Bowls
-
మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..
'టిబెటన్ సింగింగ్ బౌల్స్'ని ధ్వనితో అందించే ఒక విధమైన హీలింగ్ చికిత్సలో ఉపయోగిస్తారు. ఈ గిన్నెలు ఆధ్యాత్మిక అభ్యాసాలలో ముఖ్యంగా బౌద్ధ ఆచారాలలో ఉపయోగిస్తారు. మంచి ఆలోచనలకి, ధ్యానానికి సహాపడతాయని నమ్ముతారు. ఇది మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 'టిబెటన్ సింగింగ్ బౌల్' అనేది ధ్యానం, వైద్యం, విశ్రాంతి కోసం ఉపయోగించే ఒక సంప్రదాయ వాయిద్యం. దీన్ని లోహాల మిశ్రమాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఈ గిన్నెలను మేలట్(ఒక రకమైన సాధనం)తో అంచు వెంబడి కొడితే ప్రతిధ్వనించే శబ్దాలు వస్తాయి. ఈ కంపనాలు ఓదార్పునిచ్చేలా ఒత్తిడిని దూరం చేసి, శరీరంలో సమతుల్యతను పునరుద్ధరించడానికి సహాయపడతాయి. ఈ సౌండ్ థెరపీ అనేది ఒక రకమైన హీలింగ్ థెరపీలా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇది మానసిక ఉల్లాసానికి, ధ్యానానికి సహాయపడుతుందనేది బౌద్ధుల నమ్మకం.ఈ టిబెటన్ సింగింగ్ బౌల్స్ మానసిక ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయంటే..ఒత్తిడిని, ఆందోళనని దూరం చేస్తుంది..ఈ బౌల్స్ నుంచి వచ్చే కంపనాలు మనస్సుని, శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడంలో సహాయపడతాయి. ఈ శబ్దాలు వినడం వల్ల ఒత్తడి హర్మోన్ స్థాయిలు తగ్గి తద్వారా ఆందోళనను దూరం చేస్తుంది. డీప్ రిలాక్సేషన్..ఈ గిన్నెల ద్వారా వచ్చే ప్రతి ధ్వని ధ్యాన స్థితిలోకి రావడానికి సహాయపడుతుంది. తద్వారా సుదీర్ఘ విశ్రాంతి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సున్నితమైన శబ్దాలు మెదడు తరంగాలను నెమ్మదింప చేయడానికి సహాయపడతాయి. దృష్టి స్పష్టత మెరుగవుతుందిఈ శబ్దాలు దృష్టి కేంద్రీకరించడానికి వీలు కల్పిస్తుంది. అంతేగాదు మానసిక స్పష్టత వచ్చేలా ఏకగ్రతతో ఉండేలా చేస్తుంది.భావోద్వేగాలను అదుపులో ఉంచుతుందిఈ శబ్దాలను క్రమతప్పకుండా వినడం వల్ల భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. ఈ శబ్దాలు అంతర్గత శాంతి, భావోద్దేవగ స్థిరత్వాన్ని అందిస్తాయి. తద్వారా కోపం లేదా విచారం వంటి ప్రతికూల భావోద్వేగాలను తగ్గుతాయి,నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందిఈ కంపనాలు నాడీ వ్యవస్థను శాంతపరిచి మంచి నిద్రపట్టేలా చేస్తుంది. నిద్రలేమితో పోరాడుతున్న వ్యక్తులకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఎనర్జీని బ్యాలెన్స్‌గా.. ఈ కంపనాలు శరీరంలో చక్రాలుగా పిలిచే శక్తి కేంద్రాలను సమతుల్యం చేస్తుంది. ఇలా సమస్థాయిలో ప్రసారమయ్యే శక్తి స్థాయిలు మంచి మానసిక శ్రేయస్సుని అందిస్తాయి.డిప్రెషన్ లక్షణాలు..ఈ సౌండ్ థెరపీ డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. మనస్సుని ఉల్లాసంగా ఉండేలా చేసి నిరాశ నిస్ప్రుహలను దూరం చేస్తుంది. మైండ్-బాడీ కనెక్షన్..ఈ కంపనాలు మనస్సు, శరీర సంబంధాన్ని బలోపేతం చేస్తాయి. రోజువారీ పనుల్లో ఎదురయ్యే భావోద్వేగ స్థితులకు తొందరగా ప్రతిస్పందించక బ్యాలెన్స్‌గా ఉంచడమే గాక మానసిక కల్లోలానికి తావివ్వదు. ఫలితంగా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.(చదవండి: మిల్కీ బ్యూటీ డైట్ సీక్రెట్ ఇదే!.. మెరిసే చర్మం కోసం..) -
ఏదో చేయాలి.. ఏం చేద్దాం.. ‘కొబ్బరి చిప్పలను ఏం చేస్తున్నారు’
‘మనసుంటే మార్గమూ ఉంటుంది’ అనే నానుడి మరోసారి నిజమైంది. కేరళ, త్రిశూర్ అమ్మాయి మారియా కురియాకోస్ ఎంబీఏ చేసింది. ముంబయిలో ఒక సోషల్ ఎంటర్ ప్రైజ్‌లో ఉద్యోగం చేసింది. ‘తనకు తానుగా ఏదో ఒకటి ఆవిష్కరించలేకపోతే జీవితానికి పరమార్థం ఏముంటుంది?’ అని కూడా అనుకుంది. ఉద్యోగం మానేసి సొంతూరు త్రిశూర్కి వచ్చేసింది. ఏదో చేయాలని ఉంది, కానీ ఏం చేయాలనే స్పష్టత రావడం లేదు. ఊరికే ఇంట్లో కూర్చుంటే ఆలోచనలు ఎలా వస్తాయి? అలా ఊరంతా తిరిగి నలుగురిని చూస్తే కదా తెలిసేది... అనుకుంది. త్రిశూర్‌లో ఏమున్నాయి? ఏమి లేవు అనేది కూడా తెలుసుకోవాలి కదా! అనుకుంటూ త్రిశూర్‌లోని రోడ్లన్నీ చుట్టిరావడం మొదలుపెట్టింది. తనకు తెలిసిన ఊరే అయినా, ఇప్పుడు కొత్తగా తెలుస్తోంది. ఒక కొబ్బరి నూనె మిల్లు కనిపించింది. కేరళ అమ్మాయికి కొబ్బరి నూనె మిల్లును చూడడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి ఆమె దృష్టిని ఆకర్షించింది కొబ్బరి నూనె కాదు, నూనె కోసం కొబ్బరి వలిచిన తర్వాత మిగిలిన ఖాళీ కొబ్బరి చిప్పలు. రాశులుగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తారని అడిగింది. పొయ్యిలో వంటచెరకుగా వాడతారు, ఇటుకలను కాల్చడానికి బట్టీల్లో వాడతారని తెలుసుకుంది. అంత గట్టి మెటీరియల్ బొగ్గుగా కాలిపోవడమేంటి? వీటిని ఉపయోగించే తీరు ఇది కాదు, మరింత ఉపయుక్తంగా ఉండాలని ఆలోచించింది మారియా. కోకోనట్ కప్ కొబ్బరి చిప్పలు కిందపడినా పగలవు. ఇంకేం! సెంటెడ్ క్యాండిల్ తయారు చేయడానికి గాజు కుండీలకంటే కొబ్బరి పెంకులే మంచి బేస్ అనుకుంది మారియా. సూప్ తాగడానికి కూడా పింగాణీ కప్పుల కంటే కొబ్బరి పెంకు కప్పులే సేఫ్. అంతే కాదు, హ్యాంగింగ్ గార్డెన్‌కి కూడా కొబ్బరి కుండీలే. ఫోర్క్‌లు, స్పూన్లు కూడా. మన్నిక ఓకే, మరి కొబ్బరి పెంకును అందంగా తీర్చిదిద్దడం ఎలా? తండ్రి మెకానికల్ ఇంజనీర్. రిటైరయ్యాడు కాబట్టి ఆయన కూతురికి అవసరమైన యంత్రాన్ని రూపొందించడంలో నిమగ్నమయ్యాడు. పూర్వం స్టీలు గరిటెలు, గిన్నెలు లేని రోజుల్లో గరిటలుగా కొబ్బరి చిప్పలనే వాడేవారని తెలుసుకున్న తర్వాత మారియా ఆ వృత్తి పని వారి కోసం అన్వేషణ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ పని అన్నానికి భరోసా ఇవ్వకపోవడంతో వాళ్లు ఇతర ఉపాధి పనులకు మారిపోయారు. త్రిశూర్, కొట్టాయం, వయనాడుల్లో విస్తృతం గా సర్వే చేసి, ఆ వృత్తిదార్లను సమీకరించింది. ఇప్పుడామెతో కలిసి పదిమంది పని చేస్తున్నారు. గతంలో అయితే కొబ్బరి చిప్పలను ఉలి సహాయంతో చేత్తోనే నునుపుగా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మారియా డిజైన్ చేయించుకున్న మెషీన్‌తో రకరకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ‘తెంగ’ పేరుతో ఆమె రిజిస్టర్ చేసుకున్న పరిశ్రమ ఇప్పుడు స్థిరమైన రాబడినిస్తోంది. తెంగ ఉత్పత్తులకు కేరళతోపాటు తమిళనాడు, కర్నాటక నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. కస్టమర్లకు పేర్లు ముద్రించి ఇవ్వడం ఆమె ఎంచుకున్న మరో చిట్కా. అమెజాన్ ద్వారా జర్మనీలో అమ్మకాలకు కూడా రంగం సిద్ధమైంది. కేరళలో కొబ్బరి వలిచిన ఖాళీ కొబ్బరి చిప్పలు సూప్ బౌల్స్‌గా జర్మనీకి చేరనున్నాయి. తండ్రితో మారియా కురియాకోస్ -
ఆహారాలు ప్లాస్టిక్ బౌల్లో వద్దు!
ఇటీవల మనం అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్స్‌లో ఆహారాలను వడ్డించడం అలవాటు చేసుకున్నాం. అయితే పైకి అందంగా కనిపించే ఈ బౌల్స్ ఆరోగ్యం విషయానికి వస్తే అంత మంచివి కాదు. ఈ బౌల్స్ ‘మెలమెన్’ అనే ప్లాస్టిక్‌లతో తయారవుతాయి. వేడి వేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్‌లో మెలమైన్... ఆహారంతో పాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలోకి వెళ్లిన ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని ‘జామా ఇంటర్నల్ మెడిసిన్’ జర్నల్‌లోనూ ప్రచురితమైంది. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమందికి మెలమైన్ బౌల్స్‌లో నూడుల్స్ ఇచ్చారు. మరికొందరికి పింగాణీ బౌల్స్‌లో ఇచ్చారు. ఈ రెండు గ్రూపుల వారికి నిర్వహించిన మూత్ర పరీక్షల్లో మెలమైన్ బౌల్స్‌లో తిన్న వారి మూత్రంలో మెలమైన్ పాళ్లు దాదాపు ఎనిమిది రెట్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది. ఫలితంగా వారిలో కిడ్నీఫెయిల్యూర్‌కు దారితీసే అవకాశంతోపాటు క్యాన్సర్ ప్రమాదమూ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలు చెబుతున్నాయి. మెలమైన్ బౌల్లో ఉంచి ఏ ఆహారాన్నీ మైక్రోవేవ్ ఒవెన్‌లో వేడిచేయకూడదు. ఈ అంశాన్ని అమెరికన్ ప్రమాణాల సంస్థ ఎఫ్‌డీఏ కూడా గట్టిగానే సిఫార్సు చేస్తోంది. ఈ ప్లాస్టిక్ ప్రభావం మహిళల్లోని ఈస్ట్రోజెన్ హార్మోన్‌పై ఉంటుంది. దీనివల్ల గర్భధారణ సమస్యలు రావచ్చు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య, కదలికలు తగ్గవచ్చు. చాలామందిలో డయాబెటిస్ రిస్క్ పెరుగుతున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. రొమ్ము క్యాన్సర్ వంటి క్యాన్సర్ రిస్క్‌లు చాలా ఎక్కువ. ప్లాస్టిక్ బౌల్స్‌లో వేడి వేడి ఆహారం పెట్టుకుని తీసుకునేవారిలో మెదడు కణాలు బలహీన పడి జ్ఞాపకశక్తి తగ్గుతున్నట్లు, మూడ్స్ మారిపోవడం వంటి సమస్యలు వస్తున్నట్లు గుర్తించారు. అలై్జమర్స్ వంటి వ్యాధులు కూడా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే కూరలు, పులుసులకు ప్లాస్టిక్ బౌల్స్ కాకుండా పింగాణీ బౌల్స్ వాడటం మేలని నిపుణులు చెబుతున్నారు. చదవండి: కరోనా సెకండ్ వేవ్: ఆడవాళ్లు ఈ ఆహారం తీసుకోవాలి! -
పదార్థాల ప్రత్యేకత కోల్పోకుండా...
ఇంటిప్స్ పదార్థాలను శుభ్రపరచడం, వేరు చేయడం, వండటం, నిల్వ చేయడం.. ఈ నాలుగు విధానాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆహారం విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారాన్ని శుభ్రపరిచేటప్పుడు గోరువెచ్చని ఉప్పు నీటిని ఉపయోగించాలి. {ఫిజ్‌లో లేదా షెల్ఫ్‌లలో పదార్థాలను ఒకే పాకెట్లో 3-4 రకాలవి వేసి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల ఆయా పదార్థాలకున్న ప్రత్యేక వాసన, పోషకాలు కోల్పోతాయి. పదార్థాలను కట్‌చేసేటప్పుడు, వేరు చేసేటప్పుడు గోరువెచ్చని నీటితో తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. కటింగ్ బోర్డులు, గిన్నెలు ఉపయోగించడానికి ముందు, తర్వాత తప్పనిసరిగా సబ్బు నీటితో శుభ్రపరచాలి. నీచు వాసన రాకుండా ఉండటానికి ఘాటువాసనలు లేని బ్లీచ్‌ని ఉపయోగించవచ్చు.