ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.
ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.
చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.
VC : how much funding do you need ?
Startup : 5 million $
VC : what's your customer acquisition plan
Then : Human ads
VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024


