
బొప్పాయి పండులో కాయ ఉన్న దృశ్యం
విజయనగరం, తెర్లాం : ‘సాధారణంగా బొప్పాయి పండులో నల్లటి పిక్కలు ఉండడం ఎక్కువగా చూస్తుంటాం. కానీ బొప్పాయి పండు కోయగా పిక్కలకు బదులుగా మరొక కాయ లోపల ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. తెర్లాంలోని ఎం.ఎల్.ఎస్ పాయింట్ గోదాము ఇన్‌చార్జిగా పనిచేస్తున్న కుప్పిలి నాగేశ్వరరావు మార్కెట్‌లో వివిధ రకాల పండ్లు విక్రయించే వారి నుంచి బొప్పాయి పండును కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చారు. బొప్పాయి పండు పైనున్న తొక్కను తీసేసి, పండును రెండు ముక్కలు చేయగా అందులో మరొక బొప్పాయి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు.
బొప్పాయి పండులో పిక్కలకు బదులుగా కాయ ఉండడంతో చుట్టు పక్కల ఉన్న వారికి ఇదే విషయాన్ని తెలియజేశారు. బొప్పాయి పండులో మరొక కాయ ఉండడం చూసిన ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురయ్యారు. బొప్పాయి పండులో మరొక కాయ ఉన్న విషయాన్ని మండల ఉద్యాన వన శాఖ అధికారి వెంకటరత్నం వద్ద ప్రస్తావించగా జన్యుపరమైన సమస్యల వల్ల బొప్పాయి పండులో కాయ వచ్చి ఉండవచ్చని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment