Ironman
-
స్పైడర్‌మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు కలిస్తే..
సాక్షి, న్యూఢిల్లీ : ‘హాలీవుడ్‌కు స్పైడర్ మేన్, బ్యాట్‌మేన్, ఐరన్మేన్లు ఉంటే కేరళ వాసులకు వీరందరు కలిసిన ఫిషర్మెన్’ ఉన్నారన్న కొటేషన్‌తో కేరళ వరద ప్రాంతాల్లో మత్స్యకారులు లేదా జాలర్లు అందించిన సేవలను సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ ప్రశంసల వర్షం కురిపిస్తోంది. వారి సహాయక చర్యలు అమోఘమని చెప్పడానికి పడవ పక్కన ఎర్రటి వర్షపు కోటును ధరించి కుడి చేతిలో భారీ తెడ్డును పట్టుకొని ఠీవీగా నిలబడిన మత్స్యకారుడి ఫొటోను కొటేషన్ కింద పొందుపర్చారు. ఇక పక్క పడవలో కేరళ రాష్ట్ర నమూనాను చూపించారు. సమాజంలోని విద్యార్థులు, వృత్తినిపుణులు, నావికులు, సాయుధ దళాల సిబ్బంది కుల, మత భేదాలు లేకుండా నిస్వార్ధంగా వరద సహాయక చర్యల్లో నిమగ్నమైనప్పుడు ఒక్క మత్స్యకారుల సేవలనే కొనియాడడం సమంజసం కాదని కొందరికైనా అనిపించవచ్చు. కానీ కేరళ వాసుల్లో సామాజికంగా బాగా వెనకబడిన అట్టడుగు వర్గాల వారు మత్స్యకారులు. మనష్యులకు దూరంగా బతికే సముద్రపు అల్లకల్లోల ప్రపంచం వారిది. ఏ పూటకాపూట వెతుక్కునే జీవితాలు వారివి. ఇతర మానవ సమాజంతో వారు కలిసేదే బహు తక్కువ. చేపల వేట నుంచి రాగానే వారు తెగిన వలల పోగులను అల్లుకొనో దెబ్బతిన్న పడవల మరమ్మతు చేసుకొనో మళ్లీ రేపటి వేటకు సిద్ధమవుతారు. రాత్రికి ఇంత తిని పడుకుంటారు. వారికి పక్కా ఇళ్లుగానీ, ఇళ్ల పట్టాలుగానీ ఏ ప్రభుత్వం ఏనాడు కల్పించలేదు. వారు ఏనాడు డిమాండ్ చేయనూ లేదు. అలాంటి వారు నిస్వార్థంగా సేవలందించడం ఎప్పటికీ ఎనలేనిదే. ముఖ్యంగా పట్టణం తిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో వారు అందించిన సేవలు అమోఘం. దాదాపు వెయ్యి మంది జాలర్లు, ఐదు వందల బోట్లతో, సొంత డబ్బుతో ఇంధనం కొని సేవలు అందించడం మామూలు విషయం కాదు. కాకపోతే సముద్రపు అలల్లో, ప్రమాదకర పరిస్థితుల్లో బోట్లను నడిపిన అనుభవం వారికి సహాయక చర్యల్లో ఎంతో ఉపయోగపడింది. ఒక్క అలప్పూజా ప్రాంతంలోనే వారు 16000 మంది ప్రజల ప్రాణాలను రక్షించారని ఆ జిల్లా కలెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు. ‘అరే సరిగ్గా చదువుకోకపోతే మత్స్యకారుడివి తప్పా మరేమి కావంటూ మా ట్యూషన్ మాస్టర్ తిట్టినప్పుడు నిజంగా బాధ పడేవాడిని. నిజంగా నేడు వారిని చూస్తే గర్వంగా ఉంది. నీట మునిగిన ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ నుంచి నా సోదరిని రక్షించి తీసుకొచ్చారు. అందుకు ప్రతిఫలంగా తీసుకోవాల్సిందిగా ఓ నోట్ల కట్టను అందజేసినా, తమరు తమకు సోదరి లాంటి వారేనంటూ డబ్బును తిరస్కరించినట్లు నా సోదరి ఏడుస్తూ చెప్పడం నాకు ఏడుపు తెప్పించింది’ ఒకరు వాట్సాప్‌లో సందేశం పెట్టారు. ఇలాంటి సందేశాలు మరెన్నో! వైరల్ అవుతున్నాయి. సహాయక చర్యలతో మత్స్యకారుల పాత్ర ముగిసింది. ఇందులో వారు పలువురు గాయపడ్డారు. కొందరి బోట్లు కూడా దెబ్బతిన్నాయి. కేరళ పునర్నిర్మాణంలో వారి పాత్ర ఎలాగు ఉండదు. త్వరలోనే వారిని ప్రజలు మరచిపోవచ్చు. నేడు మత్స్యకారుల సేవలను కొనియాడుతూ కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తున్నారు. భారీ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. రాజకీయావసారాల కోసం మాట్లాడడం ఆ తర్వాత మరచిపోవడం రాజకీయ నాయకులకు అలవాటే. కానీ ప్రజలు అలా వారి సేవలను మరచిపోరాదు. తమ ప్రాణాలను కాపాడిన మత్స్యకారులను తర్వాతనైనా గుర్తించి అన్ని విధాల ఆదుకునే ప్రయత్నం చేయాలి. వాస్తవానికి గతేడాది వచ్చిన ‘ఓఖీ’ తుపానులో ఈ నాటి వరదల కన్నా ఎక్కువ మంది మత్స్యకారులు మరణించారు. వారి పాకలు కొట్టుకుపోయాయి. వారికి అందిన సహాయం అంతంత మాత్రమే. వారిది రోజూ చస్తూ బతికే జీవితమే. అధికారిక లెక్కల ప్రకారమే చేపల వేటకు వెళ్లన మత్స్యకారుల్లో నాలుగు రోజులకు ఒకరు చొప్పున మరణిస్తున్నారట. ప్రజలే ముందుగా తమకు సాయం చేసిన మత్స్యకారులను గుర్తించాలి, ముఖ్యంగా పడవలు దెబ్బతిన్న వారిని గుర్తించి, వారి పడవలకు మరమ్మతులు చేయించాలి. అవసరమైన వారికి వలలు కొనివ్వాలి. ఆ తర్వాత వారి ఇళ్ల స్థలాల కోసం వారి తరఫున ప్రభుత్వంతో పోరాడి ఇప్పించాలి. అందులో సహాయక చర్యల్లో పాల్గొన్న వారికే ప్రాధాన్యత ఉండేలా చూడాలి. ఆ తర్వాత వారి ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. వారికి జాతీయ, రాష్ట్ర రిస్క్యూ టీముల్లో ఉద్యోగాలు వచ్చేలా చూడాలి. అంతిమంగా వారి సేవలు చిరస్మరణీయంగా ఉండేలా ఓ మెమోరియల్ లాంటిది ఏర్పాటు చేయాలి. వారి సహకార సంఘం కార్యకలాపాలు అక్కడి నుంచే ప్రారంభించేలా ఉంటే ఇంకా బాగుండవచ్చు. వీటి సాధన కోసం నవంబర్ 21న రానున్న మత్స్యకారుల దినోత్సవాన్ని లక్ష్యంగా పెట్టుకోవడం మంచిదేమో! -
సూపర్... సూపర్... సూపర్... హీరో
ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. ఇండియన్ బాక్సాఫీస్‌పై ఇన్ఫినిటీ ‘వార్’! ఇండియన్ సినిమా అభిమానులకు సూపర్ హీరో సినిమాలంటే పిచ్చి అభిమానమని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక్కడ సూపర్‌హీరోలకు చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వర్గాల వాళ్లూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్ఫినిటీ వార్ కోసం వీళ్లంతా ఏడాది ప్రారంభం నుంచే ఎదురుచూస్తూ వచ్చారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని దాదాపు రెండు వేల థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. కేవలం మొదటిరోజే 30 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టి, ఈ ఏడాది బాలీవుడ్లో అన్ని సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను బద్దలు కొట్టింది ఇన్ఫినిటీ వార్. ఇదే జోరు ఈరోజుకీ కొనసాగుతూండడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పటికే 200కోట్ల మార్క్‌ను కూడా దాటేసి (మూడోవారం ముగిసేసరికి 215 కోట్ల రూపాయలు), ‘ది జంగిల్ బుక్’ రికార్డును కూడా బ్రేక్ చేసి ఇండియాలో ఇప్పటికే పెద్ద బ్లాక్‌బస్టర్‌గా ఇన్ఫినిటీ వార్ నిలిచింది. 200 కోట్ల మార్క్‌ను చేరుకున్న మొదటి హాలీవుడ్ సినిమా ఇదే! మే నెలంతా పిల్లలకు సెలవులే కావడంతో ఇన్ఫినిటీ వార్ ఇండియాలో ఇంకొన్ని రోజులు ఇలాగే కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. విచిత్రంగా ఇప్పటివరకూ మార్వెల్ సినిమాలు పరిచయం లేని వాళ్లు కూడా అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్ గురించి ఆసక్తిగా తెలుసుకుంటూ ఉండటం విశేషంగా చెప్పుకోవాలి! ప్రపంచాన్ని అంతం చేయడానికి ఎన్ని శక్తులు పుట్టుకొచ్చినా వాటిని అంతమొందించేందుకు ఒక హీరో పుట్టుకొస్తాడు. విలన్‌కే అంత పవర్ ఉంటే హీరోకు ఇంకెంత పవర్ ఉండాలి? సూపర్ పవర్ ఉండాలి కదూ? అలాంటి సూపర్ పవర్స్‌తో మనల్ని సంవత్సరాలుగా కట్టిపడేస్తోన్న సూపర్ హీరోలందరూ ఒకేసారి తెరపై కనిపిస్తే? ఆ సంబరం ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది. ‘ఐరన్‌మేన్’, ‘స్పైడర్‌మేన్’, ‘కెప్టెన్ అమెరికా’, ‘బ్లాక్‌పాంథర్’.. ఇలా సూపర్ హీరోలుగా ఎన్నో అడ్వెంచర్స్ చేసి మనల్ని మెప్పించిన సూపర్ హీరో క్యారెక్టర్స్ అందరూ ఏకమై ఒక పెద్ద శక్తిపై పోరాడేందుకు చేసే యుద్ధమే ‘అవెంజర్స్’. ఈ సిరీస్‌లో మూడో సినిమా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ ఏప్రిల్ 27న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై ఇప్పటికీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ ఒక్క సినిమా కోసమే సూపర్ హీరో సినిమా ఫ్యాన్స్ అంతా సంవత్సర కాలంగా ఎదురుచూస్తూ వచ్చారు. మన ఇండియన్ సినిమాకు ‘బాహుబలి’ లాంటిది హాలీవుడ్‌కు ఈ సినిమా. అవెంజర్స్ ప్రత్యేకతలేంటీ? హాలీవుడ్ టాప్ ఫోర్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ పర్ఫార్మెన్స్కి కారణం ఏంటీ? తెలుసుకోవాలంటే అసలు కథలోకి వెళ్లాల్సిందే! మార్వెల్స్ మ్యాజిక్.... మార్వెల్ కామిక్స్ది ఒక చరిత్ర. కామిక్ పుస్తకాలతో దశాబ్దాలుగా ఎందరో సూపర్ హీరోలను సృష్టించిన మార్వెల్, ఆ సూపర్ హీరోలనే సినిమాలుగానూ తీసుకొచ్చి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సూపర్ హీరోలు ఇండియన్ సినిమా ఫ్యాన్స్‌కూ తెగ కిక్ ఇచ్చేస్తుంటారు. అవెంజర్స్.. ఈ సూపర్ హీరోలందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి చేయించే యుద్ధం. 2012లో ‘అవెంజర్స్’ సిరీస్‌లో మొదటి సినిమా వచ్చింది. ఇది అప్పట్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఆ తర్వాత 2015లో ‘అవెంజర్స్ : ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ వచ్చింది. అదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్. ఇక ఇప్పుడు 2018లో తాజాగా ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ వచ్చేసింది. ఇదీ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంటూ బాక్సాఫీస్‌ను కొల్లగొడుతోంది. 2019లో ఈ కొత్త సినిమాకు సీక్వెల్ రానుంది. అవెంజర్స్‌లో సూపర్ హీరోలంతా ఈ ప్రపంచాన్ని కాపాడ్డానికే కష్టపడుతుంటారు. ఒక్కో సినిమాలో ఒక్కో విలన్. ఇన్ఫినిటీ వార్ కథేంటీ? ఇన్ఫినిటీ వార్‌లో థానోస్‌పై యుద్ధం చేస్తున్నారు మన సూపర్ హీరోలంతా. ప్రపంచాన్ని జయించే శక్తిని సంపాదించి, ఈ ప్రపంచాన్నంతా తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తుంటాడు థానోస్. అందుకు ఎంతటి విధ్వంసానికైనా వెనుకాడడు. ఆ థానోస్‌ను ఎదుర్కొని, ప్రపంచాన్ని కాపాడ్డానికి సూపర్ హీరోలంతా ఏకమై ఒక యుద్ధం చేయాలి. అలాంటి ఇలాంటి యుద్ధం కాదది. థానోస్‌ను ఎదుర్కోవాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఐరన్‌మేన్, హల్క్, స్పైడర్‌మేన్ తదితర మార్వెల్ సృష్టించిన సూపర్ హీరోలంతా తమకు మాత్రమే సాధ్యమయ్యే విన్యాసాలు, అడ్వెంచర్స్ చేస్తూ థానోస్ పనిపడతారు. ఆద్యంతం కట్టిపడేసే యాక్షన్ ఎపిసోడ్స్‌తో, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో ఇన్ఫినిటీ వార్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అవెంజర్స్ టీమ్...మార్వెల్ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో పందొమ్మిదో సినిమాగా ఇన్ఫినిటీ వార్‌ను తీసుకొచ్చింది. ఆంథోని రుస్సో, జాయ్ రుస్సో ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాబర్ట్ డోనీ జూనియర్ ఐరన్‌మేన్‌గా, క్రిస్ హెమ్స్‌వర్త్ హల్క్‌గా, క్రిస్ ఈవన్స్ కెప్టెన్ అమెరికాగా, ఛద్విక్ బోస్మన్ బ్లాక్పాంథర్గా, స్కార్లెట్ జోహన్సన్ బ్లాక్ విడోగా నటించిన ఈ సినిమాలో ఎక్కడ చూసినా, ఏ సమయంలో చూసినా, స్క్రీన్ నిండా స్టార్సే కనిపిస్తారు. ఆ స్టార్స్ చేసే సందడి థియేటర్లలో అభిమానులకు పండగ వాతావరణాన్ని తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఒక్కో క్యారెక్టర్‌కూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం కూడా ఇన్ఫినిటీ వార్‌కు ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవాలి. బడ్జెట్ ‘హీరో’... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ను ఒక సినిమాటిక్ అద్భుతంలా తెరకెక్కించాలన్నది మార్వెల్ స్టూడియోస్ కల. ఆ కలకు తగ్గట్టే బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ, విజువల్ వండర్‌గా ఇన్ఫినిటీ వార్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఇందుకు అయిన బడ్జెట్ కూడా అంతా ఇంతా కాదు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. ఇది హాలీవుడ్ చరిత్రలో టాప్ 4 బడ్జెట్ సినిమాల్లో ఒకటి. అంత బడ్జెట్ పెట్టారు కాబట్టే, ఇంత మంది స్టార్స్ ఒక దగ్గరికి రావడం, ఇంత బెస్ట్ ఔట్పుట్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించడం జరుగుతోందని అంటారు ఫ్యాన్స్. బాక్సాఫీస్ ‘సూపర్ హీరో’... టాప్ 4లో చోటు... ‘అవెంజర్స్ : ఇన్ఫినిటీ వార్’ బడ్జెట్లో దాదాపు 300 మిలియన్ డాలర్లతో హీరో అయితే, బాక్సాఫీస్ వద్ద సూపర్ హీరో రేంజ్లో నాలుగో వారంలోకి అడుగు పెట్టేసరికి 1.7 బిలియన్ డాలర్లు (సుమారు 11 వేల కోట్ల రూపాయలు) వసూలు చేసి 2 బిలియన్ మార్క్ వైపు దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఒక ప్రభంజనమే సృష్టిస్తూ వచ్చిందీ సినిమా. -
ఈ మానవుడు... విమానయానవుడు!
హాలీవుడ్ సినిమా ఐరన్‌మ్యాన్ చూశారా మీరు? అందులో హీరో టోనీ స్టార్క్. ప్రత్యేకమైన సూట్ ఒకటి తయారు చేసుకుని దాంతో గాల్లోకి ఎగిరేస్తాడు. అంతేకాదు, అతడు చేయి విదిలిస్తే చాలు.. బాంబులు పేలుతూంటాయి! సూట్‌తోనే హీరో ఇంకా ఎన్నెన్నో హీరోయిజమ్స్ ప్రదర్శిస్తూంటాడు. ఇలాంటిది తనకూ ఒకటి ఉంటే బాగుంటుంది అనుకున్నాడో ఏమో బ్రిటన్‌కు చెందిన రిచర్డ్ బ్రౌనింగ్.. ఇదిగో ఈ ఫొటోల్లో చూపినట్లు తానూ ఎగిరే యంత్రాలను సిద్ధం చేసేసుకున్నాడు. విజయవంతంగా వాటిని పరీక్షించాడు కూడా. రిచర్డ్ చేతులకు, కాళ్లకు అతుక్కుని కనిపిస్తున్నవి మినీ విమానం ఇంజిన్లు. కుడిచేతిలో ఉంచుకున్న యాక్సెలరేటర్‌ను తిప్పితే చాలు.. మనిషి మొత్తం పైకి ఎగురుతాడు. తొలి ప్రయత్నంలో రిచర్డ్ కేవలం అరమీటరు ఎత్తు మాత్రమే ఎగరగలిగినా ఆ తరువాత నెమ్మదిగా అతడు ఇంకొంచెం ఎక్కువ ఎత్తుకు ఎగరగలిగాడు. సెకన్లలో ముగిసిన తొలి ప్రయాణం ఇప్పుడు దాదాపు 12 నిమిషాల కంటే ఎక్కువ సమయం కొనసాగుతోంది. రిచర్డ్ అభివృద్ధి చేసిన సూట్లో ఆరు ఇంజిన్లు ఉంటాయి. మొత్తం బరువు 130 కిలోలు. ఈ సూట్‌ను తగిలించుకుని అరచేతుల్ని నేలవైపు చూపితే చాలు.. నిట్టనిలువుగా పైకి ఎగరవచ్చునని అంటున్నాడు రిచర్డ్. ఈ మధ్య తనకు సోనీ కంపెనీ ఒక డిస్ప్లే యూనిట్‌ను సరఫరా చేసిందని, దీని ద్వారా ఇంజిన్లలో ఇంధనం ఎంతుంది, ఎంత ఎత్తు ఎగిరామో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చునని చెబుతున్నాడు. ఐరన్‌మ్యాన్ సినిమా తరహా సూట్ తయారు చేయాలంటే ఇంకా చాలా సమయం పడుతుంది అంటున్న రిచర్డ్ ఎప్పటికైనా దాన్ని తాను తయారు చేస్తానని కూడా అంటున్నాడు. తనంతట తాను బ్యాలెన్స్ చేసుకోగల సామర్థ్యంతో తయారయ్యే ఈ సూట్‌తో గంటకు 450 కిలోమీటర్ల వేగంతో గాల్లోకి దూసుకెళ్లవచ్చునని రిచర్డ్ అంచనా వేస్తున్నాడు. ఈ సూట్‌కు ప్రఖ్యాత గ్రీక్ ఇన్వెంటర్ డెడులస్ పేరు పెట్టే ఆలోచనలో ఉన్నాడు రిచర్డ్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ ‘ఐరన్‌మ్యాన్’ చిత్రంలోని హీరో సూట్. -
మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి
లండన్: 'కోల్డ్ ప్లే' రాకర్ క్రిస్ మార్టిన్‌కు రెండేళ్ల కిందట విడాకులు ఇచ్చినా ఇప్పటికీ ఆయనపై ఆప్యాయత తగ్గలేదని చెప్తోంది హాలీవుడ్ నటి గ్వెనెత్ పాల్టో. మాజీ భర్త క్రిస్ కోసం వంట వండి స్వయంగా తన చేతులతో వడ్డించడమంటే ఇప్పటికీ ఇష్టమేనని ఈ 43 ఏళ్ల అమ్మడు చెప్తోంది. తాను తాజాగా రాసిన వంటల పుస్తకం 'ఇట్స్ ఆల్ ఈజీ: డెలిషియస్ వీక్ డే రెసిపిస్' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. ఆహార ప్రియురాలైన తాను కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఎప్పుడూ కొత్త వంటలు వండుతానని చెప్పింది. మాజీ భర్త క్రిస్ తన వంటలకు పెద్ద ఫ్యాన్ అని, అతడు ఎప్పుడైనా తన ఇంటికి వచ్చి నచ్చిన వండించుకొని తినొచ్చనని తెలిపింది. విడాకులు ఇచ్చినప్పటికీ తాము అప్పుడప్పుడు కలిసి సెలవుల్లో పర్యటనలకు వెళ్తామని తెలిపింది. తాను హెల్తీ డైట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, అయితే తన పిల్లలు యాపిల్, మోసెస్ కూడా తనను ఫాలో కావాలని కోరుకోనని, అది కొంచెం వారికి కష్టమేనని చెప్తోంది. 'ఐరన్ మ్యాన్-3', 'ఐరన్ మ్యాన్', 'ఎమ్మా', 'షెక్స్పియర్ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న గ్వెనెత్ పాల్టో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకొని.. మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. -
నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా!
రెండేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుంది అమెరికన్ నటి గ్వెనెత్ పాల్టో.. 'ఐరన్ మ్యాన్-3', 'ఐరన్ మ్యాన్', 'ఎమ్మా', 'షెక్స్పియర్ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకుంటోంది. మరో పెళ్లి చేసుకొని.. కుటుంబ ఆలనాపాలనా చూసుకోవాలని భావిస్తోంది. సొంత వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. 'కోల్డ్ ప్లే' బ్యాండ్ ప్రధాన సింగర్ క్రిస్ మార్టిన్‌కు 2014లో విడాకులు ఇచ్చిన గ్వెనెత్ ప్రస్తుతం ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దానికితోడు 'గూప్' పేరిట ఓ లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్‌ను ఆమె నడిపిస్తోంది. ఇప్పటివరకు మూడు వంటల పుస్తకాలు కూడా రాసింది. ఈ పనులతో బిజీగా ఉండటం వల్లే సినిమాల్లో నటించడం లేదని, ప్రస్తుతానికైతే కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టేనని ఆమె చెప్పింది. ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ 43 ఏళ్ల అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా భావిస్తోంది. పెళ్లి అనేది ఉన్నతమైన, అందమైన అనుబంధమని, దానికి ఎప్పుడూ తాను దూరం కాబోనని చెప్తోంది. అయితే మళ్లీ తను ఎప్పుడు పెళ్లిపీఠలు ఎక్కబోతున్నదో మాత్రం ఆమె చెప్పలేదు. -
అరగంటలో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు!
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎంత టైమ్ పడుతుంది? వోల్వో బస్సెక్కితే... పది గంటలు! కారులో హైస్పీడ్‌లో వెళితే... ఆరు ఏడు గంటలు! విమానమెక్కితే... గంట. అంతేనా! ఇలా కాకుండా... సరిగ్గా అరగంటలోనే వెళ్లగలిగితే??? అసాధ్యం కదా అంటున్నారా? ఊహూ... సాధ్యమే. కాకపోతే కొంత టైమ్ పడుతుంది. ఈ దిశగా అప్పుడే తొలి అడుగులు పడ్డాయి కూడా! రైట్ సోదరులు విమానాన్ని ఆవిష్కరించింది మొదలు ఇప్పటివరకూ రవాణా రంగంలో స్థూలంగా వచ్చిన మార్పులేవీ లేవు. కొంచెం వేగం పుంజుకోవడం మినహాయిస్తే... రైలు, బస్సు, విమానం, నౌకలే ప్రయాణానికి ఆధారంగా కొనసా...గుతున్నాయి. ఈ పరిస్థితి సమూలంగా మారిపోనుంది. ఎలన్ మస్క్ (ఎవరీ ఐరన్‌మ్యాన్ చూడండి) ఆలోచనలు ఫలించాయనుకోండి. కొన్నేళ్లలోనే ‘హైపర్‌లూప్’ పేరుతో అతికొత్త, వినూత్న, హైటెక్ రవాణా వ్యవస్థ అందుబాటులోకి రానుంది. గంటకు కనీసం 600 మైళ్ల (965 కిలోమీటర్లు) వేగంతో దూసుకెళ్లే రోజులు రానున్నాయి. అంటే... హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అరగంటలో పోవడం మాత్రమే కాదు.. కన్యాకుమారి నుంచి ఢిల్లీకి గంటకంటే కొంచెం ఎక్కువ సమయంలో చేరుకోవచ్చు!! అంత వేగం సాధ్యమేనా? 2013 ఆగస్టులో ఎలన్ మస్క్ హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ గురించి తొలిసారి ప్రకటన చేసినప్పుడు... చాలామంది ఆ ఆలోచనను ఎద్దేవా చేశారు. కానీ... ఈ ప్రాజెక్టు వివరాలు ప్రపంచానికి తెలియడం మొదలైనప్పటి నుంచి విమర్శకులు కూడా ఏమో.. సాధ్యమేనేమో అనే పరిస్థితి వచ్చింది. వాహనమేదైనా ముందుకు కదలాలంటే చాలా గురుత్వాకర్షణ శక్తితోపాటు, గాలివేగం, పీడనం వంటి అనేక రకాల శక్తులను అధిగమించాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ పరిమితులేవీ లేని అంతరిక్షంలో అతితక్కువ ఇంధనంతోనే ఉపగ్రహాలు సూపర్‌స్పీడ్‌తో వెళ్లడం మనం చూశాం కూడా. హైపర్‌లూప్ టెక్నాలజీ కూడా ఇలాంటిదే. కాకపోతే అంతరిక్షంలోని పరిస్థితులను కొద్దిగా మార్చి ఉపయోగిస్తారు. గొట్టాల్లో మున్ముందుకు... మీరు సొరంగాలను చూసే ఉంటారు కదా... కాంక్రీట్ స్తంభాలపై వందల కిలోమీటర్ల పొడవున గుండ్రటి గొట్టాలతో సొరంగాన్ని ఏర్పాటు చేస్తే అది హైపర్‌లూప్ రవాణా వ్యవస్థ అవుతుంది. కాకపోతే.. ఈ గొట్టాల్లోపల అతితక్కువ పీడనం ఉంటుంది. దాదాపు ఆరు అడుగుల వెడల్పుండే ఈ గొట్టంలో ప్రయాణీకుల కోసం బోగీలుంటాయి. ఒక్కో బోగీలో 28 మంది ప్రయాణించవచ్చు. అర నిమిషానికి ఒక బోగీ గొట్టం మార్గం గుండా ప్రయాణం మొదలుపెడుతుంది. ప్రతి వంద కిలోమీటర్లకు ఏర్పాటు చేసే ఎలక్ట్రిక్ మోటర్ ఈ బోగీలు మరింత వేగంగా ప్రయాణించేందుకు, గమ్యస్థానాన్ని చేరుకునేటప్పుడే వేగాన్ని తగ్గించేందుకూ ఉపయోగిస్తారు. బోగీ ముందుభాగంలో ఉండే భారీ ఎగ్జాస్ట్ఫ్యాన్ ఉన్న కొద్దిపాటి గాలినీ పీల్చుకుని వెనుకభాగంలోకి పంపిస్తూ ఉంటుంది. అతిసన్నటి గాలిపొరపై బోగీ తేలియాడుతూ ఉంటుందన్నమాట. ప్రయాణీకుల లగేజీని బోగీ వెనుకభాగంలో ప్రత్యేక ప్రదేశంలో ఉంచుతారు. గొట్టం మొత్తం అతితక్కువ పీడనం ఉన్నప్పటికీ ప్రయాణీకులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు ఉంటాయి. అతిపెద్ద భూకంపాలను కూడా తట్టుకునేలా... హైపర్‌లూప్ స్తంభాలు, బోగీలు ఉంటాయి. ప్రయోజనాలేమిటి? చాలానే ఉన్నాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఖర్చు గురించి. మస్క్ తన ప్రాజెక్టును శాన్ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ మధ్య ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు. దాదాపు 558 కిలోమీటర్ల దూరమున్న ఈ మార్గంలో హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు 700 కోట్ల డాలర్లు (రూ.43,000 కోట్లు) ఖర్చు అవుతుందని అంచనా కానీ దాదాపుగా ఇంతే పొడవున్న హైస్పీడ్ రైలు మార్గం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వం దాదాపు పది రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తూండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలను మండించే అవసరముండదు కాబట్టి పర్యావరణానికీ మేలు జరుగుతుంది. పైగా ఈ వ్యవస్థ రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా శక్తిని ఆదా చేస్తుంది. గొట్టపు మార్గం పొడవునా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తు చేసుకోవచ్చు. రహదారుల కోసం భూమి సేకరించాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం ఏ దశలో... ఎలన్ మస్క్ హైపర్‌లూప్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ గురించి ప్రతిపాదించింది 2013 ఆగస్టులో. కొన్ని నెలల తరువాత మస్క్ తన ఆలోచనలన్నింటినీ ‘ఆల్ఫా డిజైన్’ పేరుతో అందరితో పంచుకున్నాడు. ప్రపంచంలో ఎవరైనా ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు వీలుగా ఓపెన్ లెసైన్సింగ్ ద్వారా దీన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించాడు. రెండు మూడేళ్లలో హైపర్‌లూప్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఒక టెస్టింగ్ ట్రాక్‌ను సొంత ఖర్చులతో ఏర్పాటు చేస్తానని, బోగీలు మొదలుకొని, ఇతర వ్యవస్థలను ఎవరైనా అభివృద్ధి చేయవచ్చునని మస్క్ ప్రకటించాడు. ఇందుకు అనుగుణంగానే ఈ నెలలో హైపర్‌లూప్ టెక్నాలజీస్ అనే స్టార్టప్ కంపెనీ మస్క్ ఆలోచనలను నిజం చేసేందుకు ముందుకొచ్చింది. దీంతోపాటు జంప్‌స్టార్ట్ ఫండ్ వంటి ఇతర కంపెనీలు కూడా ఈ సరికొత్త రవాణా వ్యవస్థ రూపకల్పనకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. హైపర్‌లూప్ ప్రత్యేకతలు గరిష్ట వేగం (గంటకు) 1220 కిలోమీటర్లు ఒక్కో బోగీలో పట్టే వాహనాలు 3 వాడుకునే శక్తి 26,000 హార్స్పవర్ (2.1 కోట్ల మెగావాట్ల విద్యుత్తు) సోలార్ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు 76,000 హార్స్పవర్ తొలిమార్గం శాన్ఫ్రాన్సిస్కో నుంచి లాస్ ఏంజిలెస్ టికెట్ ఖరీదు 20 డాలర్లు (రూ.1200) ప్రయాణీకుల సంఖ్య (గంటకు) 840 -
ఎవరీ ఐరన్‌మ్యాన్?
మీరు ఇంటర్నెట్లో డబ్బు చెల్లించేందుకు పే పాల్‌ను ఉపయోగించినా, హాలీవుడ్ సినిమా ఐరన్మ్యాన్ను చూసి ఉన్నా ఎలన్మ్స్క్ మీకు చిరపరిచితుడే. పేపాల్ సృష్టికర్తగానే కాకుండా ఐరన్‌మ్యాన్ సినిమా ఈయన జీవిత కథ ఆధారంగానే తీశారని టాక్. ఈ 43 ఏళ్ల యువ మేధావి పే పాల్ తరువాత అనేక కొత్త సంస్థలు ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ కంపెనీ ద్వారా ప్రపంచంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ తయారీ సంస్థను ఏర్పాటు చేశాడు. స్పేస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 1, ఫాల్కన్ 9 రాకెట్లు నాసా తరఫున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సరుకులు రవాణా చేశాయి. దీంతోపాటు అమెరికాలోనే రెండో అతిపెద్ద సౌరశక్తి కంపెనీ ‘సోలార్ సిటీ’ వెనుక, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యధిక మైలేజీనిచ్చే ఎలక్ట్రిక్ కార్లు తయారు చేసే ‘టెస్లా’ కంపెనీ యజమానిగా మస్క్ గుర్తింపు పొందారు. మస్క్ ఫౌండేషన్ ద్వారా పసిపిల్లల వైద్యం కోసం, భూతాపోన్నతిని తగ్గించేందుకు సంప్రదాయేతర ఇంధనవరులను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తూ తన దాతృత్వాన్ని చాటుతారు మస్క్! -
ఐ మిస్ హిమ్!
ఒకరికొకరుగా తిరిగేసి... పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేసేసి... ఎవరికి వారుగా విడిపోయిన హాలీవుడ్ తార జినెత్ పాల్ట్రో, పాప్ స్టార్ క్రిస్ మార్టిన్లు ఇప్పుడు బాధపడుతున్నట్టున్నారు. మార్టిన్ బయటపడలేదు గానీ... జినెత్ మాత్రం... ‘మేమిద్దరం పెళ్లి చేసుకుని ఉండాల్సింది’ అంటూ తెగ ఫీలై పోతోంది. ‘మా పిల్లల కోసమన్నా కలిసుండాల్సింది. నాడు మేం ఎన్నో పొరపాట్లు చేశాం. మంచి రోజులు... అలాగే దుర్దినాలూ షేర్ చేసుకున్నాం. ఒకటిగా కెరీర్లో ముందుకు సాగాం. ఎప్పుడూ.. ఏ విషయంలోనూ గొడవపడలేదు. అంత అద్భుతమైన రిలేషన్ మా మధ్య కొనసాగినందుకు గర్వపడుతున్నా’ అందీ ‘ఐరన్‌మ్యాన్’ తార. సుదీర్ఘకాలం కోల్డ్‌ప్లేతో వైవాహిక జీవితం గడిపిన జినెత్... గత ఏడాది మార్చిలో అతడి నుంచి విడిపోయింది. -
ప్రపంచంలో అత్యంత కష్టమైన క్రీడ
ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ స్విమ్మింగ్.. సైక్లింగ్.. రన్నింగ్.. ఈ మూడు కలిస్తే ట్రయాథ్లాన్. 1.5 కిలోమీటర్ల దూరం స్విమ్మింగ్.. 40 కిలోమీటర్ల సైక్లింగ్.. 10 కిలోమీటర్ల పరుగు పూర్తి చేసే వారే విజేతలుగా నిలుస్తారు. క్లిష్టమైన క్రీడల్లో ఒకటైన ట్రయాథ్లాన్‌ను మించిన కష్టసాధ్యమైనది మరొకటి ఉంది. అదే ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్. ప్రపంచంలోనే దీన్ని అత్యంత కష్టమైన క్రీడగా చెబుతుంటారు. ప్రపంచ ట్రయాథ్లాన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రతీయేటా జరిగే ఐరన్మ్యాన్లో పాల్గొనే అథ్లెట్లు 3.86 కిలోమీటర్లు స్విమ్మింగ్ చేసి... ఆ తర్వాత 180.25 కిలోమీటర్లు సైకిల్ తొక్కాలి. ఆ వెంటనే 42.2 కిలోమీటర్ల మారథాన్‌ను పూర్తి చేయాలి. ఈ మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసిన వారే విజేత. అయితే ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్‌ను కేవలం 17 గంటల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే ఈ ట్రయాథ్లాన్లో తొలి దశలో స్విమ్మింగ్‌ను ఉ. గం. 9.20 ని. కల్లా పూర్తి చేయాలి. సైక్లింగ్‌ను సా. గం. 5.30 ని.లకు (8 గం. 10 ని. ల్లో) పూర్తి చేసి మారథాన్‌ను మొదలుపెట్టాలి. అర్ధరాత్రి 12 కల్లా (6 గం. 30 ని.ల్లో) ముగించాలి. ఇలా మూడు దశలను వేగంగా ముగించిన వారే ఐరన్‌మ్యాన్ టైటిల్‌ను అందుకుంటారు. హవాయ్ వేదికగా... కష్టసాధ్యమైన ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ పోటీలు హవాయ్ వేదికగా ప్రతీయేడాది జరుగుతాయి. 1978 నుంచి ఈ ట్రయాథ్లాన్‌ను నిర్వహిస్తున్నారు. ఐరన్‌మ్యాన్ ప్రపంచ చాంపియన్‌షిప్ పేరుతో పోటీలను జరుపుతున్నారు.