మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి | Gwyneth Paltrow still likes to cook for ex husband | Sakshi
Sakshi News home page

మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి

Published Tue, Apr 5 2016 1:36 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి

మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి

లండన్‌: 'కోల్డ్ ప్లే' రాకర్ క్రిస్ మార్టిన్‌కు రెండేళ్ల కిందట విడాకులు ఇచ్చినా ఇప్పటికీ ఆయనపై ఆప్యాయత తగ్గలేదని చెప్తోంది హాలీవుడ్ నటి గ్వెనెత్‌ పాల్టో. మాజీ భర్త క్రిస్‌ కోసం వంట వండి స్వయంగా తన చేతులతో వడ్డించడమంటే ఇప్పటికీ ఇష్టమేనని ఈ 43 ఏళ్ల అమ్మడు చెప్తోంది. తాను తాజాగా రాసిన వంటల పుస్తకం 'ఇట్స్‌ ఆల్ ఈజీ: డెలిషియస్ వీక్‌ డే రెసిపిస్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. ఆహార ప్రియురాలైన తాను కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఎప్పుడూ కొత్త వంటలు వండుతానని చెప్పింది.

మాజీ భర్త క్రిస్ తన వంటలకు పెద్ద ఫ్యాన్ అని, అతడు ఎప్పుడైనా తన ఇంటికి వచ్చి నచ్చిన వండించుకొని తినొచ్చనని తెలిపింది. విడాకులు ఇచ్చినప్పటికీ తాము అప్పుడప్పుడు కలిసి సెలవుల్లో పర్యటనలకు వెళ్తామని తెలిపింది. తాను హెల్తీ డైట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, అయితే తన పిల్లలు యాపిల్‌, మోసెస్‌ కూడా తనను ఫాలో కావాలని కోరుకోనని, అది కొంచెం వారికి కష్టమేనని చెప్తోంది.

'ఐరన్‌ మ్యాన్‌-3', 'ఐరన్‌ మ్యాన్‌', 'ఎమ్మా', 'షెక్‌స్పియర్‌ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న గ్వెనెత్‌ పాల్టో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకొని.. మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement