pepper
-
రెండేళ్లుగా తగ్గని దగ్గు.. కారణం తెలిసి షాకైన వైద్యులు
సాధారణంగా దగ్గు సమస్య అందరినీ వేధిస్తుంటుంది. గాలిలోని కాలుష్యం, ముక్కుల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ, సైనుసైటిస్, గొంతు నొప్పి, గుండె జబ్బులు.. ఇలా రకరకాల కారణాల ద్వారా దగ్గు వస్తుంటుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తికి దగ్గు అంటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రేండేళ్లపాటు అతడికి దగ్గు వదల్లేదు. దీంతో క్యాన్సర్ వ్యాధి ఏమైనా వచ్చిందోనని భయాందోళనకు గురయ్యాడు. కానీ చివరకు తన దగ్గుకు గల కారణం తెలిసి..హమ్మయ్యా అనుకున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..తూర్పు చైనీస్ పప్రావిన్స్ జెజియాంగ్‌కు చంఎదిన 54 ఏళ్ల వ్యక్తి జుకి కొంతకాలంగా దగ్గు వేధిస్తోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, మందులు, సిరప్లు వాడినా ఎంతకీ దగ్గు తగ్గలేదు. ఇలా రెండేళ్లు గడిచాయి. గత నెల జూన్‌లో జెజియాంగ్ హాస్పిటల్లో థొరాసిక్ సర్జరీ విభాగంలో స్కాన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.అక్కడ అతనికి సిటీ స్కాన్ చేశారు. అందులో వ్యక్తి కుడి ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్ పొడుతున్న కణతి ఉన్నట్లు తేలింది. అది న్యుమోనియా లేదా క్యాన్సర్ కణితీగా తొలుత భావించారు. ఇక జు తనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఫిక్స్ అయిపోయి భయంతో అల్లాడిపోయాడుజూలై 3న ఊపిరితిత్తుల కణజాలంలో కొంత భాగాన్ని తొలగించడానికి థొరాకోస్కోపీని చేసుకున్నాడు. దీనిలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఒక పరీక్ష చేస్తారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల్లో దాగుంది చిల్లీ పెప్పర్ కొన(మిర్చి ముక్క) గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. జు రెండు సంవత్సరాల క్రితం హాట్‌పాట్ భోజనం చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆరోజు మిరియాలు పీల్చడం వల్ల అసౌకర్యానికి గురవ్వడం, దగ్గడం వంటివి జరిగినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు.దీంతో మిరపకాయ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లి ఉండవచ్చని జెజియాంగ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ జు జిన్హై చెప్పారు. ఇది అతని కణజాలం కింద దాగిపోయిందని, దీనిని గుర్తించడం సవాలుగామారిందని తెలిపారు.పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు. -
మన్యం మిరియాలు అ‘ధర’హో..!
సాక్షి,పాడేరు: ఏజెన్సీలో గిరిజన రైతుల నుంచి 100 మెట్రిక్ టన్నుల మిరియాలను పాడేరు ఐటీడీఏ ద్వారా కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. పాడేరు డివిజన్లోని వ్యవసాయ, ఉద్యానవన, కాఫీ విభాగం అధికారులు, సిబ్బందితో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి మండలం నుంచి 10 టన్నులు కొనుగోలు చేయాలని తెలిపారు. మిరియాల పంటను సాగుచేస్తున్న గిరిజన రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా కిలో రూ.500 మద్దతు ధరతో నాణ్యమైన మిరియాలను కొనుగోలు చేస్తామన్నారు. తక్కువ ధరతో దళారీలకు అమ్ముకుని మోసపోకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిరియాల ఉత్పత్తిలో గిరిజన రైతులు తగిన నాణ్యత పాటించాలని, ఎండిన మిరియాలలో తేమశాతం తక్కువుగా ఉండాలన్నారు. వచ్చేనెల 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు కాఫీ లైజన్ వర్కర్లు గ్రామాల్లో పర్యటించి మిరియాల కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. మిరియాల నిల్వలకు గాను గిరిజన రైతులకు ఉచితంగా గోనెసంచులను పంపిణీ చేస్తామన్నారు.10వేల ఎకరాల్లో కాఫీ తోటల కన్సాలిడేషన్‌కు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. మిరియాల నూర్పిడికి యంత్రాల వినియోగం స్పైసెస్ బోర్డు విస్తరణ అధికారి కల్యాణి మాట్లాడుతూ గిరిజన రైతులు పాదుల నుంచి సేకరించిన మిరియాల నూర్పిడిలో యంత్రపరికరాలను వినియోగించాలన్నారు. కంకుల నుంచి మిరియాలను వేరుచేసేందుకు కాళ్లతో తొక్కడం వల్ల బ్యాక్టిరీయా చేరి నాణ్యత తగ్గే పరిస్థితి ఉందన్నారు. పచ్చిమిరియాలను ఒక నిమిషం వేడినీటిలో ముంచి తీసిన తరువాత ఎండబెడితే గింజ నల్లగా ఉండి మంచి ధర వస్తుందని చెప్పారు. తేమ 10 శాతం ఉండేలా చూసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో వెంకటేశ్వరరావు, కాఫీ ఏడీ అశోక్, కేంద్ర కాఫీబోర్డు డీడీ రమేష్,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు, రమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మిరియం సాగులో కేరళకు పోటీ
సాక్షి, విశాఖపట్నం: మిరియాల సాగుకు కేరళ పెట్టింది పేరు. ఇప్పుడు విశాఖ మన్యంలోనూ మిరియాలు సాగవుతున్నాయి. దిగుబడిలోనే కాకుండా నాణ్యతలోనూ మన్యం మిరియం కేరళకు గట్టి పోటీ ఇస్తోంది. కేరళలో పండే మిరియాల కంటే నాణ్యమైన ఆర్గానిక్ మిరియాలను విశాఖ మన్యం అందిస్తోంది. ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండానే.. ఇంకా చెప్పాలంటే పైసా పెట్టుబడి లేకుండానే గిరిజన రైతులు వీటిని పండిస్తున్నారు. ఈ ఏడాది ఒక్క మిరియాల పంట ద్వారానే మన్యం రైతులు రూ.150 కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించారంటే విశేషమే మరి. విశాఖ మన్యంలో కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు జరుగుతోంది. కాఫీ తోటల ద్వారా కాపును బట్టి ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.40 వేల వరకూ ఆదాయం వస్తుంటే.. అందులో అంతర పంటగా వేస్తున్న మిరియాలతో రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకూ అదనపు ఆదాయం సమకూరుతోంది. 98 వేల ఎకరాల్లో అంతర పంటగా.. మిరియాల సాగుకు సూర్యరశ్మితో పాటు తగిన నీడ కూడా ఉండాలి. నీరు నిలవని ఏటవాలు భూమి అవసరం. పాదులు 20 నుంచి 30 అడుగుల ఎత్తుకు పెరుగుతాయి కాబట్టి వాటికి ఆసరాగా ఎత్తయిన చెట్లు ఉండాలి. విశాఖ మన్యంలోని కొండవాలు ప్రాంతాలు సాగుకు అనుకూలంగా ఉండటంతో ప్రస్తుతం 98 వేల ఎకరాల కాఫీ తోటల్లో రైతులు అంతర పంటగా మిరియాల పాదులు వేశారు. ఒకసారి మొక్క వేస్తే రెండో ఏట నుంచే కాపు మొదలవుతుంది. 20 సంవత్సరాల పాటు జనవరి నుంచి ఏప్రిల్–మే నెల వరకూ ఫలసాయం వస్తుంది. ఈ ప్రాంతంలో కాఫీ మొక్కలకు నీడ కోసం పొడవుగా ఎదిగే సిల్వర్ ఓక్ చెట్లను పెంచుతున్నారు. ఆ చెట్ల మొదలులో మిరియం మొక్కలు నాటుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో.. పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ద్వారా గిరిజన రైతులను మిరియాల సాగు వైపు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రస్తుతం కరియా ముండ, పన్నియూరు–1 అనే రకాల మిరియాలు సాగవుతున్నాయి. వాటికన్నా అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తిని ఇచ్చే మేలు రకాల మొక్కల (మదర్ ప్లాంట్ల)ను కోజికోడ్‌లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్–ఐఐఎస్ఆర్) నుంచి తీసుకొచ్చి చింతపల్లిలో నర్సరీల్లో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో శక్తి, మలబార్ ఎక్సెల్, పౌర్ణమి, గిరిముండ, పంచమి, శుభకర, శ్రీకర రకాల మొక్కలు ఉన్నాయి. రికార్డు స్థాయిలో దిగుబడి వాతావరణం అనుకూలించడంతో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దాదాపు 4 వేల మెట్రిక్ టన్నుల మిరియాల దిగుబడి వచి్చంది. 3.2 కిలోల పచ్చి మిరియాలను ఎండబెడితే ఒక కిలో ఎండు మిరియాలు వస్తాయి. వాటి ధర కిలో రూ.360 నుంచి రూ.400 వరకూ ఉంది. ఈ లెక్కన గిరిజన రైతులకు దాదాపు రూ.150 కోట్ల వరకూ అదనపు ఆదాయం మిరియాలతో సమకూరింది. లాభసాటి మొక్కల అభివృద్ధి కేరళ నుంచి లాభసాటి రకాల మిరియం మొక్కలను తెచ్చి నర్సరీల్లో అంట్లు కట్టడం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పటికే జీకే వీధి, చింతపల్లి, పాడేరు మండలాల్లో రైతులకు మొక్కలు ఉచితంగా పంపిణీ ప్రారంభించాం. రానున్న రోజుల్లో మిగతా మండలాల్లోనూ అందిస్తాం. ఎకరాకు వంద మొక్కలు చొప్పున అవసరమవుతున్నాయి. – రాధాకృష్ణ, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, పాడేరు ఐటీడీఏ రైతులకు సహకారం ఎరువులు, సస్యరక్షణ ఖర్చు లేకపోయినా మిరియాల కోత రైతులకు కాస్త కష్టమైన పని. ఇందుకు వెదురుతో చేసిన నిచ్చెనలు వాడుతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్పైస్ బోర్డు అభివృద్ధి చేసిన అల్యూమినియం నిచ్చెనలను ఉచితంగా సమకూరుస్తున్నాం. క్లీనింగ్, గ్రేడింగ్ మెషిన్లను ఇస్తున్నాం. ఇప్పటివరకూ 20 వేల మంది రైతులకు బృందాల వారీగా సమకూర్చాం. – డాక్టర్ వెంకటేశ్వర్ సలిజామల, ప్రాజెక్టు అధికారి, పాడేరు ఐటీడీఏ -
పొట్టకు హుచారు
పండగ హడావుడి ముగిసింది. అయినవాళ్ల మధ్య, ఆత్మీయుల మధ్య విందులు హెవీగా సాగి ఉంటాయి. గారెలు, బూరెలు, చికెన్, మటన్... ఒకటికి నాలుగు ముద్దలు పొట్టకు ఎక్స్ట్రా పని పెట్టి ఉంటాయి. ఇక చాలు... ఒకటి రెండు రోజులు డైనింగ్ టేబుల్ని తేలిగ్గా ఉంచుదాం. జీర్ణాశయానికి విశ్రాంతినిద్దాం. అందుకు మార్గం? చారును శరణు కోరడమే. మిరియాలు, జీలకర్ర, నిమ్మకాయ, కొత్తిమీర, టొమాటో వీటన్నిటితో పొగలుగక్కే చారు చేయండి. రసంతో అజీర్తికి విరసం పలకండి. నిమ్మరసం – కొత్తిమీర రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు (తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించాలి); పసుపు – పావు టీ స్పూను. పొడి కోసం: కొత్తిమీర – అర కప్పు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి మిర్చి – 2; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5 పోపు కోసం: నువ్వుల నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఎండు మిర్చి – 2; ఇంగువ – అర టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; నిమ్మ రసం – 3 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ►ఉడికించిన పప్పును పప్పు గుత్తితో మెత్తగా చేయాలి ►మిక్సీలో అర కప్పు కొత్తిమీర, రెండు టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూను మిరియాలు, రెండు పచ్చి మిర్చి, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా చేసి, పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒక టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, అర టీ స్పూను ఆవాలు వేసి చిటపటలాడించాలి ►కరివేపాకు, ఎండు మిర్చి జత చేసి మరోమారు వేయించాలి ►కొత్తిమీర మిశ్రమం జత చేయాలి ∙ఇంగువ, పసుపు జత చేసి మరోమారు కలపాలి ►పప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి బాగా కలియబెట్టి, ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాక, దింపేయాలి ►నిమ్మ రసం జత చేసి కలియబెట్టాలి ►కొత్తిమీరతో అలంకరించాలి. మైసూర్ రసం కావలసినవి: పొడి కోసం: ధనియాలు – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 2; జీలకర్ర – అర టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – రెండు టేబుల్ స్పూన్లు ; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు, టొమాటో తరుగు – అర కప్పు; చింతపండు రసం – ఒక కప్పు (పల్చగా ఉండాలి); కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు – పావు టీ స్పూను; బెల్లం పొడి – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; ఉడికించిన కంది పప్పు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పోపు కోసం: నూనె – 2 టీ స్పూన్లు; ఆవాలు – ముప్పావు టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక ధనియాలు, జీలకర్ర, పచ్చి సెనగ పప్పు, మిరియాలు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►మంట బాగా తగ్గించి మరోమారు వేయించాలి ►కొబ్బరి తురుము జత చేసి మరి కాసేపు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ∙అదే బాణలిలో ముందుగా టొమాటో గుజ్జు, చింతపండు రసం వేసి ఉడికించాలి ►కరివేపాకు, పసుపు, ఉప్పు, బెల్లం పొడి జతచేసి బాగా కలిపి మరిగించాలి ►ఉడికించిన కందిపప్పు, నీళ్లు జత చేసి కొద్దిసేపు మరిగించాలి ►తయారుచేసి ఉంచుకున్న మైసూర్ రసం పొడి జత చేయాలి ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక, నూనె వేసి కాగాక, ఆవాలు, ఇంగువ, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, మరుగుతున్న రసంలో వేసి కలపాలి ►చివరగా కొత్తిమీర వేసి బాగా కలిపి దింపేయాలి. మిరియాలు జీలకర్ర రసం కావలసినవి: మిరియాలు – అర టేబుల్ స్పూను; జీలకర్ర – అర టేబుల్ స్పూను; ఎండు మిర్చి – 2 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 7. చింతపండు – అర టేబుల్ స్పూను (అర కప్పు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి); టొమాటో తరుగు – అర కప్పు; కొత్తిమీర తరుగు – పావు కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – ఒక టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; పసుపు –పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు. తయారీ: ►చింతపండు రసం తీసి పక్కన ఉంచాలి ►మిక్సీలో వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా పొడి చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేసి వేయించాలి ►కరివేపాకు, మిరియాల పొడి మిశ్రమం జత చేసి మరోమారు కలపాలి ►చింతపండు రసం, నీళ్లు, ఉప్పు జత చేసి, బాగా కలియబెట్టి, మంట బాగా తగ్గించాలి ►సుమారు పావు గంట సేపు మరిగించాక దింపేయాలి. పైనాపిల్ రసం కావలసినవి: కంది పప్పు – పావు కప్పు; నీళ్లు – ఒక కప్పు; పసుపు – పావు టీ స్పూను; పైనా పిల్ తరుగు – ఒక కప్పు; టొమాటో తరుగు – అర కప్పు; నీళ్లు – ఒకటిన్నర కప్పులు; రసం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత. పొడి కోసం: జీలకర్ర – 2 టీ స్పూన్లు; మిరియాలు –ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 6 పోపు కోసం: నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; ఎండు మిర్చి – 3; కరివేపాకు – 4 రెమ్మలు; ఇంగువ – పావు టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►కంది పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఆరు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి, దింపి, పప్పు గుత్తితో మెత్తగా చేసి, పక్కన ఉంచాలి ►మిక్సీలో జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లి రెబ్బలు (పొడి కోసం చెప్పిన వస్తువులు) వేసి కచ్చాపచ్చాగా పొడి చేసి, తీసి పక్కన ఉంచాలి ►అర కప్పు పైనాపిల్ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి, తీసి పక్కన ఉంచాలి ►పావు కప్పు టొమాటో ముక్కలు మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేసి, తీసి పక్కనుంచాలి ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర టేబుల్స్పూన్ల నూనె వేసి కాగాక, ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►మిరియాల పొడి మిశ్రమం జత చేసి కొద్దిసేపు వేయించాలి ►కరివేపాకు, ఇంగువ జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో గుజ్జు జత చేసి బాగా వేయించాలి ►పైనాపిల్ గుజ్జు జత చేసి రెండు నిమిషాల పాటు వేయించాక, ఉడికించిన పప్పు జతచేసి బాగా కలపాలి ►పైనాపిల్ తరుగు, టొమాటో తరుగు, ఉప్పు, ఒకటిన్నర కప్పుల నీళ్లు జత చేసి, బాగా కలపాలి ►రెండు టీ స్పూన్ల రసం పొడి వేసి బాగా కలియబెట్టాలి ►పదినిమిషాల పాటు మరిగించాక, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి. పన్నీర్ రసం కావలసినవి: చింత పండు – నిమ్మకాయంత; నీళ్లు – 3 కప్పులు; రోజ్ వాటర్ (పన్నీరు) – 2 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి – 3; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర – కొద్దిగా; రోజ్ పెటల్స్ – కొన్ని ; ఉప్పు – తగినంత; పంచదార – తగినంత; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – అర టీ స్పూను. తయారీ: ►చింతపండును తగినన్ని నీళ్లలో నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచాక, ఉడికించిన పప్పు నీళ్లు జత చేయాలి ►తగినంత ఉప్పు, పంచదార వేసి కలియబెట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె/నెయ్యి వేసి కాగాక ఆవాలు, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాలి ►చింతపండు రసం జత చేయాలి ►రెండు నిమిషాల పాటు మరిగాక దింపేసి, రోజ్ వాటర్ జత చేయాలి ►కొత్తిమీర, గులాబీ రేకలతో అలంకరించి వేడివేడిగా వడ్డించాలి. టొమాటో చారు చారుకావలసినవి: బాగా పండిన టొమాటో తరుగు – 2 కప్పులు (మిక్సీలో వేసి మెత్తగా గుజ్జు చేయాలి); నీళ్లు – 2 కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; ఎండు మిర్చి – 1 (ముక్కలు చేయాలి); వెల్లుల్లి రెబ్బలు – 4; పసుపు – పావు టీ స్పూను; కొత్తిమీర – పావు కప్పు; బెల్లం పొడి – అర టేబుల్ స్పూను; చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను పొడి కోసం: ఎండు మిర్చి – 2; జీలకర్ర – ఒక టీ స్పూను; మిరియాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; ధనియాలు – ఒక టేబుల్ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తయారీ: ►స్టౌ మీద బాణలి వేడయ్యాక పచ్చి సెనగ పప్పు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించాలి ►ధనియాలు, మెంతులు, ఎండు మిర్చి, మిరియాలు జత చేసి బాగా వేయించాక, జీలకర్ర జత చేసి మరోమారు వేయించి దింపేయాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేస్తే, చారు పొడి సిద్ధమైనట్లే. ►స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక ఆవాలు, మెంతులు వేసి చిటపటలాడం మొదలయ్యాక, ఎండు మిర్చి ముక్కలు, ఇంగువ జత చేయాలి ►కరివేపాకు జత చేసి ఒక నిమిషం వేయించాక, టొమాటో గుజ్జు, పసుపు, ఉప్పు జత చేసి కొద్దిసేపు వేయించాలి ►టొమాటో గుజ్జు బాగా మెత్తబడ్డాక, వెల్లుల్లి తరుగు, చింత పండు గుజ్జు, బెల్లం పొడి జత చేసి బాగా కలియబెట్టాలి ►నీళ్లు పోసి మరిగించాక, మంట బాగా తగ్గించి, రసం పొడి జత చేయాలి ►కొత్తిమీర వేసి బాగా కలిపి దింపి, మూత ఉంచాలి ►వేడి వేడి అన్నంలోకి వేడి వేడి చారు జత చేసుకుని తింటే రుచిగా ఉంటుంది ►సూప్‌లా తాగినా కూడా రుచిగానే ఉంటుంది. -
నయం చేసే మిరియం
గుడ్‌ఫుడ్ మిరియాలు ఆహారానికి రుచిని మాత్రమే కాదు... ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. వాటితో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో. మిరియాలలో యాంటీబయాటిక్ గుణాలు ఉండటం వల్ల హానికరమైన ఇన్ఫెక్షన్స్ను నిరోధిస్తాయి. ∙మిరియాలు ఉన్న ఆహారం తిన్న వెంటనే అవి జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములను, రసాయనాలను పుష్కలంగా స్రవింపజేసేలా చూస్తాయి. అందుకే మిరియాలతో కూడిన ఆహారం తీసుకునేవారిలో కడుపు సంబంధిత సమస్యలు చాలా తక్కువ. అంతేకాదు మలబద్దకాన్ని, డయేరియా ను సైతం నివారిస్తాయి. ∙జలుబు, దగ్గు వంటి సమస్యలకు తొలుత స్ఫురించే ఇంటి చిట్కా మిరియాలే. ఇలా అవి జలుబు, దగ్గులను నివారించడానికి కారణం వాటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణమే. మన శరీరంలోని ఫ్రీరాడికల్స్‌ను మిరియాలు అరికడతాయి. తద్వారా ఎన్నో రకాల క్యాన్సర్ల నివారణకు తోడ్పడతాయి. నిత్యం మిరియాలతో కూడిన ఆహారం తీసుకునే వారిలో పొట్ట పెరగదని పరిశోధనలలో తేలింది. ∙మిరియాలు చుండ్రును నివారిస్తాయి. ఛాతీ పట్టేసినట్లు ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్వాస తీసుకోవడం కష్టమైనా మిరియాలు ఆ సమస్యను తక్షణం ఉపశమింపజేస్తాయి. సైనసైటిస్ సమస్యకు మిరియాలు మంచి ఉపశమనం. -
ఎంత ఘాటు ప్రేమయో!
తిండి గోల చూడటానికి చిన్నగా ఉన్నా, రుచికి మాత్రం ఘాటే. కొన్ని వంటకాలలో అవి పడకపోతే రుచించదు. అవే మిరియాలు. రాములోరి పానకంలో మిరియాల పొడి పడలేదా... ఇక అది పానకం కాదు... కల్లుకిందే లెక్క! చక్రపొంగలిలో, దధ్యోదనంలో, తిరుమలేశునికి నివేదించే పులిహోరలో పంటికింద మిరియాలు తగిలితేనే పసందు. బ్లాక్ పెప్పర్‌గా ఆంగ్లేయులు పిలుచుకునే మిరియాలకు ఓ స్పూను జీలకర్ర చేర్చి, వాటిని కచ్చాపచ్చాగా దంచి, ఓ స్పూను నేతిలో వేసి వేగించామా... ఎంత జటిలమైన జలుబూ ఎగిరిపోవాల్సిందే! ఈ క్రోసిన్లు, కోల్డారిన్లు రాకముందు పడిశం పడితే అదే పెద్ద మందు. అంతేనా.. అజీర్తితో నోటికి అరుచిగా అనిపించినప్పుడు చిటికెడు ఉప్పూ మిరియాల పొడీ జీలకర్ర, చిన్న అల్లంముక్క కలిపి నేతిపోపు పెట్టి మొదటి ముద్దలో తింటే... ఆకలి... అని గెంతవలసిందే ఇక! మిరియాల చారెడితే ఎంతదూరంలో ఉన్నా గుబాళిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు నీళ్లలో కొన్ని మిరియాలు, చక్కెర కలుపుకుని తాగితే జ్వరం తొందరగా తగ్గుతుందని ఆయుర్వేదం చెబుతోంది.. -
మేలిమి రుచి.. మిరియం
తిండి గోల ప్రపంచంలో మిరియాలకు పుట్టినిల్లుభారతదేశమే. మిరపకాయ పరిచయం లేని రోజుల్లో వంటకాల్లో మిరియాన్నే విరివిగా వాడేవారట మన పూర్వీకులు. మిరప ఎంత మిడిసిపడినా మిరియంలోని ఘాటు, టేస్ట్ ముందు దిగదుడుపే. అందుకేనేమో యురోపియన్ వంటకాల్లో మిరియం ‘పెప్పర్’ పేరుతో టేబులెక్కి మరీ కేక పుట్టిస్తోంది. పోపుల పెట్టెలో నాలుగు మిరియాలు ఉన్నాయంటే వైద్యుడు దగ్గరకు వెళ్లాల్సిన అవసరమే రాదనేది పెద్దల మాట. జలుబు, దగ్గు, గొంతు గరగర, ముక్కు దిబ్బడ, అజీర్తి, క్రిమి, జీర్ణశక్తిని పెంచుటకు, గొంతును శుభ్రపరచడానికి, కీళ్లనొప్పులు, ఉబ్బసం, మూలశంక, కలరా, మలేరియా... ఏ వ్యాధికైనా ఒకే మందు మిరియం. మిరియాలలో తెల్లనివి, ఆకుపచ్చనివి, ఎర్రనివి అరుదుగా గులాబీ రంగువి కూడా ఉంటాయి. పీచు, ఐరన్, మాంగనీస్, పొటాషియం, కాల్షియం, విటమిన్ సి ఎక్కువ పాళ్లలో లభించే మిరియాన్ని కాలీమిర్చి అని కూడా అంటారు. కేరళలో విరివిగా పండే ఈ పంటను మన రాష్ట్రంలో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటల్లో అంతరపంటగా సాగు చేస్తున్నారు. -
ఆర్థిక సంక్షోభంలో రైతులు
పర్చూరు : రైతులు పండించిన పంటకు ప్రభుత్వం కల్పిస్తున్న అతి తక్కువ ధర, వ్యవసాయ రంగానికి సంబంధించిన రైతు వ్యతిరేక విధానాల కారణంగా అన్నదాతలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి పేర్కొన్నారు. పర్చూరు మండలంలోని నూతలపాడు, చింతగుంటపాలెం గ్రామాల్లో రైతులు సాగుచేస్తున్న పత్తి, మిరప, పొగాకు, మినుము పంటలను వైఎస్ఆర్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డితో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 2,03,000 హెక్టార్లు కాగా, ఈ ఏడాది 1,80,000 హెక్టార్లలో మాత్రమే రైతులు పంటలు సాగుచేశారని తెలిపారు. మిగిలిన 20 శాతం పొలాల్లో వర్షాభావం కారణంగా పంటలు సాగుచేయలేదని చెప్పారు. ఆ భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు. జిల్లాలో 41,000 హెక్టార్లకుగానూ 70,000 హెక్టార్లలో పత్తి సాగుచేయగా, 40,000 హెక్టార్లకుగానూ 20,000 హెక్టార్లలో వరి, 20,000 హెక్టార్లకుగానూ 12,000 హెక్టార్లలో చిరుధాన్యాలు, 67,500 హెక్టార్లకుగానూ 47,500 హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగుచేస్తున్నారని వివరించారు. ైవె ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పత్తి క్వింటా ధర 7,800 రూపాయలుండగా ప్రస్తుతం 4,050 రూపాయలు మాత్రమే ఉందన్నారు. మద్దతు ధరకు సంబంధించి పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. జిల్లాలో వ్యవసాయం ప్రధాన రంగంగా ఉన్నప్పటికీ ఆ రంగానికి సంబంధించిన పరిశోధనా కేంద్రాలు ఒక్కటి కూడా స్థానికంగా లేకపోవడం బాధాకరమని నాగిరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబునాయుడు కల్లబొల్లి మాటలతో రైతులను మోసం చేస్తున్నారే తప్ప వారి సంక్షేమం కోసం ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో నూతలపాడు సహకార సంఘ అధ్యక్షుడు కుర్రి బాపిరెడ్డి, వైఎస్ఆర్ సీపీ నాయకులు వల్లభరెడ్డి సుబ్బారెడ్డి, వణుకూరి బ్రహ్మారెడ్డి, బి.వెంకారెడ్డి, రామిరెడ్డి, మస్తాన్‌రెడ్డి, వై.రామారావు, వణుకూరి వెంకరెడ్డి పాల్గొన్నారు. -
ఆరోగ్యమే మహాభాగ్యం
టొమాటో రసంలో కాసింత ఉప్పు, మిరియాల పొడి కలిపి ప్రతిరోజూ ఉదయం సేవిస్తే... మలబద్ధకం, అజీర్తితో పాటు గ్యాస్ వల్ల కలిగే మంట కూడా తగ్గుతుంది. బాగా వేడిచేసి ఇబ్బంది పడుతుంటే... తమలపాకులో కాసింత పచ్చ కర్పూరం, కొంచెం మంచి గంధం, కొద్దిగా వెన్న వేసి చుట్టి నమిలి, ఆ రసాన్ని మింగితే మంచి ఫలితముంటుంది. పిల్లలు వయసుకు తగ్గ బరువు లేకపోతే... ఓ గ్లాసుడు పాలల్లో మామిడిపండు రసం కలిపి మూడు పూటలా తాగించాలి. ఓ నెల రోజులలా చేశాక ఏం జరుగుతుందో మీరే చూడండి! -
కాఫీ రైతులకు అన్యాయం చేస్తే ఉపేక్షించం
పాడేరు : ఏజెన్సీలో తుఫాన్‌కు దెబ్బతిన్న కాఫీ, మిరియాల పంటలకు ప్రభుత్వం హెక్టార్‌కు రూ.20 వేలు పరిహారం ప్రకటించడం అన్యాయమని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతు ఒక కాఫీ మొక్క ఎదిగి ఫల సాయాన్నివ్వాలంటే 10-15 ఏళ్ళు పడుతుందన్నారు. ఏడాదికి రూ.లక్ష ఆదాయం ఇచ్చే కాఫీ, మిరియాలు పంటలు నాశనమైతే ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడం తగదన్నారు. ఎకరం కాఫీ, మిరియాల పంటకు రూ.లక్ష పరిహారం ఇవ్వనిపక్షంలో బాధిత కాఫీ రైతులతో ఏజెన్సీవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడ్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పాడేరు ప్రాంతంలో పర్యటించి దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించకపోవడం దారుణమన్నారు. ఏజెన్సీలో 27,501 హక్టార్లలో కాఫీ పంట నాశనమైందని అధికారులు కూడా కాకి లెక్కలుచూపుతున్నారని, పూర్తిస్థాయి లో సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆమె దుయ్యబట్టారు. కాఫీ పంటకు సుమా రు రూ.500 కోట్ల న ష్టం వాటిల్లితే కేవలం రూ. 37 కోట్లుగానే అ ధికారులు చూపడం తగదన్నారు. మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ పంటను చూసి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించారని చెప్పారు. ఏజెన్సీలో వరి, జీడిమామిడి, పత్తి పం టలకు, అరకు ప్రాంతంలో ప్రాణ నష్టం కూడా సంభవించిందన్నారు. తుఫాన్‌కు మన్యంలో భా రీ నష్టం వాటిల్లినా అధికార యంత్రాంగం పూ ర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు.ప్రభుత్వమం తా విశాఖపట్నంలో ఉన్నా విద్యుత్ పునరుద్ధరణ, తాగునీరు సరఫరా, వైద్యసేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆహార సామాగ్రిని నెలకు సరిపడా ఉచితంగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం 25 కిలోల బియ్యం, త క్కువ ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఏజెన్సీలోని అన్ని వర్గాల తుఫాను బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సరకులు సక్రమంగా పంపిణీ చేయాలి పాడేరు: తుఫాన్ బాధితులకు సరఫరా చేస్తున్న నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశించారు. సుండ్రుపుట్టు డీఆర్ డిపో వద్ద లబ్ధిదారులకు బియ్యం, సరకులను ఆమె సోమవారం పంపిణీ చేశారు. సరకుల తూకాల్లో తేడాలొస్తే తనకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం జీసీసీ గిడ్డంగిలో ఉన్న ఉచిత బియ్యం, పంచదార నిల్వలను పరిశీలించారు. సరకుల పంపిణీలో అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. జీసీసీ మేనేజర్ నరసింగరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓడరేవు మోటుపల్లి, క్రీ.శ. 1250
పదం నుంచి పథంలోకి 15 ఊరంతా కోలాహలంగా ఉంది. వెదకబోయిన తీగ కాలుకి తగిలినట్టు గణపతిదేవచక్రవర్తి మోటుపల్లికి వేంచేశారు. దక్షిణదేశ జైత్రయాత్ర ముగిసిందట! కవిబ్రహ్మ తిక్కన సోమయాజి ప్రార్థనపై కంచి రాజేంద్రచోళుని ఓడించి తెలుగు చోడరాజు మనుమసిద్ధిని నెల్లూరు సింహాసనంపై నిలిపి కుటుంబసమేతంగా ఓరుగల్లు తిరిగివెళ్తూ మోటుపల్లిలో ఆగారు. తాను ఏనాటి నుంచో దర్శించుకుందామనుకుంటున్న ప్రభువు ఇంత సులువుగా అందుబాటులోకి వచ్చారన్న కబురు తెలిసి ఉక్కిరిబిక్కిరయ్యాడు పాపయ్య శెట్టి. తవాయి (థాయ్‌లాండ్) ద్వీపకల్పం నుంచి ఓడల మీద సరుకు వేసుకొని వచ్చిన బడలిక అంతా ఆ ఒక్క కబురుకే తుడిచి పెట్టుకుపోయింది. పాపయ్యశెట్టి సామాన్యమైన వర్తకుడు కాడు. తవాయిలోని తిన్-గ్యుయ్ పట్టణ తెలుగు నకరానికి అధ్యక్షుడు. అక్కడ స్థిరపడి వ్యాపారంలో లాభాలు చూసి ఎన్నో యేళ్ళ తరువాత స్వదేశంలో కాలుపెట్టాడు. తన వెంట ఒక్కొక్క నౌకలో యాభై బారువాల (75 టన్నులు) అగరు, కర్పూరం, జవ్వాజి, చందనం, మిరియాలు, జాజికాయ, జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలతో వెలనాటి తీరం చేరాడు. నిజానికి ఇప్పుడు కూడా అతడు వచ్చేవాడు కాదు. కాని పరిస్థితులు మారాయి. మంజి (దక్షిణ చైనా) ప్రాంతాన్ని పాలించే మంగోల్ ఖాఖాన్ చంపా- తరుణసీరి (బర్మా) జయించి అక్కడి వర్తకస్థావరాలని పట్టుకున్నాడు. అతడి తమ్ముడు కుబ్లయ్ఖాన్ నౌకాసైన్యాలు యవద్వీపాలని జయించాయి. రేవు పట్టణాలలో వాళ్ళు చేసిన బీభత్సం అంతింత కాదు. దినదిన గండంగా అక్కడ జీవించడంకన్నా వ్యాపారానికి స్వస్తి చెప్పి స్వదేశం చేరితే మంచిదని పాపయ్యశెట్టి ఉద్దేశం. ‘తూర్పుసముద్రంలో నౌకావర్తకానికి ఇక రోజులు చెల్లాయి. ఇక్కడే ఉంటే మనం సంపాదించి దాచుకున్నదంతా ఆ మంగోలు ఖానుడి పాలవుతుంది. మనం మన ప్రాంతం వెళ్లిపోదాం. పుష్యమాసం తరువాత బయలుదేరితే తుఫానుల బెడద ఉండదు కనుక నేరుగా సముద్రమధ్య మార్గంలో దొంగల భయం లేకుండా మోటుపల్లి చేరవచ్చు. అక్కడ కాకతి గణపతిదేవచక్రవర్తి ధర్మప్రభువు. ఒకసారి ఆంధ్రతీరం చేరితే మనకి కావలసిన సహకారం అందుతుంది’ అని సాటి వర్తకులని ఒప్పించాడు. తీరానికి కోసు దూరంలో సముద్రంలో లంగరేసిన వల్లీ నావలను వదిలి, చిన్న కప్పలి పడవలో నలుగురు వీరభటులతో మోటుపల్లి చేరాడు. అప్పుడుగానీ హాయిగా ఊపిరి పీల్చుకోలేదు పాపయ్యశెట్టి. మోటుపల్లి స్థానకరణం, అయ్యావళి ఇన్నూరు సంఘాధిపతి రేవణ్ణశెట్టి ఇతర సంఘముఖ్యులతో కలిసి పాపయ్యశెట్టికి స్వాగతం పలికాడు. ‘రేపు కేశవాలయం వద్ద మహోత్సం జరుగుతుంది. తమరు పాల్గొనాలని మా ఆకాంక్ష’ అని ఆహ్వానించాడు. పక్కనే ఉన్న రేవణ్ణ శెట్టి అతడి మనసుని తొలుస్తున్న అసలు విషయం అడిగేశాడు. ‘శెట్టరే! ఇంతకీ మీ ఓడలో తెచ్చిన సామాగ్రి ఏనో?’. పాపయ్యశెట్టి తలెత్తి సముద్రంలో లంగరేసి ఉన్న నావలను చూస్తూ ‘ఏముంది శెట్టిగారు! తూర్పుదీవుల వాళ్ళం. కర్పూరం, కస్తూరి, జవ్వాజి. మొత్తం కలిపి ఐదు వందల బారువులు’ అని బదులిచ్చాడు . విన్నంతనే రేవణ్ణ శెట్టి ముఖం తెల్లగా పాలిపోయింది. **************** అర్ధరాత్రి. లంగరు వేసిన నావల్లో కలకలం మొదలయ్యింది. అవి మెల్లమెల్లగా మునిగిపోవడం మొదలుపెట్టాయి. పాపయ్య శెట్టి కొయ్యబారి చూస్తూ ఉండగా నావల్లోని ముప్పై కుటుంబాల సభ్యులు గగ్గోలు పెడుతూ బెస్తవారి సాయంతో ఎలాగో ప్రాణాలతో ఒడ్డు చేరారు. ********** కుమారుడు రుద్రదేవుడు (మగవేషంలో ఉన్న రుద్రమదేవి), బావమరిది జాయప సేనాని, భార్యలు నారమ్మ, పేరమ్మ, పరివారం వెంటరాగా కేశవస్వామికి సేవలందించి గుడి నుంచి మరిలాడు సప్తమ చక్రవర్తి కాకతి గణపతిదేవుడు. అందుకోసమే కాచుకొని ఉన్న పాపయ్య శెట్టి భార్యపిల్లలతో సహా ‘మహాప్రభో! పాహి!’ అంటూ చక్రవర్తి పాదాలపై పడ్డాడు. అతడిని చూసి కుడిచెయ్యి అభయముద్రతో పెకైత్తి ఒక్క క్షణం అలాగే నిలిచాడు గణపతిదేవుడు. మరుక్షణం పాపయ్యశెట్టి చేతిలోని కొలతో చక్రవర్తి చుట్టూ గుండ్రంగా నేలపై గిరిగీసి మరలా సాగిలపడ్డాడు. ఆ హఠాత్ పరిణామానికి చక్రవర్తి పరివారమేగాక పురజనులు కూడా అవాక్కయ్యారు. అప్పు ఎగగొట్టి చెల్లించని వాళ్ళు దొరికితే వారి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం ఆచారం. ‘ఎంత అపచారం’ ‘వీడికి భూమి మీద నూకలు చెల్లాయ్!’ ‘అయినా చక్రవర్తి ఇతడికి ఎలా బాకీ పడ్డాడు? గణపతిదేవుని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన జనంలో కలకలం మొదలయింది. రక్షకభటులు కత్తులు దూశారు. ‘ఆగండి’ అంటూ ముందుకొచ్చింది ఆరేళ్ళ రాకుమారుడి వేషంలో ఉన్న రుద్రమ్మ. ‘ఏమోయ్ శెట్టి! సముద్రంలో మీ నావలు మునిగిపోయిన విషయం మాకు తెలిసింది. కానీ ఈ విషయంలో చక్రవర్తి మీకెలా బాకీ పడ్డారో చెప్పగలవా?’ కుమార్తె రుద్రమ పలికిన ముద్దుమాటలకు కోపం నుంచి తేరుకున్నాడు చక్రవర్తి. తన చుట్టూ గీత గీసినవాడు సామాన్యుడు కాదు. తూర్పు దీవులలో ప్రాముఖ్యం కలిగిన వర్తక శ్రేణి నాయకుడు. పరిహారం చెల్లించకుండా గీసిన గీత దాటడం సంఘ నియమాలని అతిక్రమించడమే. రాజైన తానే నియమాలు పట్టించుకోకుంటే ఇక ప్రజల మాటేమిటి? అతడి వాదన ఏమిటో విందాం అనుకొని, ‘ఊ! చెప్పవయ్యా శెట్టి! మేము మీకెలా ఋణపడ్డామో? అన్నాడు చక్రవర్తి. శెట్టి జవాబు ఇవ్వలేదు. గుడి వైపు చూశాడు. ‘చక్రవర్తి ఈ నకరశెట్టికి బాకీపడిన మాట వాస్తవమే’ అంటూ వీరభద్రుని గుడిలోంచి సమర్థింపుగా చిన్న చిర్నవుతో బయటికి వచ్చాడు మహామంత్రి శివదేవయ్య దేశికుడు. త్రిశూలధారి... విశాలమైన ఫాలంపై అడ్డబొట్టు... చుట్టూ మూగిన జనం కూడా శివదేవయ్య మంత్రి వంకకి తిరిగారు. ‘రేవు పట్టణాలలో దిగే వర్తకులకి రక్షణ కల్పిస్తామని చక్రవర్తి చేసిన శాసనం నిజమైతే ఈ శెట్టికి వచ్చిన నష్టానికి తమరూ తమ అధికార యంత్రాంగమే బాధ్యులు. చేసిన వాగ్దానం తప్పితే ఎంతటి రాజునైనా నిర్బంధించడంలో తప్పు లేదు’ అన్నాడు శివదేవయ్య. ‘అదెలా సాధ్యం గురుదేవా? రేవులోని సరుకులకి కరణాలు, రాజోద్యోగులూ బాధ్యత వహించగలరు. కానీ సముద్రంలో మునిగిపోయిన నావలకి వారెలా బాధ్యులు?’ అడిగాడు చక్రవర్తి. ‘అవి మునిగిపోవడం ప్రకృతి వైపరీత్యం వల్ల కాదు. దానికి కారకులు తమ శరణులో ఉన్న కొందరు పౌరులే’ అని బదులిచ్చాడు శివదేవయ్య. ‘గురుదేవులకి తెలియనిది లేదు. తమరు వివరించి నన్ను ఋణవిముక్తుణ్ణి చేసి ఈ చిక్కు నుండి బయటపడే ఉపాయం చెప్పగలరు’ అన్నాడు చక్రవర్తి. ముఖంపై ఎంత అణుచుకున్నా దాగని చిరునవ్వుతో ‘అసలు తప్పు మీదే! కళింగ, కాంచీపురాలు జయించి విజయోత్సవాల పేరున దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో వసంతోత్సవాలు సంకల్పించారా లేదా? ఆ ఉత్సవాలలో వెదజల్లేందుకు కస్తూరి, కర్పూరహిమం, అగరు, జవ్వాజుల కొరకు నభూతోనభవిష్యతి అనే విధంగా సుగంధ భాండాగారాలు కట్టించారా లేదా?’ అడిగాడు శివదేవయ్య. అవునని తలూపాడు చక్రవర్తి. ‘వాటిని నింపేందుకు దేశం నలుమూలల నుంచి సుగంధ ద్రవ్యాలని అధిక ధరకి కొని దాచిన సరుకుని తమరికి లాభానికి అమ్మాలనుకోవడంలో వర్తకుల తప్పేమిటి? అది వారి నైజం. ఇలాంటి సమయంలో ఈ శెట్టి తన వెంట తెచ్చిన ఐదొందల బారువుల సరుకు కనుక రేవులో దింపే సుగంధ ద్రవ్యాల ధర సగానికి పడిపోతుంది. అందువల్ల సభ్యులకి కలగబోయే నష్టాన్ని నివారించేందుకు రాత్రికిరాత్రి నావలకి తూట్లు పొడిపించి ముంచే పాపం అయ్యావళి సంఘం రేవణ్ణశెట్టికి తప్పలేదు. పరోక్షంగా పాపయ్యశెట్టి నష్టానికి బాధ్యత తమదే. పరిహారం నిర్ణయించి, అతడు ఒప్పుకుంటే తమరు గీత దాటవచ్చు’ అన్నాడు శివదేవయ్య దేశికుడు. న్యాయం తప్పడం గణపతి దేవుని రక్తంలో లేదు. ఆయన అంగీకారంగా తల ఊపి పాపయ్య శెట్టి వైపు వరం ఇచ్చే దేవుడిలా చల్లని చిర్నవ్వు నవ్వాడు. - సాయి పాపినేని ఫోన్: +91 9845034442 -
దిష్టి ఎందుకు తీస్తారు?
చిన్నపిల్లలకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు ‘ఎవరి కళ్లు పడ్డాయో ఏమో’ అంటూ గబగబా దిష్టి తీసేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పెద్దలకు కూడా దిష్టి తీయడం జరుగుతూ ఉంటుంది. నిజానికి అలాంటిదేమీ ఉండదు. దిష్టి అనేది దృష్టికి వికృతి. ఒక వ్యక్తి మరో వ్యక్తిని సూటిగా చూసినప్పుడు... వారి నుంచి విద్యుత్ తరంగాలు వచ్చి శరీరాన్ని తాకుతాయనీ, ఒకవేళ ఆ తరంగాలు వారి శరీరానికి హాని కలిగించేవి కనుక అయితే తల తిరగడం, కడుపులో తిప్పి వాంతులవడం లాంటివి జరుగుతాయనీ ఓ నమ్మకం. దాంతో దిష్టి తగిలింది అంటుంటారు. అందుకే దిష్టి తీసిన నీళ్లను అందరూ తిరిగేచోట వేయరు. ఎవరైనా తొక్కితే మళ్లీ వారికి అనారోగ్యం కలుగుతుందని భయం. బొంకరా బొంకరా పోలిగా అంటే... టంగుటూరి మిరియాలు తాటికాయంత అన్నాట్ట...! పూర్వం ఒక ఊరిలో పోలయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు వట్టి అమాయకుడు. ఓ రోజు ఒక స్నేహితుడు పోలయ్య దగ్గరికొచ్చి అతడినో సాయమడిగాడు. ‘మా ఇంట్లో మిరియాలు ఉండటం చూసి పక్కింటాయన అతని మిరియాల పంటని నేను దొంగిలించానని అంటున్నాడు, నువ్వొచ్చి నేనా మిరియాలను టంగుటూరు నుంచి తెచ్చుకున్నానని రాజుగారి దగ్గర సాక్ష్యం చెప్పాలి’ అన్నాడు. పోలయ్య సరేనంటూ వెళ్లాడు. రాజుగారు వరుసగా ప్రశ్నలు అడిగేసరికి పోలయ్య కంగారు పడిపోయాడు. ‘నేను చెప్పేది నిజమే. ఆ మిరియాలు నా స్నేహితుడివే. వాటినతడు టంగుటూరు నుంచి తెచ్చాడు. కావాలంటే చూసుకోండి, టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయి, అలాంటివింకెక్కడా ఉండవు’ అన్నాడు. దాంతో రాజుగారు నిజం కనిపెట్టేసి దొంగతనం చేసినందుకు ఆ స్నేహితునికీ, దొంగ సాక్ష్యం చెప్పినందుకు పోలయ్యకీ శిక్షలు వేశాడు! ఈ సామెత అలా వచ్చిందే. -
షేడ్ నెట్లో సాగు.. బహు బాగు
ఒంగోలు టూటౌన్, అద్దంకి: షేడ్ నెట్ల కింద కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాల మొక్కలు, ఔషధ మొక్కలు పండించవచ్చు. శాశ్వత పద్ధతిలో ఇనుము, అల్యూమినియం పైపులపై పరారుణ కిరణాలను తట్టుకునే పాలిథీన్ షీట్ కప్పి తుంపర, బిందు సేద్యం ద్వారా పైర్లు సాగు చేయవచ్చు. కర్రలపై షేడ్ నెట్లు పరిచి వాటి కింద మిరప, క్యారెట్ తదితర కూరగాయలు, ఆకు కూరలు పండి ంచవచ్చు. షేడ్ నెట్లలో మొక్కలకు బయట కన్నా తక్కువ నీరు సరిపోతుంది. బిందు సేద్యం పద్ధతిలో మొక్కలకు నీటి ద్వారా పోషకాలు, ఎరువులు అందించవచ్చు. తద్వారా నీటిని పొదుపు చేయడంతో పాటు ఎరువుల వృథా తగ్గుతుంది. షేడ్ నెట్లో ఏడాదంతా సాగు.. ఎకరా లేదా రెండు ఎకరాల(రైతు ఎంతైనా ఎంచుకోవచ్చు) భూమి పైభాగాన్ని పూర్తిగా నెట్(వల)తో కప్పుతారు. షేడ్ నెట్లో మట్టిని మొక్కలు మొలిచి నిలబడానికి కావాల్సిన ఆధారం ఇవ్వగలిగేలా చేయాలి. మట్టి మిశ్రమంలో శిలీంద్రాలు, బ్యాక్టీరియా, కీటకాలు, వాటి గుడ్లు ఉంటాయి. అందు వల్ల మట్టిని నీటి ఆవిరితో శుద్ధి చేయాలి. మట్టి మిశ్రమంలో తగినంత తేమ ఉండగానే 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిని ముందుగా తయారు చే సుకున్న బెడ్లపై పొసి ఆరబెట్టాలి. మిథైల్ బ్రోమైడ్ లేదా క్లోరోఫిన్ రసాయనంతో కూడా బె డ్లను శుద్ధి చేయవచ్చు. 2 శాతం ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో మట్టి మిశ్రమాన్ని లేదా మడులను తడిపి వెంటనే పాలిథీన్ షీటును కప్పాలి. ఫార్మాల్డిహైడ్ నుంచి వెలువడే విషవాయువుల దెబ్బకు అన్ని రకాల క్రిమికీటకాలు నశిస్తాయి. ఆ తర్వాత సుగంధ, ఔషధ మొక్కలు, పూలు, కారగాయలను ఏడాదంతా పండించి లాభాలను ఆర్జించవచ్చు. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు స్రింక్లర్ల ద్వారా మధ్నాహ్నం వేళ నీటిని వెదజల్లాలి. నారు పెంపకం ఇలా.. షేడ్ నెట్ కింద రెండు అడుగుల వెడల్పున్న పొడవాటి దిబ్బలు తయారు చేయాలి. ప్లాస్టిక్ ట్రేల్లో సేంద్రియ ఎరువులు, కోక్ పిట్ ఫార్ములా ఎరువులను నింపాలి. తర్వాత వాటిలో ఏ నారు పెంచాలో ఆ నారు మేలి రకం విత్తనాలు వేయాలి. తర్వాత ఆ ట్రేలను షేడ్ నెట్‌లోని దిబ్బలపై వరుసగా పెట్టి డ్రిప్ పద్ధతి ద్వారా మొక్కలపై నీటిని వెదజల్లాలి. బోదెల ద్వారా నీటిని వరుస కాలువల్లో పెట్టాలి. తద్వారా మొక్కల పైభాగం, కింది భాగాలకు సమృద్ధిగా నీరందుతుంది. నారు మడి ఆరోగ్యంగా ఉంటుంది. వేర్ల పెరుగుదలకు కోక్ పిట్’ షేడ్ నెట్లలో మొక్కలకు సేంద్రియ ఎరువులతో పాటు కోక్ పిట్ వాడతారు. ఇది మొక్కల వేర్ల పెరుగులదలకు దోహదపడుతుంది. అదే విధంగా భూమిలో తేమ శాతాన్ని తగ్గకుండా చేసి మొక్కలు ఎండిపోకుండా కాపాడుతుంది. రాయితీ వివరాలు జిల్లాలో గిద్దలూరు, బేస్తవారిపేట, త్రిపురాంతకం, వైపాలెం, పెద్దదోర్నాల, మార్టూరు, అద్దంకి మండలాల్లో షేడ్ నెట్ల కింద కూరగాయలు, నారు పెంచుతున్నారు. ఉద్యాన శాఖ ద్వారా రైతులకు 50 శాతం రాయితీపై షేడ్ నెట్లు మంజూరు చేస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఉద్యానశాఖ-1,2 పరిధిలో ఒక్కో రైతుకు అర ఎకరాకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించారు. రాయితీ నిధులు రూ.6 లక్షల వరకు కేటాయించారు. -
కమ్మగా కాఫీ
పాడేరు, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో కాఫీ, మిరియాల తోటలు కళకళలాడుతున్నాయి. వారం పది రోజుల్లో పక్వానికి రానున్న ఈ పండ్లు గిరిజన రైతులకు సిరులు కురిపించనున్నాయి. మూడేళ్లుగా వాతావరణ పరిస్థితులు అనుకూలించక నష్టాలు చవిచూసిన ఆదివాసీలకు ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించాయి. ఏప్రిల్ నుంచి విస్తారంగా మన్యమంతటా వర్షాలు కురవడం, చల్లదనం కాఫీ తోటలతోపాటు వాటిల్లో అంతర పంటగా చేపట్టిన మిరియాల పాదులకు కూడా ఎంతో మేలు చేసింది. మినుములూరు పరిశోధనస్థానం పరిసరాల్లో ఈ సీజన్లో సుమారు వంద సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. దీంతో కాఫీ తోటలు విరగ్గాశాయి. మిరియాల పాదులకూ కాపు బాగుంది. ఏజెన్సీలో కాఫీబోర్డు కాకుండా కేవలం గిరిజనుల అధీనంలో 55 వేల హెక్టార్లలో కాఫీ తోటలు ఉన్నాయి. వీటిల్లో 38 వేల హెక్టార్లలోని తోటలు ఫలసాయాన్ని ఇస్తున్నాయి. మూడేళ్లుగా కాఫీ దిగుబడు బాగా పడిపోయాయి. గతేడాది కేవలం 5500 టన్నుల కాఫీ గింజలు ఉత్పత్తి అయ్యాయి. ఈ ఏడాది 7 వేల టన్నులకు పైబడి కాఫీ గింజలు దిగుబడి ఉంటుందని కేంద్ర కాఫీ బోర్డు డిప్యూటీ డైరక్టర్ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అటవీ అభివృద్ధి సంస్థ అధీనంలో చింతపల్లి, జీకే వీధి, మినుములూరు, పెదబయలు, అరకులోయ, అనంతగిరి ప్రాంతాల్లోని 4వేల హెక్టార్లలోని తోటల్లోనూ దిగుబడి పెరగనుంది. ఏటా వెయ్యి టన్నుల దిగుబడి ఉండగా ఈ ఏడాది ఇది మరింత పెరగనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నష్టాల్లో ఉన్న అటవీ అభివృద్ధి సంస్థకు ఇది శుభ పరిణామం. మిరియాల పాదులు కళకళ : కాఫీ తోటల్లో అంతరపంటగా సాగవుతున్న మిరియాల పాదులకు కూడా కాపు ఆశాజనకంగా ఉంది. పాదులన్నీ మిరియాల గిం జలతో కళకళలాడుతున్నాయి. సుమారు 15వేల హెక్టార్లలో అంతర పంటగా మిరియాలను సాగు చేస్తున్నారు. కాపు బాగుండటంతో గిరిజన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాఫీబోర్డు తోటల్లోనూ ఇదే పరిస్థితి.