వేసవిలో చల్లగా...విహరిద్దాం హాయిగా.. | Famous Hill Stations Near Delhi | Sakshi
Sakshi News home page

వేసవిలో చల్లగా...విహరిద్దాం హాయిగా..

Published Tue, Apr 10 2018 12:35 PM | Last Updated on Tue, Apr 10 2018 12:35 PM

Famous Hill Stations Near Delhi - Sakshi

ఏప్రిల్‌ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక ముందు ముందు ఎండలు ఇంకెంత తీవ్రంగా ఉంటాయో అనిపిస్తుంది కదా. ఎండ తీవ్రతని ఎలాను తగ్గించలేము కాబట్టి ఓ వారం రోజులు అలా చల్లటి ప్రదేశాల్లో విహరించొద్దాము. మళ్లీ దీని కోసం దేశం దాటి వెళ్లాల్సిన పనిలేదు. ఖర్చు గురించి భయపడాల్సిన అవసరం లేదు. మనకున్న బడ్జెట్‌లోనే దేశ రాజధాని చుట్టూ ఉన్న అందాలను సందర్శించుకుందా, చల్లగా సేద తీరుదాము. ఒక్కో ప్రదేశానికి ఒక వారంతం సరిపోతుంది.


లాన్స్‌డౌన్‌...
ఢిల్లీ నుంచి కేవలం 260కిమీ దూరాన ఉన్న లాన్స్‌డౌన్‌ను చేరుకోవడానికి 6-7 గంటల ప్రయాణం చేయాలి. ఇక్కడ బస చేయడానికి ఖరీదైన హోటల్లు రిసార్టులు ఉండవు. మన బడ్జెట్‌లోనే ఇంటి వాతవరణాన్ని తలపించే వసతి లభిస్తుంది. ట్రెక్కింగ్‌ ఆసక్తి ఉన్న వారికి సరిగ్గ సరిపోయే ప్రదేశం లాన్సడౌన్‌. హిమాలాయాలను సందర్శించడానకి ప్రసిద్ధికెక్కిన టిపి టాప్‌ పాయింట్లకు నెలవు ఈ ప్రదేశం. ఇవే కాక భీమ్‌ పకోర, తారకేశ్వర్‌ మహాదేవ్‌ ఆలయం, భుల్ల తాల్‌ ఇక్కడి దర్శనీయ ప్రదేశాలు.

Lansdowne
కసౌలి...
ఢిల్లీ నుంచి సుమారు 290కి.మీ. దూరాన హిమాచల్‌ ప్రదేశ్‌ లో ఉన్న ఈ ప్రదేశానికి చేరుకోవడానికి  అయిదారు గంటల సమయం పడుతుంది. సిమ్లాకు సమీపాన ఉన్న కసౌలి చల్లని ప్రాంతమే కాక హిమాచల్‌లో ఉన్న మిగితా వేసవి విడిది ప్రాంతాల కన్నా చాలా అందమైన ప్రదేశం. నేటికి చెక్కుచెదరకుండా ఉన్న కాలనీల నిర్మాణాలు అలనాటి నిర్మాణ కౌశాలనికి నిదర్శనం. గ్రామీణ వాతావరణాన్ని, అనేక ఆలయాలను, అందమైన ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ప్రసిద్ధ మోహన్‌ మెయ్కిన్‌ బ్రేవరీ ఇక్కడే ఉంది.

Kasauli

ముస్సోరి...
ఢిల్లీకి 285 కి.మీ. దూరాన ఉన్న ముస్సోరిని చేరుకోవడానికి ఏడు గంటల సమయం పడుతుంది. అత్యంత రద్దీగా ఉండే ముస్సోరిని చేరుకోవడానికి రోడ్డు మార్గం కన్నా శివారు ప్రాంతాల గుండా వెళ్తే ముస్సోరి అసలు సౌందర్యం కనిపిస్తుంది. భోజన ప్రియులకు స్వర్గధామం ఈ ప్రాంతం. రెస్టారెంట్లు, కేఫేలు కొకొల్లలుగా ఉంటాయి. ఇక్కడ స్థానిక హిమాలయ ప్రాంత ఆహారమే కాకుండా యూరోపియన్‌ ఆహారం కూడా లభిస్తుంది. రస్కిన్‌ బాండ్‌ ప్రముఖ పుస్తకాల దుకాణం ఇక్కడే ఉంది.

Mussoorie
నౌకుచైతాల్‌...
ఢిల్లీకి 320కి.మీ. దూరాన ఉన్న నౌకుచైతాల్‌ ప్రాంతాన్ని చేరుకోవడానికి సుమారు ఏడు గంటల ప్రయాణం చేయాలి. నైనితాల్‌ - భీమ్‌తాల్‌కు సమీపాన ఉండటంతో ఈ ప్రాంతానికి యాత్రికుల రద్దీ తక్కువ. జనావాసాలకు దూరంగా, ఒంటరిగా, ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ప్రాంతం సరిగ్గా సరిపోతుంది. ఇ​క్కడ ప్రధాన ఆకర్షణ నౌకుచైతాల్‌ సరస్సు. చుట్టూ కొండలతో ఉండే ఈ సరసుకు తొమ్మిది మూలలు ఉంటాయి. అందువల్లే ఈ ప్రాంతానికి నౌకుచైతాల్‌ అనే పేరు వచ్చింది. సాహసాలు ఇష్టపడే వారికి ట్రెక్కింగ్‌తో పాటు పారాగ్లైడింగ్‌, పారాసెయిలింగ్‌ చేయడానకి కూడా అవకాశం ఉంటుంది.

Naukuchiatal
నహాన్‌...
శివాలిక్‌ పర్వత శ్రేణులకు, హిమాలయాలకు మధ్య ఉన్న ప్రదేశం నహాన్‌. ఢిల్లీ నుంచి 250కి.మీ. దూరాన ఉన్న ఈ ప్రదేశాన్ని చేరడానికి 4 నుంచి 5గంటల పాటు ప్రయాణం చేయాలి. చుట్టూ పచ్చని పచ్చదనం పరుచుకున్న ప్రదేశం కావడంతో ఇక్కడికి వచ్చే వారు ఎక్కువగా హోటల్లలో కన్నా శివారు ప్రాంతాల్లోఉండటానికి ఇష్టపడతారు. మనలో నూతనోత్సహం నింపే సరైన యాత్రా ప్రదేశం ఇదే. రేణుక సరస్సు, పౌంతా సాహిబ్‌, త్రిలోక్‌పూర్‌ ఆలయం, సుకేతి శిలాజాల పార్కు ఇక్కడ చూడవలసిన ముఖ్య ప్రదేశాలు.

Nahan

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement