అలలపై అడ్వర్టైజ్‌మెంట్..!
- దేశంలోనే తొలిసారిగా నీటిలో తేలియాడే బిల్ బోర్డ్స్
- హుస్సేన్‌సాగర్‌లో సందర్శకులను ఆకట్టుకుంటున్న ఎకోఫ్రెండ్లీ థీమ్
- లైటింగ్ కోసం సోలార్ ఎనర్జీ వినియోగిస్తామంటున్న హెచ్‌ఎండీఏ
- ప్రకటనలకు అనుమతినిచ్చేందుకు జీహెచ్‌ఎంసీ మీనమేషాలు
సాక్షి, హైదరాబాద్: క్రియేటివ్ థింకింగ్... లుకింగ్ డిఫరెంట్... ఇలా విభిన్న ఆలోచన లతో సరికొత్త పంథాలో దూసుకెళుతున్న నగరవాసులను హుస్సేన్‌సాగర్‌లోని అలలపై తేలియాడుతూ ‘ఫ్లోటింగ్ బిల్‌బోర్డ్స్’అందరినీ కట్టిపడేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా నీటి అలలపై అడ్వర్టైజింగ్ అనే కాన్సెప్ట్‌ను నగరవాసులకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ఆథారిటీ (హెచ్‌ఎండీఏ) పరిచయం చేస్తోంది. పర్యావరణహితంగా సోలార్ ఎనర్జీని ఉపయోగించడంతో పాటు రాత్రి సమయాల్లో ఎల్‌ఈడీ బల్బుల వెలుగులతో సిటీకే సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా ఇవి నిలుస్తు న్నా యి. గంటకు 70 కి.మీ. వేగంతో గాలులు వీచి నా, భారీ వర్షాలు కురిసినా చెక్కు చెదరకుండా ఉండేలా స్టెబులిటీ స్ట్రక్చర్‌ను రెడీ చేశారు.
జీహెచ్‌ఎంసీ సై అంటే సూపర్ సీన్లే...
నగరంలో అడ్వర్టైజ్‌మెంట్‌కు అనుమతినివ్వా ల్సిందే జీహెచ్‌ఎంసీనే. అయితే ఫ్లోటింగ్ బిల్‌బోర్డ్స్ విషయాన్ని మూడు నెలల క్రితమే హెచ్‌ఎండీఏ అధికారులు జీహెచ్‌ఎంసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో దీనికి అనుమతినివ్వడంపై జీహెచ్‌ఎంసీ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. మరో రెండు మూడు రోజుల్లో ఫ్లోటింగ్ బిల్‌బోర్డ్స్‌కు పచ్చజెండా ఊపుతారా... లేదా.. నిబంధనల్లో లేదంటూ పక్కనపెడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ జీహెచ్‌ఎంసీ పచ్చజెండా ఊపితే మాత్రం పర్యాటకులు హుస్సేన్‌సాగర్, సరూర్‌నగర్ అలలపై సరికొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంటుంది.
‘ఎకో ఫ్రెండ్లీ’ థీమ్‌తో...
బోటింగ్ ఫ్లాట్‌ఫామ్‌ను వాటర్ రెసిస్టెడ్ కోటెడ్ స్టీల్‌తో రెడీ చేశారు. హైక్వాలిటీ ఫ్లెక్సీలతో స్క్రీన్‌ను ఏర్పాటు చేశారు. సోలార్ పవర్‌ను కూడా అటాచ్ చేశారు. వెలుతురు తక్కువగా ఉన్నప్పుడు దాదాపు 16 గంటల పాటు పవర్ బ్యాకప్ ఉండేలా ఏర్పాట్లు చేశారు. 20 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు తో ఇవి సిద్ధమయ్యాయి. ఫ్లోట్ కావడా నికి కింద ఎరేటెడ్ డ్రమ్ము ఏర్పాటు చేశారు. ఇదంతా పొల్యూషన్ ప్రొటెక్షన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. హుస్సేన్ సాగర్‌లో 15, సరూర్‌నగర్‌లో 15 బిల్‌బోర్డ్స్ ఏర్పాటు చేసుకునేందుకు హెచ్‌ఎండీఏ పిలిచిన ఓపెన్ టెండర్లలో ధనుష్ ఐటీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.21 లక్షా 60 వేలకు బిడ్ దక్కించుకుంది. హెచ్‌ఎండీఏ రూ.19 లక్షల 50వేలు టెండర్‌కు పోతే వారు ఊహించని విధంగా ఇంకా ఎక్కువగానే బిడ్ దక్కించుకోవడం గమనార్హం.