దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స | homeopathic remedies for Cough fatigue, allergy, asthma | Sakshi
Sakshi News home page

దగ్గు ఆయాసం, అలర్జీ - అస్తమాకు హోమియోలో తగిన చికిత్స

Published Thu, Oct 17 2013 11:20 PM | Last Updated on Fri, Sep 1 2017 11:44 PM

homeopathic remedies for Cough fatigue, allergy, asthma

మానవ శరీరం ఒక అద్భుతం! శరీరంలోని ఎలాంటి పదార్థాలు, క్రిములు వచ్చినా వాటిని ఎదుర్కొని పోరాడేలా దేవుడు దానిని నిర్మించాడు. దీనినే మనం ‘‘ఇమ్మూనిటీ’’ లేదా రోగ నిరోధక వ్యవస్థ అంటారు. దీని వలన మన శరీరంలోనికి గాలి ద్వారా, నీటిద్వారా, ఆహారం ద్వారా ఎలాంటి ప్రతికూల పదార్థములు బాక్టీరియా, వైరస్, ఫారెన్ ప్రొటీన్‌లు వచ్చినా తెల్లరక్తకణాలు వాటితో పోరాడి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే కొంత మందిలో ఈ వ్యాధినిరోధక వ్యవస్థ ఇతరులకు ఎలాంటి హాని కలిగించని పదార్థాల వలన కూడా సున్నితంగా ప్రతిస్పందిస్తుంది. దీనినే ‘‘హైపర్ సెన్సిటివీటి’’ లేదా ‘‘అలర్జీ’’ అని అంటారు.
 
 గాలిలో దుమ్ము, పుప్పొడి వంటివి ఉన్నప్పుడు అలర్జీతో బాధపడేవారికి ఇక అదే పనిగా వరుసబెట్టి తుమ్ములు వస్తాయి. ఆ తర్వాత ముక్కు ఎరుపెక్కి, జలుబు చేసి, పల్చని నీరులా స్రవిస్తుంది. దానితో పాటు కళ్ళు ఎరుపెక్కి కళ్ళ నుండి నీరు కారుతుంది. దీనిని అశ్రద్ధ చేసినట్లయితే ముక్కు దిబ్బడ, గాలి సరిగ్గా ఆడకపోవడం, గొంతులోనికి కళ్ళె వస్తూ ఉండడం, ముఖం లోపలిభాగంలో నొప్పి, తలనొప్పి మొదలైతే ‘‘అలర్జిక్ సైనసైటిస్’’ అని, గాలి గొట్టాలలోనికి, ఊపిరితిత్తులకు సోకి పొడి దగ్గు, కళ్లెతో కూడి దగ్గు మొదలైతే ‘‘అలర్జిక్ బ్రాంకైటిస్’’ అని ఆయాసం, ఎగపోయడం, పిల్లికూతలు వంటి లక్షణాలు కన్పిస్తే ‘‘అలర్జిక్ ఆస్థ్మా’’ అని అంటారు.

                                                                    *****************

 దగ్గు అనేది సాధారణంగా అందరిలో కనిపించే ఒక లక్షణం. ఏదైనా దుమ్ము, ధూళి లేదా అలర్జీలు లోపలికి ప్రవేశించేటప్పుడు, దగ్గు అనే ప్రక్రియ ద్వారా అని బయటకు రావటం జరుగుతుంది. ఒక్కొక్కసారి పొడిదగ్గు లేదా శ్లేష్మంతో కూడిన దగ్గు కూడా వస్తూ ఉంటుంది. సాధారణంగా, దగ్గు చాలా ఎక్కువగా చిన్న పిల్లల వయసు నుంచి గమనిస్తూ ఉంటాము.
 
 శ్లేష్మంతో కూడిన దగ్గు ముక్కు నుంచి గొంతులోకి పోయి, అక్కడి నుంచి సైనస్ లేదా ఊపిరితిత్తులలోకి ప్రవేశించడం జరుగుతుంది. శ్లేష్మంతో కూడిన దగ్గుకి చాలా త్వరితంగా చికిత్స చేయలేకపోతే అది ఆస్త్మా కిందకు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
 
 కారణాలు:
 వైరల్ ఇన్‌ఫెక్షన్స్ వలన
 
 దీర్ఘకాలికంగా ఊపిరితిత్తులకు వ్యాధులుసోకిన
 
 గ్యాస్ట్రో ఈసోఫెజియల్ రిఫ్లక్స్ డిసీజ్‌తో
 
 ముక్కునుంచి వచ్చే స్రావం గొంతులోకి వెళ్ళటం
 
 పొగతాగటం
 
 దుమ్ము, ధూళిలో తిరగడం వలన
 
  ఏదైనా పదార్థం గొంతులో అడ్డుపడటం వలన ఇంచు మించు  శ్లేష్మం ఉన్నా, లేకపోయినా, దగ్గు గనుక 2-3 రోజుల నుంచి మొదలై, 7 నుంచి 10 రోజులలో తగ్గిపోతుంది. దానిని ‘అక్యూట్ బ్రాంకైటిస్’ అంటారు. ఈ స్టేజ్‌లో ఉన్న వ్యాధికి సరిగ్గా చికిత్స లేకపోతే అది దీర్ఘకాలికంగా అంటే 2 నుంచి 3 నెలల వరకు పూర్తిగా తగ్గకుండా ఉంటే దానిని ‘క్రానిక్ బ్రాంకైటిస్’ అంటారు. కాని దగ్గు త్వరితంగా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, మొదటగా వ్యాధి నిరోధక వ్యవస్థ శక్తి క్షీణించటం వలన ఇన్ఫెక్షన్ శరీరం మీదకి ముఖ్యంగా వ్యక్తుల తత్తాన్ని బట్టి ఊపిరితిత్తుల మీదకు ప్రభావితం కావటం జరుగుతుంది. ఈ బ్రాంకైటిస్ సమస్యను మూలకారణం నుంచి ఎనాలిసిస్ చేయలేక, వ్యాధిని పూర్తిగా నివారించక పోతే ఇది ‘బ్రాంకియల్ ఆస్త్మా కింద మారుతుంది. దీనిలో ముఖ్యంగా విపరీతమైన దగ్గు, ఊపిరి సరిగ్గా తీసుకోలేకపోవటం, ఛాతీ అంతా పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

                                                        *****************

 కొంతమందికి వంకాయ, మునక్కాయ, పల్లీలు వంటి ఆహార పదార్థాలు తినగానే శరీరంపైన దద్దుర్ల మాదిరిగా ఎర్రగా, ఉబ్బెత్తుగా, తీవ్రమైన దురద వస్తాయి. ఈ ర్యాష్ 24 గంటల్లో తగ్గుతుంది. కొంతమందిలో లేటెక్స్ సంబంధిత వస్తువులు తగిలిన స్థలాలో చర్మమంతటా పొక్కులు వస్తాయి. దీనిని ‘అలర్జిక్ డెర్మటైటస్’ అని అంటారు.


 ఇలా అలర్జీలలో అనేక రకాలు ఉన్నప్పటికి ఎక్కువ మందిలో కనబడేవి శ్వాసకోశ సంబంధిత అలర్జీలు. అనగా రైనైటిస్, సైనసైటిస్, బ్రాంకైటిస్, బ్రాంక్రియల్ ఆస్త్మా. శ్వాసకోశ సంబంధిత అలర్జీలను కలిగించే వాటిలో ప్రధానమైనవి-పుప్పొడి, దుమ్ములో ఉండే క్రిములు, మోల్డ్, బొద్దింకలు, పశువుల పేడ మొదలైనవి. కొంతమందికి పూలవాసన, పర్‌ఫ్యూమ్స్, కూరపోపు లాంటివి కూడా పడవు.

                                                                    **************

 పాజిటివ్ హోమియోపతిలో ఈ దగ్గు, ఆయాసం, అలర్జీ, ఆస్త్మాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం ఉంటుంది. వ్యాధి త్వరితంగా ఉన్నా లేదా దీర్ఘకాలికంగా ఉన్నా, దాని మూలకారణం నుంచి వ్యాధిని తీసేయాలి.ముఖ్యంగా తత్వం ప్రకారం చికిత్సను మొదలు పెట్టి, ఏదైనా మానసిక ఒత్తిడి, ఆందోళనలు ఉంటే, ఆ మానసిక స్థాయి నుంచి చికిత్సను ఇవ్వడం ఉత్తమం. వాతావరణంలో ఉండే మార్పులను బట్టి మనిషి తత్వాన్ని ఎనాలసిస్ చేసి, చికిత్సను ఇస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం ఉంటుంది.
 
 డా॥టి. కిరణ్‌కుమార్
 పాజిటివ్ హోమియోపతి
  అపాయింట్‌మెంట్ కొరకు 9246199922
 హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ,
 వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై
 www.positivehomeopathy.com

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement