ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల వేళ రాజకీయ హత్యాప్రయత్నాలు జరుగుతునే ఉన్నాయి. సమాజ్‌వాది పార్టీకి చెందిన నేత కొడుకుపై బీఎస్పీ నేత కుమారుడు దాడికి పాల్పడ్డాడు. అతడిపై తుపాకితో కాల్పులు జరపడంతో ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ చర్యతో మహోబా జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాజ్‌వాది పార్టీకి చెందిన సిద్ధ గోపాల్ సాహు కుమారుడు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు.
నాలుగో దఫా ఎన్నికల నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. గురువారం ఉదయాన్నే గుర్తు తెలియని గుండాలు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అతడిని కాన్పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయాలయ్యాయి. సిద్ధగోపాల్ కుటుంబం మాత్రం బహుజన్ సమాజ్‌వాది పార్టీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడే ఈ దాడి వెనుక ఉన్నట్లు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.