Gwyneth Paltrow
-
అందం కోసం తేనెటీగలతో కుట్టించుకుంది!
లాస్ ఏంజెల్స్: అందంగా కనిపించడానికి ఏదైనా చేస్తానని అంటోంది.. హాలివుడ్ నటి గ్వైనెత్ పాల్త్రోవ్. తాజాగా ఆక్యుపంక్చర్‌లో భాగంగా తేనెటీగలతో డజన్ల సార్లు కుట్టించుకున్నానని చెప్పిందీ భామ. అంతేకాదు తనను తాను గినియా పందితో పోల్చుకున్న ఈ ఆస్కార్ విన్నర్ ఏం చేయడానికైనా ఎప్పుడూ సిద్దంగా ఉంటానంటోంది. తేనెటీగలతో తీసుకునే ఈ చికిత్స వేల సంవత్సరాల నుంచి అందుబాటులో ఉందని తెలిపింది. ఎపిథెరపీగా పిలిచే ఈ చికిత్సను చర్మం మీద మచ్చలను తగ్గించుకునేందుకు చేయించుకుంటారని, అయితే.. ఈ చికిత్స చేయించుకోవడానికి చాలా ధైర్యం, నొప్పిని భరించగల శక్తి ఉండాలని చెప్పింది 43 ఏళ్ల పాల్త్రోవ్. కీళ్ల నొప్పులు, వాపు, చర్మం మీద ఎర్రగా కనిపించడం, రక్తప్రసరణను పెంచడానికి ఆక్యుపంక్చర్ బాగా ఉపయోగపడుతుంది. -
మాజీ భర్త కోసం ఇప్పటికీ వంట చేస్తా:నటి
లండన్: 'కోల్డ్ ప్లే' రాకర్ క్రిస్ మార్టిన్‌కు రెండేళ్ల కిందట విడాకులు ఇచ్చినా ఇప్పటికీ ఆయనపై ఆప్యాయత తగ్గలేదని చెప్తోంది హాలీవుడ్ నటి గ్వెనెత్ పాల్టో. మాజీ భర్త క్రిస్ కోసం వంట వండి స్వయంగా తన చేతులతో వడ్డించడమంటే ఇప్పటికీ ఇష్టమేనని ఈ 43 ఏళ్ల అమ్మడు చెప్తోంది. తాను తాజాగా రాసిన వంటల పుస్తకం 'ఇట్స్ ఆల్ ఈజీ: డెలిషియస్ వీక్ డే రెసిపిస్' ప్రమోషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడింది. ఆహార ప్రియురాలైన తాను కుటుంబసభ్యులు, స్నేహితుల కోసం ఎప్పుడూ కొత్త వంటలు వండుతానని చెప్పింది. మాజీ భర్త క్రిస్ తన వంటలకు పెద్ద ఫ్యాన్ అని, అతడు ఎప్పుడైనా తన ఇంటికి వచ్చి నచ్చిన వండించుకొని తినొచ్చనని తెలిపింది. విడాకులు ఇచ్చినప్పటికీ తాము అప్పుడప్పుడు కలిసి సెలవుల్లో పర్యటనలకు వెళ్తామని తెలిపింది. తాను హెల్తీ డైట్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని, అయితే తన పిల్లలు యాపిల్, మోసెస్ కూడా తనను ఫాలో కావాలని కోరుకోనని, అది కొంచెం వారికి కష్టమేనని చెప్తోంది. 'ఐరన్ మ్యాన్-3', 'ఐరన్ మ్యాన్', 'ఎమ్మా', 'షెక్స్పియర్ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న గ్వెనెత్ పాల్టో సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకొని.. మరో పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్టు గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్తో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. -
నటనకు బ్రేకిస్తా.. మళ్లీ పెళ్లి చేసుకుంటా!
రెండేళ్ల కిందట భర్త నుంచి విడాకులు తీసుకుంది అమెరికన్ నటి గ్వెనెత్ పాల్టో.. 'ఐరన్ మ్యాన్-3', 'ఐరన్ మ్యాన్', 'ఎమ్మా', 'షెక్స్పియర్ ఇన్ లవ్' వంటి సినిమాల్లో నటించి ఓసారి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్న ఈ అమ్మడు ఇప్పుడు సినిమాల నుంచి కాస్త విరామం తీసుకోవాలనుకుంటోంది. మరో పెళ్లి చేసుకొని.. కుటుంబ ఆలనాపాలనా చూసుకోవాలని భావిస్తోంది. సొంత వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిశ్చయించుకుంది. 'కోల్డ్ ప్లే' బ్యాండ్ ప్రధాన సింగర్ క్రిస్ మార్టిన్‌కు 2014లో విడాకులు ఇచ్చిన గ్వెనెత్ ప్రస్తుతం ఇద్దరు పిల్లలను చూసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తోంది. దానికితోడు 'గూప్' పేరిట ఓ లైఫ్‌స్టైల్ వెబ్‌సైట్‌ను ఆమె నడిపిస్తోంది. ఇప్పటివరకు మూడు వంటల పుస్తకాలు కూడా రాసింది. ఈ పనులతో బిజీగా ఉండటం వల్లే సినిమాల్లో నటించడం లేదని, ప్రస్తుతానికైతే కొంతకాలం సినిమాల నుంచి విరామం తీసుకున్నట్టేనని ఆమె చెప్పింది. ప్రస్తుతం టీవీ నిర్మాత బ్రాడ్ ఫాల్చుక్తో ప్రేమాయణం సాగిస్తున్న ఈ 43 ఏళ్ల అమ్మడు మళ్లీ పెళ్లి చేసుకోవాలని కూడా భావిస్తోంది. పెళ్లి అనేది ఉన్నతమైన, అందమైన అనుబంధమని, దానికి ఎప్పుడూ తాను దూరం కాబోనని చెప్తోంది. అయితే మళ్లీ తను ఎప్పుడు పెళ్లిపీఠలు ఎక్కబోతున్నదో మాత్రం ఆమె చెప్పలేదు.