
ముంబై: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూకు చెందిన ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగం బీఎండబ్ల్యూ మోటొరాడ్.. భారత మార్కెట్లోకి మరో అధునాతన ప్రీమియం బైక్‌ను మంగళవారం ప్రవేశపెట్టింది. ‘బీఎండబ్ల్యూ ఎఫ్850 జీఎస్ అడ్వెంచర్’ పేరిట విడుదలైన ఈ బైక్ ధర రూ.15.40 లక్షలు (ఎక్స్‌షోరూం)గా కంపెనీ ప్రకటించింది.
అనలాగ్ టాకోమీటర్, మల్టీ–ఫంక్షనల్ డిస్‌ప్లే, కంట్రోల్ ల్యాంప్స్ వంటి అధునాతన ఫీచర్లు కలిగిన ఈ బైక్.. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న బీఎండబ్ల్యూ మోటొరాడ్ డీలర్ల వద్ద మంగళవారం నుంచే బుకింగ్స్ ప్రారంభమైనట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment