిసిఓడి (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్), హిర్సుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్ల ప్రభావం యుక్తవయస్సులో స్పష్టంగా కనిపించినప్పటికీ బాల్యం నుంచే మొదలవుతుంది. నవజాత శిశువులలో రొమ్ములు పెరగడం, కొన్నిసార్లు పాలు కూడా రావడం వంటివి జరుగుతాయి. సాధారణంగా తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ మాయ ద్వారా బిడ్డకు చేరడం వలన ఇలా జరుగుతుంది. ఇది కొన్ని నెలలు లేదా కొన్నేళ్లలో పూర్తిగా తగ్గిపోతుంది. యుక్తవయసులో: ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల కావడానికి కీలక పాత్ర వహిస్తాయి. అండాశయం నుంచి విడుదలయ్యే స్త్రీబీజం పరిపక్వం చెంది గర్భాశయంలోకి చేరుతుంది. ఈ పరిపక్వత చెందిన స్త్రీ బీజం (అండం) ఫలదీకరణ చెందకపోతే అండాశయం నుంచి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి రుతుస్రావం జరుగుతుంది. గర్భధారణ: పరిపక్వం చెందిన అండం ఫలదీకరణ చెందితే గర్భధారణ జరుగుతుంది. గర్భధారణ సమయంలో స్త్రీ హార్మోన్లు క్రమంగా మార్పు చెందుతూ ఉంటాయి. హెచ్‌సిజి అనే హార్మోన్ మాయ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది అండాశయాన్ని ప్రేరేపించి అధికమొత్తంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. ఇది గర్భం కొనసాగించేందుకు సహాయపడుతుంది. ప్రసవం అనంతరం ఈ హార్మోన్ల మోతాదు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. మెనోపాజ్: రుతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీలలో హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. దీంతో దేహం నుంచి వేడి ఆవిర్లు, నిద్రలేమి, మానసిక అశాంతి, నీరసం, కీళ్లు, కండరాల నొప్పుల వంటి సమస్యలు వస్తాయి. పిసిఓడి: స్త్రీలలో సాధారణంగా 20 శాతం మంది పిసిఓడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే స్త్రీలలో అండాశయం నుంచి పురుష హార్మోన్లయిన టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీంతో సంతానలేమి, నెలసరి సమస్యలు (సరిగ్గా రాకపోవడం), అవాంఛిత రోమాల పెరుగుదల వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇన్సులిన్ అసమతుల్యత మధుమేహం లేదా చక్కెరవ్యాధిగా వ్యవహరించే ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో డయాబెటిస్ మెలిటస్ అంటారు. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయులు తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత జీవక్రియలు (మెటబాలిజమ్), రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి డయాబెటిస్ మిలిటస్ టైప్1, టైప్2. టైప్ 1 డయాబెటిస్: ఇది క్లోమ గ్రంథిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హ్యాన్స్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల సంఖ్య తగ్గిపోవడం లేదా పూర్తిగా నశించిపోవడం వల్ల కలుగుతుంది. ఆటోఇమ్యూనిటీ వల్ల టి- కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం. ఈ వ్యాధిని చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి దీనిని ‘జువైనల్ డయాబెటిస్’ అంటారు. టైప్ 2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వలన వస్తుంది. కారణాలు: మధుమేహం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి కూర్చుని ఉండడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టిరాయిడ్స్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వల్ల కూడా మధుమేహం వస్తుంది. లక్షణాలు: అతిమూత్రం, అతి ఆకలి, అతి దాహం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, నీరసం, అలసట కూడా ఉంటాయి. కొందరిలో ఈ లక్షణాలేవీ పైకి కనిపించకపోవచ్చు. కొందరిలో చేతులు, పాదాలు తిమ్మిర్లు లేదా మంట, జననేంద్రియాల వద్ద దురద, ఒళ్లంతా దురదలు, దెబ్బలు గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ దంతాల సమస్యలు, చిగుళ్ల వ్యాధులు కనిపిస్తుంటాయి. డయాబెటిస్తో అనర్థాలు: డయాబెటిస్తో బాధపడే వారిలో రక్తంలోని చక్కెర పాళ్లను సరిగ్గా నియంత్రణ చేయకపోవడం వలన దీర్ఘకాలంలో డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, గుండె సమస్యలు వంటి అనుబంధ సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఇన్సిపిడస్: ఇది ఎడిహెచ్ (యాంటీ డైయూరిటిక్ హార్మోన్) లోపం వలన వస్తుంది. దీనినే అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు. పారాథార్మోన్ థైరాయిడ్ గ్రంథికి ఇరుపార్వ్శాలలో పారా థైరాయిడ్గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి ఉత్పత్తి అయిన పారాథార్మోన్ దేహంలో కాల్షియం మెటబాలిజమ్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దీని అసమతుల్యత వలన హైపో మరియు హైపర్ పారా థైరాయిడిజమ్ పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు... ఎముకలు ఆస్టియోపోరోసిస్‌కు గురి కావడం చేత బలహీన పడి త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది. కొన్నిసందర్భాలలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు, కండరాలు పట్టివేయడం, నీరసం, అలసట కూడా కలగవచ్చు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యత వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కార్టికో స్టిరాయిడ్స్ ఇవి అన్ని ముఖ్యమైన జీవక్రియల్లోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యతల వలన కుషింగ్స్, అడిసన్స్ వ్యాధులు వస్తాయి. అపోహలు - వాస్తవాలు అపోహ: హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు కఠినమైన పథ్యాన్ని పాటించాలి. వాస్తవం: హోమియో మందులకు ఎటువంటి పథ్యం అవసరం లేదు. అయితే మందు తీసుకునే ముందు తర్వాత కొద్ది నిమిషాల పాటు ఏమీ తీసుకోకపోతే మందు చక్కగా పనిచేస్తుంది. అపోహ: హోమియో మందులు తీసుకుంటున్న సమయంలో అల్లోపతి మందులు వాడితే అప్పటి వరకు వాడిన హోమియో మందుల ప్రభావం పోతుంది. వాస్తవం: అత్యవసరాలకు అల్లోపతి మందులు వాడవచ్చు. అయితే హోమియో మందులు వేసుకోవాల్సిన సమయంలోనే రెండూ కలిపి తీసుకోకుండా కనీసం 15 నిమిషాల విరామం ఉండాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి నిర్ధారణ పరీక్షలు హైపోథైరాయిడిజమ్, పి.సి.ఓ.డి, సంతానలేమి మధుమేహం... రక్తపరీక్ష, మూత్రపరీక్ష, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, మూత్రంలో చక్కెరస్థాయులు వంటి పరీక్షలు థైరాయిడ్ సమస్యలు... టి3, టి4, టిఎస్హెచ్, అల్ట్రాసౌండ్ నెక్, ఎమ్ఆర్ఐ వంటి పరీక్షలు స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, సంతానలేమి, హార్మోన్ సమస్యలకు... ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, డిహెచ్‌ఇఎ, ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, ఎస్హెచ్బిజి వంటి పరీక్షలు హోమియో మందులు సెపియా: ఇది హైపోథైరాయిడిజమ్తోపాటు స్త్రీలలో కలిగే హార్మోన్ సమస్యలకు ప్రధానంగా పనిచేస్తుంది. రుతుక్రమ సమస్యలతోపాటు గర్భాశయం జారిపోవడం వంటి అనేక జననేంద్రియ సమస్యలకు వాడదగిన ఔషధం. ఈ సమయంలో చిరాకుగా ఉండడం, కుటంబసభ్యులతో భిన్నంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఉండాలనిపించడం వంటి సమస్యలు కలిగి ఉంటారు. వీటన్నింటికీ సెపియా మంచి ఔషధం. కాల్కేరియా కార్బ్: లావుగా ఉండి చలిని తట్టుకోలేకపోవడం, తల మీద ఎక్కువగా చెమట పట్టడం, రుతుక్రమ సమస్యలతోపాటు మలబద్ధకం ఉన్న వారికి చక్కటి ఔషధం ఫాస్ఫారిక్ యాసిడ్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాడదగిన మందు. మూత్రంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండడం, ఫాస్ఫేట్ నిల్వలు ఎక్కువగా ఉండడం, శారీరక బలహీనత, ఆకలి లేకపోవడం, అతిదాహం, మానసికంగా శోకం, ఆందోళన, ఉదాసీనత వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడాల్సి ఉంటుంది. లాకెసిస్: ఇది మెనోపాజ్ దశలో ఉన్న వారికి మంచి ఔషధం. హోమియో వైద్యంలో ప్రతి వ్యక్తికీ శరీర లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. ఇద్దరు వ్యక్తులు మధుమేహంతో వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఇద్దరిలోనూ లక్షణాలు వేరుగా ఉండవచ్చు. మధుమేహంతోపాటు ఎవరికి వారికి విడిగా మరికొన్ని ఇతర వ్యాధులు కలిగి ఉండవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మందులను వాడాల్సి ఉంటుంది.