సాధారణంగా దగ్గు సమస్య అందరినీ వేధిస్తుంటుంది. గాలిలోని కాలుష్యం, ముక్కుల్లో ఇన్‌ఫెక్షన్, అలర్జీ, సైనుసైటిస్, గొంతు నొప్పి, గుండె జబ్బులు.. ఇలా రకరకాల కారణాల ద్వారా దగ్గు వస్తుంటుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తికి దగ్గు అంటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రేండేళ్లపాటు అతడికి దగ్గు వదల్లేదు. దీంతో క్యాన్సర్ వ్యాధి ఏమైనా వచ్చిందోనని భయాందోళనకు గురయ్యాడు. కానీ చివరకు తన దగ్గుకు గల కారణం తెలిసి..హమ్మయ్యా అనుకున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..
తూర్పు చైనీస్ పప్రావిన్స్ జెజియాంగ్‌కు చంఎదిన 54 ఏళ్ల వ్యక్తి జుకి కొంతకాలంగా దగ్గు వేధిస్తోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, మందులు, సిరప్‌లు వాడినా ఎంతకీ దగ్గు తగ్గలేదు. ఇలా రెండేళ్లు గడిచాయి. గత నెల జూన్‌లో జెజియాంగ్ హాస్పిటల్‌లో థొరాసిక్ సర్జరీ విభాగంలో స్కాన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.
అక్కడ అతనికి సిటీ స్కాన్ చేశారు. అందులో వ్యక్తి కుడి ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్ పొడుతున్న కణతి ఉన్నట్లు తేలింది. అది న్యుమోనియా లేదా క్యాన్సర్ కణితీగా తొలుత భావించారు. ఇక జు తనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఫిక్స్ అయిపోయి భయంతో అల్లాడిపోయాడు
జూలై 3న ఊపిరితిత్తుల కణజాలంలో కొంత భాగాన్ని తొలగించడానికి థొరాకోస్కోపీని చేసుకున్నాడు. దీనిలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఒక పరీక్ష చేస్తారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల్లో దాగుంది చిల్లీ పెప్పర్ కొన(మిర్చి ముక్క) గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. జు రెండు సంవత్సరాల క్రితం హాట్‌పాట్ భోజనం చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆరోజు మిరియాలు పీల్చడం వల్ల అసౌకర్యానికి గురవ్వడం, దగ్గడం వంటివి జరిగినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు.
దీంతో మిరపకాయ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లి ఉండవచ్చని జెజియాంగ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ జు జిన్హై చెప్పారు. ఇది అతని కణజాలం కింద దాగిపోయిందని, దీనిని గుర్తించడం సవాలుగామారిందని తెలిపారు.పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment