ఇమ్రాన్ఖాన్ వాహనశ్రేణిపై కాల్పులు | shots fired at opposition leader Imran Khan | Sakshi
Sakshi News home page

ఇమ్రాన్ఖాన్ వాహనశ్రేణిపై కాల్పులు

Published Fri, Aug 15 2014 2:51 PM | Last Updated on Sat, Sep 2 2017 11:55 AM

ఇమ్రాన్ఖాన్ వాహనశ్రేణిపై కాల్పులు

ఇమ్రాన్ఖాన్ వాహనశ్రేణిపై కాల్పులు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ తెహ్రరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ వాహనశ్రేణిపై దుండగులు కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఖాన్ వాహనశ్రేణిపై రాళ్లు, చెప్పులు కూడా విసిరారు. గుజ్రాన్‌వాలాలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఇమ్రాన్ఖాన్ సురక్షితంగా ఉన్నారని ఆయన తరపు ప్రతినిధి అనీలాఖాన్‌ తెలిపారు.

నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీగా ఇస్లామాబాద్ కు ఇమ్రాన్ఖాన్ బయలుదేరారు. నవాజ్ షరీఫ్ ప్రధాని రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇమ్రాన్ఖాన్పై దాడికి నిరసనగా ఆయన మద్దతుదారులు ఇస్లామాబాద్ లో ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త  పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement