బెంగళూరు: బెంగళూరు నగరం ఐటీ కంపెనీలకు, చల్లటి వాతావరణంతో పాటు నగరవాసుల బిజీబిజీ బతుకుల్లో ఒకటైన గజిబిజి ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి. ఒక్కోసారి అందులో ఇరుక్కంటే ఎప్పుడు బయటపడతామో కూడా క్లారిటీ ఇవ్వలేం. ఇంక వర్షాకాలం వస్తే ఈ పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. దీంతో అప్పడుప్పుడు కొందరు నెటిజన్లు ఈ ట్రాఫిక్ సమస్యలపై సోషల్ మీడియాలో తమదైన శైలిలో విమర్శిస్తూ పోస్ట్‌లు పెడుతుంటారు. తాజాగా బెంగళూరు ట్రాఫిక్ జామ్‌కి అద్దం పట్టేలా ట్విట్ చేస్తూ ఓ వ్యక్తి వినూత్నంగా విమర్శించాడు.
అందులో.. ‘బెంగళూరులో ఉన్న నా స్నేహితుడు తన కారులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను అమ్మేందుకు ప్లాన్ చేస్తున్నాడు. అతను వాటిని పెద్దగా ఉపయోగించడం లేదు కనుక అవి ఇంకా షోరూమ్ కండీషన్‌లో ఉన్నాయి’. వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి గలవారు ఎవరైనా ఉన్నారా? అని రాసి ఉన్న ట్విట్‌ని పోస్ట్ చేశాడు. ఈ ట్వీట్‌ని చూస్తే కారు నడిపే వాళ్లు అందులోని మూడు, నాలుగు, ఐదో గేర్లను బెంగళూరు రోడ్లపై వినియోగించాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా ఆ నగరంలోని ట్రాపిక్ పరిస్థితిపై ఎద్దేవా చేసినట్లు ఉంటుంది.
కాగా, ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ.. ‘లక్షల్లో ట్యాక్‍్స కుడతున్నప్పటికీ ఈ సమస్యపై ఆందోళనలు చేయలేకపోవడం చాలా బాధాకరమని ఒకరు కామెంట్ చేయగా... ప్రౌడ్ సిటిజన్‌గా ఉండాలంటే మనం ఇలాంటి వాటిపై నోరు మెదపకూడదని మరొకరు కామెంట్ చేశారు.
Any buyer in Bangalore? 🤔 pic.twitter.com/cWZreP06v7
— Shrikant 🇮🇳 (@sdjoshi55) May 25, 2022
చదవండి: పెళ్లి ఊరేగింపులో కన్నడ పాటలు, జెండాలు.. మహారాష్ట్ర ఏకీకరణ సమితి దాడి
Comments
Please login to add a commentAdd a comment