పాడేరు : ఏజెన్సీలో తుఫాన్‌కు దెబ్బతిన్న కాఫీ, మిరియాల పంటలకు ప్రభుత్వం హెక్టార్‌కు రూ.20 వేలు పరిహారం ప్రకటించడం అన్యాయమని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి విమర్శించారు. ఆమె విలేకరులతో మాట్లాడుతు ఒక కాఫీ మొక్క ఎదిగి ఫల సాయాన్నివ్వాలంటే 10-15 ఏళ్ళు పడుతుందన్నారు.
ఏడాదికి రూ.లక్ష ఆదాయం ఇచ్చే కాఫీ, మిరియాలు పంటలు నాశనమైతే ప్రభుత్వం మొక్కుబడి సాయం ప్రకటించడం తగదన్నారు. ఎకరం కాఫీ, మిరియాల పంటకు రూ.లక్ష పరిహారం ఇవ్వనిపక్షంలో బాధిత కాఫీ రైతులతో ఏజెన్సీవ్యాప్తంగా భారీ ఉద్యమం చేపడ్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు పాడేరు ప్రాంతంలో పర్యటించి దెబ్బతిన్న కాఫీ తోటలను పరిశీలించకపోవడం దారుణమన్నారు.
ఏజెన్సీలో 27,501 హక్టార్లలో కాఫీ పంట నాశనమైందని అధికారులు కూడా కాకి లెక్కలుచూపుతున్నారని, పూర్తిస్థాయి లో సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆమె దుయ్యబట్టారు. కాఫీ పంటకు సుమా రు రూ.500 కోట్ల న ష్టం వాటిల్లితే కేవలం రూ. 37 కోట్లుగానే అ ధికారులు చూపడం తగదన్నారు. మోదాపల్లి ప్రాంతంలో ధ్వంసమైన కాఫీ పంటను చూసి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించారని చెప్పారు. ఏజెన్సీలో వరి, జీడిమామిడి, పత్తి పం టలకు, అరకు ప్రాంతంలో ప్రాణ నష్టం కూడా సంభవించిందన్నారు.
తుఫాన్‌కు మన్యంలో భా రీ నష్టం వాటిల్లినా అధికార యంత్రాంగం పూ ర్తిస్థాయిలో సహాయక చర్యలు చేపట్టడం లేదన్నారు.ప్రభుత్వమం తా విశాఖపట్నంలో ఉన్నా విద్యుత్ పునరుద్ధరణ, తాగునీరు సరఫరా, వైద్యసేవలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆహార సామాగ్రిని నెలకు సరిపడా ఉచితంగా ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం 25 కిలోల బియ్యం, త క్కువ ఇతర నిత్యావసరాలను పంపిణీ చేస్తూ చేతులు దులుపుకుంటోందన్నారు. ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ఏజెన్సీలోని అన్ని వర్గాల తుఫాను బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సరకులు సక్రమంగా పంపిణీ చేయాలి
పాడేరు: తుఫాన్ బాధితులకు సరఫరా చేస్తున్న నిత్యావసరాలను సక్రమంగా పంపిణీ చేయాలని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆదేశించారు. సుండ్రుపుట్టు డీఆర్ డిపో వద్ద లబ్ధిదారులకు బియ్యం, సరకులను ఆమె సోమవారం పంపిణీ చేశారు. సరకుల తూకాల్లో తేడాలొస్తే తనకు వెంటనే ఫిర్యాదు చేయాలని కోరారు. అనంతరం జీసీసీ గిడ్డంగిలో ఉన్న ఉచిత బియ్యం, పంచదార నిల్వలను పరిశీలించారు. సరకుల పంపిణీలో అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. జీసీసీ మేనేజర్ నరసింగరాజు తదితరులు పాల్గొన్నారు.
కాఫీ రైతులకు అన్యాయం చేస్తే ఉపేక్షించం
Published Tue, Oct 21 2014 1:57 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement