హెల్త్‌కార్నర్
* తరచూ చెవి నొప్పితో బాధపడేవారు.. చెంచా ఉల్లిరసంలో అరచెంచా తేనె వేసి బాగా కలిపి ఓ సీసాలో పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని రోజుకు రెండు పూటలా 5-10 చుక్కలు నొప్పిగా ఉన్న చెవిలో వేసుకుంటే.. మంచి ఉపశమనాన్ని పొందుతారు.
* ఎండలో లేక దుమ్ముగా ఉన్న ప్రాంతాల్లో తిరిగినప్పుడు చాలామందికి కళ్లు ఎర్రగా మారి మంట పుడుతుంటాయి. అలాంటప్పుడు కంటిలో రెండు చుక్కల స్వచ్ఛమైన రోజ్ వాటర్ వేసుకుంటే చాలు.. కొద్ది క్షణాల్లో మంట తగ్గుతుంది.
* రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే.. సైనస్ కారణంగా బాధించే తలనొప్పి మటుమాయం అవుతుంది..
* తరచూ చిగుళ్ల నుంచి రక్తం వస్తున్నట్లయితే.. రోజూ బ్రష్ చేసుకున్న తర్వాత, అలాగే రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో చిగుళ్లకు మర్దనా చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితం త్వరగా కనిపిస్తుంది.
* రుతుక్రమం సమయంలో కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు.. చెంచా అలోవెరా జెల్‌లో చిటికెడు నల్ల మిరియాల పొడిని కలిపి రోజుకు మూడు పూటలా తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది..
* నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలంటే.. ఒక తమలపాకులో రెండు లవంగాలు పెట్టుకొని తింటే సరిపోతుంది. ఇలా రోజుకు ఒక్కసారి మాత్రమే చేయాలి. లవంగానికి బదులుగా వక్కను కూడా ఉపయోగించొచ్చు.