shot attack
-
మహారాష్ట్ర ఎంఐఎం నేతపై కాల్పులు
ముంబై: మహారాష్ట్రలోని ఏఐఎంఐఎం నేతపై కాల్పులు జరిగాయి. సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు మాజీ మాలెగావ్ మేయర్ అబ్దుల్ మాలిక్ మహమ్మద్ యూనస్ ఇసాపై మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. మూడు సార్లు కాల్చడంతో మాలిక్ శరీరంపై మూడు చోట్ల బుల్లెట్ గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మాలిక్ శరీరంపై ఎడమవైపు ఛాతి, ఎడమ తొడ, కుడి చెతిపై బెల్లెట్ గాయాలు అయ్యాయి. మహారాష్ట్ర ఎంఐఎం పార్టీలో మాలిక్ చాలా కీలకమైన నేత వ్యవహరిస్తున్నారు. మాలెగాల్ పోలీసుల ప్రకారం..సోమవారం తెల్లవారుజన 1.20 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో ఇంకా ఎవరినీ అరెస్ట్ చేయలేదు. -
టీన్ బర్త్‌డే పార్టీలో కాల్పుల కలకలం..నలుగురు మృతి
ఒక టీనేజర్ బర్త్‌డే పార్టీ వేడుకలో కాల్పుల కలకలం జరిగింది. దాదాపు 20 మందికి పైగా కాల్పులకు గురయ్యారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున దక్షిణ యూఎస్‌లోని అలబామా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఒక టీనేజర్ 16వ పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లు తెలిపారు. ఆ వేడుకలో తలెత్తిన వివాదం ఈ కాల్పులకు దారితీసినట్టుగా షెరీఫ్ కార్యాలయం అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో పార్టీ జరిగిన భవనం చుట్టూ భద్రత బలగాలుల గట్టిగా మోహరించినట్లు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని, పలువురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు..ఆ ప్రమాదంలో అనేకమంది గాయపడ్డారని, వారిలో అధికంగా యువకులే ఉన్నారని చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. (చదవండి: ఇజ్రాయెల్‌లో మళ్లీ ఎగిసిన నిరసన జ్వాల..వీధుల్లోకి వేలాదిమంది ప్రజలు) -
వీర శునకం... ఉగ్రదాడిలో రెండు బుల్లెట్లు దిగినా లెక్కచేయక....
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ జిల్లాలోని టాంగ్పావా ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి సమాచారం అందుకున్న భద్రతా దళాలు సెర్చ్ చేసే ఆపరేషన్ని ప్రారంభించాయి. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు, భధ్రతా బలగాల మధ్య జరిగిన ఎన్కౌంటర్ దాడిలో ఆర్మీ కుక్క తీవ్రంగా గాయపడింది. తొలుత ఉగ్రవాదులు ఉంటున్న ఇంటికి 'జూమ్' అనే ఆర్మీ కుక్కను పంపినట్లు అధికారులు తెలిపారు. ఉగ్రవాదులు దాగి ఉన్న ఇంటిపై దాడి చేసి, చేజ్ చేసే పనిలో భాగంగా జూమ్ ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసింది. ఆ సమయంలోనే కుక్క శరీరంలోకి రెండు బుల్లెట్లు దూసుకుపోయాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడింది. దీని ఫలితంగా ఇద్దరు ఉగ్రవాదులు లొంగిపోయారు. ఈ ఎన్కౌంటర్లో లష్కరే తోయిబా ఉగ్రవాదులు మరణించగా, పలువురు జవాన్లు గాయపడ్డారు. ఆ తర్వాత అధికారులు జూమ్‌ని హుటాహుటిన ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుక్క ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఈ జూమ్ అనే కుక్క అత్యంత శిక్షణ పొందిన క్రూరమైన, నిబద్ధత కలిగిన కుక్క అని చెప్పారు. అంతేగాదు ఉగ్రవాదులను గుర్తించి దాడి చేసి పట్టుకోవడంలో అత్యంత తర్ఫీదు పొందిందని కూడా తెలిపారు. #WATCH | In an operation in Kokernag, Anantnag, Army's dog 'Zoom' attacked terrorists & received 2 gunshot injuries. In spite of that, he continued his task which resulted in neutralisation of 2 terrorists. The canine is under treatment in Srinagar, J&K. (Source: Chinar Corps) pic.twitter.com/D6RTiWqEnb — ANI (@ANI) October 10, 2022 (చదవండి: సింహం పిల్లలే కదా అనుకుంటే ఇట్లుంటది.. ఒక్క గాండ్రింపుతో హడల్) -
అమెరికాలో భారత విద్యార్థి కాల్చివేత
వాషింగ్టన్: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ కిరాణా దుకాణంలో దొంగతనానికి వచ్చిన నలుగురు వ్యక్తులు భారత విద్యార్థిని కాల్చి చంపారు. హంతకుల్లో ఒకరు భారత సంతతికి చెందినవాడని తెలిసింది. ఫ్రెస్నో పట్టణంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 21 ఏళ్ల ధరమ్‌ప్రీత్ సింగ్ జసార్ అనే విద్యార్థి టాకిల్ బాక్స్ అనే స్టోర్‌లో పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉన్న సమయంలోనే చోరీ చేయడానికి నలుగురు దొంగలు తుపాకులతో లోనికి ప్రవేశించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి జసార్ క్యాష్ కౌంటర్ వెనక దాక్కున్నా దొంగతనం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో దుండగుల్లో ఒకరు అతనిపై కాల్పులు జరపడంతో ప్రాణాలు కోల్పోయాడని ఫ్రెస్నోబీ అనే స్థానిక వార్తా సంస్థ తెలిపింది. దొంగలు అక్కడి నుంచి కొంత నగదు, సిగరెట్ బాక్సులు ఎత్తుకెళ్లినట్లు పేర్కొంది. పంజాబ్‌కు చెందిన జసార్ అకౌంటింగ్ కోర్సు చేస్తున్నారు. స్టూడెంట్ వీసాపై మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. స్టోర్‌లో దొంగతనానికి పాల్పడిన నలుగురిలో ఒకడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో భారత సంతతి విద్యార్థి 22 ఏళ్ల అమృత్‌రాజ్ సింగ్ అత్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బీఎస్పీ, ఎస్పీ మద్దతుదారుల తన్నులాట
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్‌వాది పార్టీ, సమాజ్‌వాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఎస్పీ నేత సిద్ధ గోపాల్ సాధు కుమారుడిపై బీఎస్పీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. కర్రలతో కొట్టుకుని రాళ్లను పరస్పరం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరు వర్గాల నుంచి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగ దఫాలో భాగంగా 53 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం కాస్తంత కలవరానికి గురి చేసింది. సంబంధిత కథనాలకై చదవండి.. ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు -
ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ హత్యాప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. సమాజ్‌వాది పార్టీకి చెందిన నేత కొడుకుపై బీఎస్పీ నేత కుమారుడు దాడికి పాల్పడ్డాడు. అతడిపై తుపాకితో కాల్పులు జరపడంతో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ చర్యతో మహోబా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సిద్ధ గోపాల్ సాహు కుమారుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. నాలుగో దఫా ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. గురువారం ఉదయాన్నే గుర్తు తెలియని గుండాలు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతడిని కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలయ్యాయి. సిద్ధగోపాల్ కుటుంబం మాత్రం బహుజన్ సమాజ్‌వాది పార్టీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడే ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.