
'సాహసం చేయరా డింబకా' అనే పదానికి న్యాయం చేసేలా కొందరు చేసిన సాహసాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేసిన సాహసాలను కలిపి ఓ వీడియోలో పొందుపరిచారు. ఈ వీడియోలోని కళ్లు చెదిరే విన్యాసాలు నెటిజన్లను అమితంగా ఆకర్షిస్తున్నాయి. రెక్కలున్న పక్షిలా గాల్లో ఎగురుతూ, సైకిళ్లతో విన్యాసాలు చేస్తూ, ఏకంగా ఆకాశంలోనే బంతితో ఆడుతూ చేసిన సాహసాలు అందరిని అబ్బురపరిచేలా చేశాయి. గుర్రపు స్వారీ చేస్తూ లక్ష్యం గురి తప్పకుండా బాణాలు సందిస్తూ, ఆకాశ హర్మ్యాల పక్క నుంచి గాల్లో విహరిస్తూ చేసిన సాహసాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment