అమెరికాలో త్రిష సాహస క్రీడలు | Trisha adventures in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో త్రిష సాహస క్రీడలు

Published Fri, Jan 1 2016 9:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో త్రిష సాహస క్రీడలు - Sakshi

అమెరికాలో త్రిష సాహస క్రీడలు

చెన్నై  : సినీ తారల సాహస క్రీడలు వెండితెరపై చూసి ప్రేక్షకులు తెగ సంబరపడిపోతుంటారు.అయితే వాటి వెనుక చాయాగ్రాహక ట్రిక్స్, సాంకేతిక పరిజ్ఞాన జాలాలు ఉంటాయి. నిజ జీవితంలో సాహస క్రీడల్లో శిక్షణ పొందిన వారు చాలా చాలా అరుదనే చెప్పాలి. అలాంటి సాహస క్రీడల్లో చెన్నై చిన్నది త్రిష దుమ్మురేపుతున్నారు. ఆకాశంలో రౌండులు, మంచుకొండల్లో యమాగా ఎంజాయ్ చేసేస్తున్నారు. అసలు అందాలభామ త్రిష జీవితమే ఒక సంచలనం అనవచ్చు. ఇంకా చెప్పాలంటే తన ఇప్పటి ఉన్నత స్థాయి కోసం తొలి రోజుల్లో పెద్ద పోరాటమే చేశారామె.
 
మొదట మోడలింగ్‌తో జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత నటిగా రాణించాలనే ఆకాంక్షతో  సహాయ నటిగా నటించడానికి కూడా సిద్ధమయ్యారు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నటిగా ఎదిగారు. విశేషం ఏమిటంటే ఆదిలో పలు ఒడిదుడుకులను ఎదుర్కొన్న త్రిష తన సినీ సామ్రాజ్యంలో 12 ఏళ్ల టాప్ హీరోయిన్‌గా తన స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ వ్యక్తిగతంగా పలు అవరోధాలను అధిగమించి ధైర్యంగా ముందుకు సాగుతున్నారు.
 
ముఖ్యంగా వ్యాపారవేత్త, సినీ నిర్మాత వరుణ్‌మణియన్‌లో ప్రేమ పెళ్లికి దారి తీసి, నిశ్చితార్థం జరిగి, ఇక పెళ్లే తరువాయి అన్న సమయంలో పెటాకులవ్వడం, ఒక టాలీవుడ్ నటుడితో ప్రేమ బ్రేకప్ లాంటి అంశాలు త్రిషను బాధింపునకు గురి చేశాయన్నది నిజమే అయినా వాటికీ ఏమాత్రం చలించక ఆ ప్రభావాన్ని తన నట కేరీర్ మీద పడనీయకుండా జాగ్రత్త పడుతూ అదే సమయంలో తన ఆనంద క్షణాలను కోల్పోకుండా నచ్చిన విధంగా జీవిత పయనాన్ని సాగిస్తున్నారు.
 
ఎలాంటి సమస్యలు ఎదురైనా త్రిష ప్రతి ఏడాది విదేశాల జాలీ ట్రిప్‌ను మిస్ చేసుకోరు.అదే విధంగా ఈ ఏడాది క్రిస్మస్,నూతన సంవత్సం వేడుకల్ని అమెరికాలో తన నెచ్చెలిలతో జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అమెరికాలోని వేగాస్,గ్రింట్‌కెన్‌యాన్,నబ్బాపళ్లతాక్కు తదితర ప్రదేశాల్లో క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్న త్రిష పనిలో పనిగా ఆమె అమెరికాలో ఆకాశంలో ఎగిరే క్రీడలో,మంచు ప్రాంతాల్లో స్కేటింగ్ క్రీడలో శిక్షణ పొందారట. నూతన సంవత్సర వేడుకల్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో జరుపుకోనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement