హెల్త్‌ కార్నర్ | Health Corner | Sakshi
Sakshi News home page

హెల్త్‌ కార్నర్

Published Sat, Jun 4 2016 11:22 PM | Last Updated on Fri, Aug 24 2018 7:14 PM

హెల్త్‌ కార్నర్ - Sakshi

హెల్త్‌ కార్నర్

మధుమేహం వచ్చే సూచనలు ఉన్నవారు అరచెంచా మెంతిపొడిని ప్రతిరోజూ భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా చేస్తే కొన్నేళ్ల వరకు మధుమేహం రాకుండా నివారించ వచ్చు.
 
చాలామందికి చిగుళ్ల నుంచి తరచు రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒక ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసుకొని, అందులో చిటికెడు ఉప్పు వేసి నూరుకోవాలి.  ఆ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు చిగుళ్లకు రాస్తే సమస్య తీరుతుంది.
 
ప్రతిరోజూ గ్లాసు నీళ్లలో పావు టీ స్పూన్ యాలకుల పొడిని కలుపుకొని తాగితే.. యూరినరీ ఇన్‌ఫెక్షన్ బాధ నుంచి బయటపడొచ్చు.
 
అరిగిన కీళ్లు, ఎముకలతో బాధపడేవారు.. చింతగింజలను వేయించి, వాటి తొక్క తీసి పొడి చేసుకోవాలి. ఒక చెంచా చింతగింజల పొడిని వేడి నీళ్లలో కలుపుకొని రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేస్తే ఎముకల మధ్యలో కరిగి పోయిన గుజ్జు  తిరిగి తయారవుతుంది.
 
ఎండిన ఉసిరికాయలను పొడి చేసి ఓ సీసాలో పెట్టుకోవాలి. ప్రతిరోజూ ఉదయం టీ స్పూన్ ఉసిరిపొడిలో టీ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే ఆస్తమా సమస్య క్రమంగా తగ్గుతుంది.
 
కాళ్లు, చేతులు బెణికినప్పుడు.. ఆ ప్రాంతంలో వేడినీళ్లలో ముంచిన క్యాబేజీ ఆకులను పెట్టి బ్యాండేజ్ వేసుకోవాలి. గంట గంటకు క్యాబేజీ ఆకులను మార్చాలి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement