
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్‌తో అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్( ఫైల్ ఫొటో)
ముంబై: మహారాష్ట్రలోని ఏఐఎంఐఎం నేతపై కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు మాజీ మాలెగావ్ మేయర్ అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్ ఇసాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు సార్లు కాల్చడంతో మాలిక్ శరీరంపై మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
మాలిక్ శరీరంపై ఎడమవైపు ఛాతి, ఎడమ తొడ, కుడి చెతిపై బెల్లెట్ గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీలో మాలిక్ చాలా కీలకమైన నేత వ్యవహరిస్తున్నారు. మాలెగాల్ పోలీసుల ప్రకారం..సోమవారం తెల్లవారుజన 1.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు.