
యూనివర్శిటీలో కాల్పులు: ఇద్దరికి గాయాలు
అమెరికా: యూఎస్లోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్శిటీ క్యాంపస్లో గురువారం ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు యూనివర్శిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే వారిని తల్హాసీ స్మారక ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఎలా ఉంది అనే విషయంపై తమకు ఇంతవరకు సమాచారం అందలేదన్నారు.
యూనివర్శిటీ క్యాంపస్లోని స్ట్రోయిజర్ లైబ్రరీలో వ్యక్తి కాల్పులు జరిపాడని తెలిపారు. క్యాంపస్లోని పరిస్థితి ఆందోళనగా ఉంది... ఈ నేపథ్యంలో తగు జాగ్రత్తలు పటించాలని విద్యార్థులను యూనివర్శిటీ అధికారులు అప్రమత్తం చేశారు. ఈ కాల్పులపై మరింత సమాచారం అందవలసి ఉంది.