అమెరికాలో భారత సంతతి వ్యక్తి మైనాంక్ పటేల్(36) ఓ మైనర్ జరిపిన కాల్పుల్లో హత్య చేయబడ్డారు. నార్త్ కరోలినాలోని తన కన్వీనియన్స్ స్టోర్‌లో దోపిడీకి వచ్చిన మైనర్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. 2580 ఎయిర్‌పోర్ట్ రోడ్‌లోని టొబాకో హౌస్ యజమాని అయన మైనాంక్ పటేల్‌పై మంగళవారం ఉదయం ఈ కాల్పులు జరిగినట్లు పేర్కొన్నారు. కాల్పులు జరిపిన మైనర్‌ను రోవాన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం అధికారులు అదుపులోకి తీసుకొని జువైనల్ హోంకు తరలించారు.
‘‘టొబాకో హౌస్ స్టోర్ నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌కు స్పందించాం. స్టోర్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న తర్వాత పటేల్ బుల్లెట్ గాయాలతో పడి ఉన్నాడు. దీంతో అతన్ని నోవాంట్ హెల్త్ రోవాన్ మెడికల్ సెంటర్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమించటంతో షార్లెట్‌లోని ప్రెస్బిటేరియన్ ఆసుపత్రికి తరలించి చిక్సిత అందించినప్పటికీ చాలా తీవ్రమైన గాయాల వల్ల మృతి చెందాడు’’ అని రోవాన్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కెప్టెన్ మార్క్ మెక్‌డానియల్ తెలిపారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ వ్యక్తి సంఘటన స్థలం నుంచి పారిపోతున్నట్లు వెల్లడైందని తెలిపారు.
అతను తుపాకీని పట్టుకుని కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కాల్పులకు ఖచ్చితమైన కారణం స్పష్టం కాలేదని, దోపిడీ వచ్చిన మైనర్.. కాల్పులు జరిపినట్లు ప్రథమికంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు చెప్పారు. మృతి చెందిన మైనాంక్ పటేల్‌కు భార్య అమీ, 5 ఏళ్ల కుమార్తెను ఉన్నారు. ఆయన భార్య ప్రస్తుతం గర్భవతి. ఆయన మృతితో భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. అందరితో కలివిడిగా ఉండే ఆయన మృతికి బుధవారం పటేల్ షాప్ ముందు పలువురు పూలు, కార్డులు పెట్టి నివాళులు అర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment