Billboards
-
తమిళనాడు చెస్ ఈవెంట్ హోర్డులపై మోదీ ఫోటోలు: వీడియో వైరల్
చెన్నై: తమిళనాడులో 44వ చెస్ ఒలింపియాడ్ జులై 28న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తమిళనాడు ప్రభుత్వం ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున్న బిల్‌బోర్డు హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఐతే ఈ హోర్డింగ్‌ల్లో మోదీ ఫోటో లేకుండా ఉండటంతో తమిళనాడు బీజీపీ కార్యకర్త అమర్ ప్రసాద్ రెడ్డి స్టాలిన్ ప్రభుత్వం పై ఆరోపణలు చేయడమే కాకుండా దీన్ని అతి పెద్ద తప్పుగా పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా మరో ఇద్దరి సన్నిహితులతో కలిసి మోదీ పోటోలను ఆయా హోర్డింగ్ బోర్డుల పై అతికించడమే కాకుండా ఆ ఘటన తాలుకా వీడియోలను కూడా సోషల్ మాధ్యమాల్లో షేర్ చేశారు. పైగా ఈ కార్యక్రమం ప్రభుత్వం స్పాన్సర్ చేసే అంతర్జాతీయ కార్యక్రమం కాబట్టి మోదీ ఫోటో తప్పనిసరిగా ఉండాలని అన్నారు. దీనికిఅంతేగాదు తమిళనాడు అంతటా ఏర్పాటు చేసిన హోర్డింగ్ బోర్డులపై తనలా మోదీ ఫోటోలను పెట్టాలని పార్టీ కార్యకర్తలకి పిలుపునిచ్చారు. ఐతే హోర్డింగ్‌లపై ప్రధాని మోదీ చిత్రపటాలను పెట్టడానికి అధికారుల నుంచి అనుమతి తీసుకున్నారా అని అడిగితే... మోదీ ఫోటోను ప్రచారంలో భాగం చేయాలా వద్దా అంటూ ఎదురు ప్రశ్నించారు. వాస్తవానికి తాను ఎలాంటి అనుమతి తీసుకోలేదని, బుధవారం నుంచి హోర్డింగ్‌లపై మోదీ ఫోటోలను పెట్టడం చేస్తున్నాని చెప్పారు. తమిళనాడులో పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న ఈ చెస్ ఒలింపియాడ్ ఆగస్టు 10న ముగుస్తుంది. ఈ ఈవెంట్ కోసం తమిళనాడు ప్రభుత్వం దాదాపు 92 కోట్లు ఖర్చు చేస్తోంది. Let me remind CM @stalin that our PM Sh. @narendramodi Avl is the sole representative of this Nation🔥🔥 Here we begin!!! Chess Olympiad 2022.@annamalai_k @blsanthosh @JPNadda pic.twitter.com/eKiMW8GmQ9 — Amar Prasad Reddy (@amarprasadreddy) July 27, 2022 (చదవండి: Eknath Shinde: పొలిటికల్ హీట్ పెంచిన షిండే ట్వీట్.. ఉద్ధవ్ థాక్రేతో స్నేహం!) -
ఎలన్ మస్క్ కొత్త ప్లాన్.. ఈసారి అంతరిక్షంలో ఏకంగా..!
మీకు ఒక వ్యాపారం ఉందనుకోండి. వ్యాపారం మరింత బాగా వృద్ధి చెందడం కోసం ఏ చేస్తారు..సింపుల్‌గా అడ్వర్టైజ్మెంట్ల ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యేలా మీ వ్యాపారం గురించి తెలియజేస్తారు. ఒకప్పుడు అడ్వర్టైజ్మెంట్లను కరపత్రాల రూపంలో లేదా న్యూస్పేపర్లో యాడ్స్ రూపంలో ప్రచారం చేసేవారు. మారుతున్న కాలంతో పాటు మానవుడు సాంకేతికంగా ఎంతగానో అభివృద్ధి చెందాడు. నేటి డిజిటల్ కాలంలో సాంకేతికతను ఉపయోగించి అడ్వర్టైజ్మెంట్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ..డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పలు కంపెనీలు, వ్యాపార సంస్థలు అడ్వర్టైజ్ చేస్తున్నాయి. తాజాగా ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ అడ్వర్టైజింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలకనుంది. ఏకంగా అంతరిక్షంలో అడ్వర్టైజ్ బిల్ బోర్డ్లను ఏర్పాటుచేయనుంది. స్పేస్ఎక్స్ కంపెనీ కెనాడాకు చెందిన స్టార్టప్ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పోరేషన్ (జీఈసీ) భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహంతో ఆయా కంపెనీలు లోగోల గురించి లేదా అడ్వర్టైజ్మెంట్లను అంతరిక్షంలో బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేయనుంది. క్యూబ్‌శాట్ శాటిలైట్ చూపించే అడ్వర్టైజ్మెంట్లను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం చేయనున్నారు. అందుకోసం క్యూబ్‌సాట్‌కు సపరేటుగా సెల్ఫీ స్టిక్‌ను ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఈ శాటిలైట్‌ను ఫాల్కన్-9 రాకెటును ఉపయోగించి త్వరలోనే స్పేస్ ఎక్స్ ప్రయోగించనుంది. ఈ సందర్భంగా జీఈసీ స్టార్టప్ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ మాట్లాడుతూ..అంతరిక్షంలో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలనే కంపెనీలు డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు. క్యూబ్‌శాట్ ఉపగ్రహంతో అడ్వర్టైజింగ్ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. -
టొరంటో రోడ్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఫ్లెక్సి
టొరంటో: మనదేశంలో తయారైన కరోనా టీకాలను ఇతర దేశాలకు అందిస్తూ భారత్ విశ్వగురు పేరును సార్థకం చేసుకుంటుంది. అందులో భాగంగా కరోనా టీకాలను కెనడాకు అందించింది. గత వారం, కెనడాకు 500,000 మోతాదుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేసింది. భారత్ చూపించిన ఔదర్యానికిగాను కెనడాలోని టోరంటో రోడ్లపై ‘థ్యాంక్యు ఇండియా, పిఏం నరేంద్ర మోదీ’ అంటూ ఫ్లెక్సిలు వెలిశాయి. కెనడా, భారత్ మధ్య మైత్రి వర్ధిలాలని ఫ్లెక్సిలు ఏర్పాటు చేశారు.కెనడావాసులు కోవిడ్-19 వ్యాక్సిన్లను అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేయడంలో భారత్ ముందంజలో ఉంది. మిత్రదేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వంటి ప్రపంచ సంస్థల నుంచి మాత్రమే కాకుండా, బిల్‌గేట్స్ వంటి వ్యక్తుల నుంచి కూడా భారత్ ప్రశంసలను పొందింది. కొన్ని రోజుల క్రితం, ఇండియా-స్వీడన్ మధ్య జరిగిన వర్చువల్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 'మేడ్-ఇన్-ఇండియా' టీకాలు ఇప్పటివరకు 50 కి పైగా దేశాలకు సరఫరా చేశామన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసే ప్రణాళిక వేస్తున్నామన్నారు. భారత్150 కి పైగా దేశాలకు మందులు, ఇతర అవసరమైన వస్తువులను అందించిందన్నారు.దీనితో పాటుగా, భారత్ తన అనుభవాలను, ఆన్లైన్ శిక్షణా కార్యక్రమాలను, ఆసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఫ్రంట్‌లైన్ వారియర్స్, ఆ దేశ చట్టసభ సభ్యులతో పంచుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు. Billboards come up in Greater Toronto area thanking PM Narendra Modi for providing COVID-19 vaccines to Canada pic.twitter.com/0AaQysm6O1 — ANI (@ANI) March 11, 2021 -
టైమ్ స్క్వేర్‌పై రాముడి చిత్రాలు.. నిజమేనా?
నూయార్క్ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల కల. ఆ అపురూప ఘట్టానికి బుధవారం (ఆగస్టు 5) అంకురార్పణ పడింది.ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో డిస్ప్లే చేసినట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ఫోటోలు ఫేక్ అని తేలింది. అసలు చిత్రం అసలు టైమ్ స్క్వేర్‌లో బిల్‌బోర్డ్స్ మీద రాముడు ఫోటోలు డిస్ప్లే చేయలేదని ఓ జాతీయ మీడియా వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు నకిలీవని, డిజిటల్ మీడియా ద్వారా మార్ఫింగ్ చేశారని తేల్చిచెప్పారు. అసలు ఫోటోలు ఎలా ఉన్నాయో కూడా చూపించారు. దీంతో టైమ్స్‌స్క్వేర్ బిల్‌బోర్డ్స్ మీద డిస్ప్లే అయిన రాముడు ఫోటోలు ఫేక్ అని తేలిపోయింది. -
అలలపై అడ్వర్టైజ్మెంట్..!
దేశంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే బిల్ బోర్డ్స్ హుస్సేన్‌సాగర్‌లో సందర్శకులను ఆకట్టుకుంటున్న ఎకోఫ్రెండ్లీ థీమ్ లైటింగ్ కోసం సోలార్ ఎనర్జీ వినియోగిస్తామంటున్న హెచ్ఎండీఏ ప్రకటనలకు అనుమతినిచ్చేందుకు జీహెచ్ఎంసీ మీనమేషాలు సాక్షి, హైదరాబాద్: క్రియేటివ్ థింకింగ్... లుకింగ్ డిఫరెంట్... ఇలా విభిన్న ఆలోచన లతో సరికొత్త పంథాలో దూసుకెళుతున్న నగరవాసులను హుస్సేన్‌సాగర్‌లోని అలలపై తేలియాడుతూ ‘ఫ్లోటింగ్ బిల్‌బోర్డ్స్’అందరినీ కట్టిపడేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా నీటి అలలపై అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్ట్‌ను నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఆథారిటీ (హెచ్ఎండీఏ) పరిచయం చేస్తోంది. పర్యావరణహితంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించడంతో పాటు రాత్రి సమయాల్లో ఎల్ఈడీ బల్బుల వెలుగులతో సిటీకే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా ఇవి నిలుస్తు న్నా యి. గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీచి నా, భారీ వర్షాలు కురిసినా చెక్కు చెదరకుండా ఉండేలా స్టెబులిటీ స్ట్రక్చర్‌ను రెడీ చేశారు. జీహెచ్ఎంసీ సై అంటే సూపర్ సీన్లే... నగరంలో అడ్వర్టైజ్మెంట్కు అనుమతినివ్వా ల్సిందే జీహెచ్ఎంసీనే. అయితే ఫ్లోటింగ్ బిల్‌బోర్డ్స్ విషయాన్ని మూడు నెలల క్రితమే హెచ్ఎండీఏ అధికారులు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దీనికి అనుమతినివ్వడంపై జీహెచ్ఎంసీ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. మరో రెండు మూడు రోజుల్లో ఫ్లోటింగ్ బిల్బోర్డ్స్కు పచ్చజెండా ఊపుతారా... లేదా.. నిబంధనల్లో లేదంటూ పక్కనపెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జీహెచ్ఎంసీ పచ్చజెండా ఊపితే మాత్రం పర్యాటకులు హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ అలలపై సరికొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది. ‘ఎకో ఫ్రెండ్లీ’ థీమ్‌తో... బోటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను వాటర్ రెసిస్టెడ్ కోటెడ్ స్టీల్‌తో రెడీ చేశారు. హైక్వాలిటీ ఫ్లెక్సీలతో స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. సోలార్ పవర్‌ను కూడా అటాచ్ చేశారు. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు దాదాపు 16 గంటల పాటు పవర్ బ్యాకప్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు తో ఇవి సిద్ధమయ్యాయి. ఫ్లోట్ కావడా నికి కింద ఎరేటెడ్ డ్రమ్ము ఏర్పాటు చేశారు. ఇదంతా పొల్యూషన్ ప్రొటెక్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో 15, సరూర్‌నగర్‌లో 15 బిల్‌బోర్డ్స్ ఏర్పాటు చేసుకునేందుకు హెచ్ఎండీఏ పిలిచిన ఓపెన్ టెండర్లలో ధనుష్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.21 లక్షా 60 వేలకు బిడ్ దక్కించుకుంది. హెచ్ఎండీఏ రూ.19 లక్షల 50వేలు టెండర్‌కు పోతే వారు ఊహించని విధంగా ఇంకా ఎక్కువగానే బిడ్ దక్కించుకోవడం గమనార్హం.