చండీగఢ్: పంజాబ్‌లోని బటిండా సైనిక స్థావరంలో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. తాజాగా అదే ప్రాంతంలో ఓ ఆర్మీ సైనికుడు తుపాకీ కాల్పులతో మరణించాడు. కాల్పుల ఘటనలో ఫిరంగి విభాగానికి చెందిన నలుగురు సిబ్బంది మరణించిన 12 గంటల తర్వాత.. బుధవారం మధ్యాహ్నం ఈ జవాను మృతి చెందాడు.
ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ.. "భటిండా మిలిటరీ స్టేషన్‌లో ఏప్రిల్ 12న సాయంత్రం 4:30 గంటలకు ఒక సైనికుడికి తుపాకీ గాయమైంది. అతను తన సేవా ఆయుధంతో సెంట్రీ డ్యూటీలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సైనికుడిని వెంటనే మిలిటరీ ఆసుపత్రికి తరలించామని, అయితే అతను చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. అయితే, తాజా ఘటనకు అంతకుముందు జరిగిన కాల్పులతో ఎలాంటి సంబంధం లేదని అధికారలు పేర్కొన్నారు.
ఈ జవాను ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఏదైనా ప్రమాదం జరిగిందా..? అన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదవశాత్తు తుపాకీ పేలడంతో మరణించినట్లు ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, తాజా ఘటనతో 24 గంటల వ్యవధిలోనే బఠిండా సైనిక స్థావరంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment