గాల్లో తేలినట్టుందే..! | Ranges of the Alps .. | Sakshi
Sakshi News home page

గాల్లో తేలినట్టుందే..!

Published Thu, Dec 26 2013 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

గాల్లో తేలినట్టుందే..!

గాల్లో తేలినట్టుందే..!

ఆల్ఫ్స్ పర్వత శ్రేణులు.. ఫ్రాన్స్ పరిధిలోని  అతి ఎత్తై మంచుకొండలు. ఎముకలు గడ్డగట్టే చలి. ఇక్కడ పర్యటించడమే పెద్ద సాహసం. అలాంటిది ఈ పర్వతశ్రేణులను అధిరోహించడం మామూలు విషయం కాదు. అయితే కొందరు ఈ మంచుకొండలను ఎక్కే సాహసాలను చేస్తుంటారు. అటువంటి వారికి కొత్తరకమైన అనుభవాన్ని ఇచ్చే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ‘గ్లాస్‌కేజ్’ ఏర్పాటు చేశారు.

యూరప్ ఖండ పరిధిలోని అతి ఎత్తై మంచుశిఖరం ‘మౌంట్ బ్లాంక్’కు ఈ గ్లాస్‌కేజ్ ఏర్పాటు చేశారు. పది అడుగుల చదరపు విస్తీర్ణంతో ఉండే ఈ క్యాబిన్‌లో నిలబడితే దాదాపు గాలిలో తేలిన ఫీలింగ్ ఉంటుంది. కిందివైపుకు చూస్తూ నాలుగు కిలోమీటర్ల లోతువరకూ కనిపిస్తుంది.  శిఖరం మీద నుంచి కిందివైపుకు చూడటం ఒక ఎత్తయితే ఈ కేజ్‌లోకి ప్రవేశించి ఆ పరిసరాలను చూడటం మరో ఎత్తు. ఇదొక అనిర్వచనీైయమెన అనుభవం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement