మనుషుల మానసిక ఆరోగ్యంపై పక్షుల ప్రభావం కూడా ఉంటుందని విన్నారా?. అసలు మన మానసిక పరిస్థితికి పక్షులకు లింక్ ఏంటీ. అవి ఎలా మన మనఃస్థితిని ప్రభావితం చేయగలవు అనే కదా సందేహం!. అయితే పరిశోధకులు మాత్రం వాటి వల్లనే మన మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నవారికి పక్షులను చూసే అవకాశం ఉండదు కదా! అని అడగొచ్చు దానికి శాస్త్రవేత్తలు ఏం అంటున్నారంటే..
పక్షులను చూడటం లేదా వీక్షించటం, వాటి కిలకిలరావాలను వినడం వంటివి చేస్తే తెలియకుండా మానసిక ప్రశాంతత చేకూరి సంతోషంగా ఉంటామని పరిశోధకులు చెబుతున్నారు. దీని వల్ల నిరాశ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు ఉత్ఫన్నం కావని అన్నారు. ఈ మేరకు సుమారు 13 వందల మందిని క్షుణ్ణంగా అధ్యయనం చేయగా...పక్షులను చూడటం, వాటి శబ్దాలను విన్న వారి మానసిక ఆరోగ్యం బాగున్నట్లు గమనించారు.
పక్షులతో పనిగట్టుకుని గడపడం మొదలుపెట్టాక నెమ్మదిగా మెరుగుదల కనిపించింది. ముఖ్యంగా ఈ మెరుగుదలను డిప్రెషన్‌తో బాధపడుతున్న వారిలోనూ, ఆరోగ్యవంతమైన వ్యక్తులలోనూ కనిపించాయన్నారు. అలాగే మరో అధ్యయనంలో పాల్గొన్న దాదాపు 295 మందిని పక్షులతో గడిపి తమ భావోద్వేగ స్థితిని స్వయంగా అంచనా వేసి చెప్పాలని కోరారు. వారంతా పక్షి పాటలను విన్నప్పటి నుంచి డిప్రెషన్ లక్షణాలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపారు. అంతేగాదు మతిస్థిమితం, మరచిపోవడం వంటి రుగ్మతలు కూడా తగ్గినట్లు వెల్లడించారని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, ప్రకృతితో గడపలేకపోయినా కనీసం పక్షుల కిలకిల రావాలను మనసును ఆహ్లాదపరిచి స్థిమ్మితంగా ఉండేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఆరోగ్యంపై ప్రకృతి ప్రభావం చూపుతోందా?
మానసిక ఆరోగ్యంపై ప్రకృతి చూపించే ప్రభావాన్ని సాఫ్ట్ ఫాసినేషన్‌గా చెప్పొచ్చు. మన దృష్టి ప్రకృతి వద్దకు వచ్చేటప్పటికీ విస్తృతంగా చూసేలా చేసి మెదడు తనను తాను రిఫ్రెష్ చేసుకునేలా చేస్తుంది. తద్వారా మానసిక ప్రశాంత పొంది, మతిమరుపు, మతిభ్రమించడం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే తనకు తానుగా బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అంతేగాదు ప్రకృతి దృశ్యాలు, శబ్దాలు మనలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి ప్రతికూల ఆలోచనలను దరిచేరనివ్వదు.
ఈ పరిశోధన జర్నల్ ఆక్యుపేషనల్ అండ్ ఇన్విరాన్‌మెంటల్ మెడిసన్‌లో ప్రచురితమయ్యింది. సామాజిక ఆర్థిక పరిస్థితి సంబంధం లేకుండా పచ్చని ప్రదేశాలను సందర్శిస్తే..వారి మానసిక స్థితి మాత్రమేగాక, యాంటీహైపెర్టెన్సివ్, ఆస్తమా వంటి సమస్యలు తగ్గుతాయని అధ్యయనంలో తేలిందన్నారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకైనా పక్షుల అభయారణ్యాలు, పర్వతాలు, బీచ్‌లు, సరస్సులు, నదులు వద్ద గడపండి అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
(చదవండి: సోనియా గాంధీ మెచ్చిన 'పప్పు అన్నం'! బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)
Comments
Please login to add a commentAdd a comment