ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ & సీఎన్జీ కార్లు విడుదలవుతున్నాయి. భారతీయ విఫణిలో సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఈ తరుణంలో తక్కువ ధరలో సీఎన్జీ కొనాలనుకునే వారు ఈ బెస్ట్ కార్లను ఎంపిక చేసుకోవచ్చు.
మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్జీ:
మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 మన జాబితాలో చెప్పుకోదగ్గ బెస్ట్ సీఎన్జీ కారు. ఈ మోడల్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 30 కి.మీ/కేజీ మైలేజ్ అని తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే వాహనాల్లో మారుతీ సుజుకీ 800 సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని రుజువైంది.
మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ:
ఎస్-ప్రెస్సో సీఎన్జీ కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెస్ట్ సీఎన్జీ కారు. ఇది కేజీకి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే సీఎన్జీ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీ:
రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉత్తమ సీఎన్జీ కారుగా నిలిచింది. ఇందులోని 1.0 లీటర్ కే10 సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.
మారుతి సుజుకి వాగన్ఆర్ సీఎన్జీ:
వాగన్ఆర్ సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందించే మారుతి కంపెనీ బ్రాండ్. దీని ధర రూ. 6.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక కేజీ సీఎన్జీతో 34.05 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
టాటా టియాగో ఐసీఎన్జీ:
దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఉత్తమ CNG కార్లను అందిస్తోంది. ఈ విభాగంలో ఒకటైన టియాగో ఐసీఎన్జీ కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6.44లక్షలు. టియాగో ఐసీఎన్జీలోని 1.2 లీటర్ ఇంజిన్ 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది.
ఇటీవలే భారతదేశంలో సీఎన్జీ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో సీఎన్జీ కారు కొనాలనుకునే వారికి పైన చెప్పిన కార్లు మంచి ఎంపిక అవుతాయని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి.
Comments
Please login to add a commentAdd a comment