బీఎస్పీ, ఎస్పీ మద్దతుదారుల తన్నులాట
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బహుజన్ సమాజ్‌వాది పార్టీ, సమాజ్‌వాది పార్టీ మద్దతుదారులు, కార్యకర్తలు తన్నుకున్నారు. ఎస్పీ నేత సిద్ధ గోపాల్ సాధు కుమారుడిపై బీఎస్పీ నేత అరిదర్మాన్ సింగ్ కుమారుడు కాల్పులు జరిపినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. కర్రలతో కొట్టుకుని రాళ్లను పరస్పరం రువ్వుకున్నారు.
ఈ దాడిలో ఇరు వర్గాల నుంచి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నాలుగ దఫాలో భాగంగా 53 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటు చేసుకున్న ఈ పరిణామం కాస్తంత కలవరానికి గురి చేసింది.
సంబంధిత కథనాలకై చదవండి..
ఉదయాన్నే ఎస్పీ నేత కొడుకుపై కాల్పులు