CNG Auto
-
భారత్‌లో మరో సిఎన్జి కారు లాంచ్ - ధర తక్కువ & ఎక్కువ ఫీచర్స్
Tata Altroz CNG: ఎలక్ట్రిక్ కార్లకు మాత్రమే కాకుండా సిఎన్జి కార్లకు పెరుగుతున్న ఆదరణ కారణంగా దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ఎట్టకేలకు భారతీయ మార్కెట్లో ఆల్ట్రోజ్ సిఎన్జి (Altroz CNG) విడుదల చేసింది. ఈ లేటెస్ట్ సిఎన్జి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ధరలు & వేరియంట్స్ టాటా మోటార్స్ విడుదల చేసిన ఆల్ట్రోజ్ సిఎన్జి ఆరు వేరియంట్లలో లభిస్తుంది. అవి XE, XM+, XM+ (S), XZ, XZ+ (S), XZ+ O (S) వేరియంట్లు. ఇందులో బేస్ వేరియంట్ ధర రూ. 7.55 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 10.55 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). దేశీయ విఫణిలో విడుదలైన ఆల్ట్రోజ్ సిఎన్జి సన్‌రూఫ్ కలిగిన మొదటి CNG బేస్డ్ హ్యాచ్‌బ్యాక్. ఇందులో డ్యూయెల్ సిలిండర్ సెటప్ కలిగి ఉంటుంది, కావున దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఎక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇందులో 210 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. స్టాండర్డ్ మోడల్ ఆల్ట్రోజ్ బూట్ స్పేస్ 345 లీటర్లు. డిజైన్ & ఫీచర్స్ ఆల్ట్రోజ్ CNG కారు చూడటానికి దాని స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే అనిపిస్తుంది. కానీ దీని టెయిల్‌గేట్‌పై 'iCNG' బ్యాడ్జ్ ఇది కొత్త మోడల్ అని చెప్పకనే చెబుతుంది. బూట్ ప్లోర్ కింద రెండు సిఎన్జి ట్యాంకులు ఉంటాయి. సైడ్ ప్రొఫైల్, రియర్ ప్రొఫైల్ దాదాపు పెట్రోల్ వెర్షన్ మాదిరిగానే ఉంటుంది. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు లేవనే చెప్పాలి. కావున అదే 7.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ కలిగి.. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే వంటి వారికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఎయిర్ ప్యూరిఫైయర్, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ కూడా లభిస్తాయి. XM+ (S), XZ+ (S), XZ+ O (S) వేరియంట్లలో వాయిస్ యాక్టివేటెడ్ సింగిల్-పేన్ సన్‌రూఫ్ లభిస్తుంది. కావున ఇది దాని ఇతర వేరియంట్ల కంటే భిన్నంగా ఉంటుంది. (ఇదీ చదవండి: భారత్‌లో 5 డోర్ జిమ్నీ లాంచ్ డేట్ ఫిక్స్ - బుక్ చేసుకున్న వారికి పండగే) పవర్‌ట్రెయిన్ ఆల్ట్రోజ్ సిఎన్జి 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఇది 88 హార్స్ పవర్, 115 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక సిఎన్జి మోడ్‌లో 77 hp పవర్, 103 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాని పెట్రోల్ వెర్షన్ కంటే కూడా ఎక్కువ మైలేజ్ అందిస్తుందని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) ప్రత్యర్థులు ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త టాటా ఆల్ట్రోజ్ సిఎన్జి ఇప్పటికే అమ్ముడవుతున్న మారుతి బాలెనొ సిఎన్జి, టయోటా గ్లాంజా సిఎన్జి వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కావున ఇది దేశీయ మార్కెట్లో అమ్మకాల పరంగా తప్పకుండా కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
సీఎన్జీ కారు కొనడానికి ఇదే మంచి సమయం - ఇదిగో టాప్ 5 బెస్ట్ కార్లు
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ కార్లకు ప్రత్యామ్నాయంగా.. ఎలక్ట్రిక్ & సీఎన్జీ కార్లు విడుదలవుతున్నాయి. భారతీయ విఫణిలో సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగానే ఉంది. ఈ తరుణంలో తక్కువ ధరలో సీఎన్జీ కొనాలనుకునే వారు ఈ బెస్ట్ కార్లను ఎంపిక చేసుకోవచ్చు. మారుతి సుజుకి ఆల్టో 800 సీఎన్జీ: మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఆల్టో 800 మన జాబితాలో చెప్పుకోదగ్గ బెస్ట్ సీఎన్జీ కారు. ఈ మోడల్ ధర రూ. 5.13 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది 30 కి.మీ/కేజీ మైలేజ్ అని తెలుస్తోంది. మార్కెట్లో తక్కువ ధర వద్ద లభించే వాహనాల్లో మారుతీ సుజుకీ 800 సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందిస్తుందని రుజువైంది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో సీఎన్జీ: ఎస్-ప్రెస్సో సీఎన్జీ కూడా మారుతి సుజుకి కంపెనీకి చెందిన బెస్ట్ సీఎన్జీ కారు. ఇది కేజీకి 32 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఎల్ఎక్స్ఐ వేరియంట్లో మాత్రమే సీఎన్జీ ఆప్షన్ లభిస్తుంది. ఇందులో 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే10 సీఎన్జీ: రూ. 5.96 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర వద్ద అందుబాటులో ఉన్న మారుతి సుజుకి ఆల్టో కే10 కేజీకి 34 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తూ ఉత్తమ సీఎన్జీ కారుగా నిలిచింది. ఇందులోని 1.0 లీటర్ కే10 సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్ 82 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. మారుతి సుజుకి వాగన్ఆర్ సీఎన్జీ: వాగన్ఆర్ సీఎన్జీ ఉత్తమ మైలేజ్ అందించే మారుతి కంపెనీ బ్రాండ్. దీని ధర రూ. 6.43 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఒక కేజీ సీఎన్జీతో 34.05 కి.మీల మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.0 లీటర్ కే సిరీస్ ఇంజిన్ 56 బీహెచ్పీ పవర్, 82 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. టాటా టియాగో ఐసీఎన్జీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఉత్తమ CNG కార్లను అందిస్తోంది. ఈ విభాగంలో ఒకటైన టియాగో ఐసీఎన్జీ కేజీకి 26.49 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర రూ. 6.44లక్షలు. టియాగో ఐసీఎన్జీలోని 1.2 లీటర్ ఇంజిన్ 72 బీహెచ్పీ పవర్, 95 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఇటీవలే భారతదేశంలో సీఎన్జీ ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. ఈ సమయంలో సీఎన్జీ కారు కొనాలనుకునే వారికి పైన చెప్పిన కార్లు మంచి ఎంపిక అవుతాయని భావిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాలను, సందేహాలను మాతో పంచుకోండి. -
పెట్రోల్, డీజిల్ కష్టాలకు చెక్.. అదిరిపోయిన టాటా మోటార్స్ సీఎన్జీ కార్స్!
Tata Motors Company: ప్రముఖ దేశీయ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ సీఎన్జీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. టియాగో, టిగోర్ మోడల్స్‌లో ఐసీఎన్జీ వేరియంట్స్‌ను మార్కెట్లోకి పరిచయం చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.6.09 లక్షల నుంచి రూ.8.29 లక్షల వరకు ఉంది. టాటా టిగోర్ సీఎన్జీ ధర రూ.7.69 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. టియాగో, టిగోర్ అమ్మకాల్లో 30-35 శాతం సీఎన్జీ విభాగం కైవసం చేసుకోవాలన్నది కంపెనీ లక్ష్యం. భారత్‌లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) కార్ల అమ్మకాల్లో 2019-20లో 60 శాతం, గత ఆర్థిక సంవత్సరంలో 97 శాతం వృద్ధి నమోదైంది. సీఎన్జీ వాహనాలకు కస్టమర్ల నుంచి ఆసక్తి పెరుగుతుండగా, బీఎస్-6 ప్రమాణాల రాకతో డీజిల్ హ్యాచ్బ్యాక్స్, కాంపాక్ట్ సెడాన్స్‌కు డిమాండ్ పూర్తిగా కనుమరుగైందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే మారుతి సుజుకి, హ్యుందాయ్ ఈ విభాగంలో కార్లను విక్రయిస్తున్నాయి. టియాగో సీఎన్జీ, టిగోర్ సీఎన్జీ రెండూ పూర్తి ట్యాంక్ చేస్తే 300 కిలోమీటర్లు వరకు వెళ్లనున్నాయి. టాటా టియాగో సీఎన్జీ 1.2-లీటర్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు పనిచేసే హ్యాచ్ బ్యాక్ కు అమర్చిన సీఎన్జీ కిట్‌తో వస్తుంది. ఇంజిన్ 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 165 మి.మీగా ఉంది. టియాగో సీఎన్జీ మాదిరిగానే టిగోర్ సీఎన్జీ కూడా 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. దీని ఇంజిన్ కూడా 73 పీఎస్ పవర్ అవుట్ పుట్ ఉత్పత్తి చేస్తుంది. (చదవండి: SEBI Saa₹thi App: ఇన్వెస్టర్లకు అండగా సెబీ ‘సారథి’ యాప్..!) -
జోరుగా ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: ప్యాసింజర్ వాహన(పీవీ) విక్రయాలు ఈ ఏడాది ఫిబ్రవరిలో 2,54,058 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఫిబ్రవరిలో నమోదైన 2,29,734 యూనిట్లతో పోలిస్తే ఇది 10.59 శాతం అధికం. లో బేస్ ప్రభావమే ఇందుకు కారణమని ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ల సమాఖ్య ఎఫ్ఏడీఏ ఈ వివరాలు తెలిపింది. దేశవ్యాప్తంగా 1,481 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులు (ఆర్టీవో) ఉండగా.. 1,274 ఆర్టీవోల నుంచి సమీకరించిన గణాంకాల ద్వారా ఈ అంశాలు వెల్లడైనట్లు పేర్కొంది. ఎఫ్ఏడీఏ ప్రకారం.. గత నెలలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16% క్షీణించి 10,91,288 యూనిట్లకు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహన విక్రయాలు సుమారు 30% తగ్గి 59,020కి క్షీణించాయి. అటు త్రిచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 50 శాతం పడిపోయి 33,319 యూనిట్లకు తగ్గాయి. ట్రాక్టర్ అమ్మకాలు మాత్రం దాదాపు 19 శాతం పెరిగి 61,351 యూనిట్లకు చేరాయి. వివిధ విభాగాలవారీగా చూస్తే వాహనాల విక్రయాలు 13 శాతం క్షీణించి 14,99,036 యూనిట్లకు పరిమితమయ్యాయి. బీఎస్-4 నుంచి బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు మళ్లే క్రమంలో గతేడాది ఫిబ్రవరిలో వాహన విక్రయాలు మందగించాయని ఎఫ్ఏడీఏ ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ తెలిపారు. సెమీ కండక్టర్ల కొరతతో కష్టాలు.. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత ఏర్పడటం వల్ల ప్యాసింజర్ వాహనాల డెలివరీల్లో దాదాపు ఎనిమిది నెలల దాకా జాప్యం జరిగిందని గులాటీ వివరించారు. వాహనాలు అందుబాటులో లేక దాదాపు 50 శాతం మంది డీలర్లు సుమారు 20 శాతం పైగా విక్రయ అవకాశాలు కోల్పోయారని ఎఫ్ఏడీఏ సర్వేలో వెల్లడైనట్లు తెలిపారు. తాజాగా కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తుండటంతో కొన్ని రాష్ట్రాల్లో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంటోందన్నారు. ఇంధన రేట్లు భారీగా పెరగడం కూడా దీనికి తోడైందని గులాటీ పేర్కొన్నారు. మరోవైపు, ఫైనాన్సింగ్ పరమైన సమస్యలతో వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లపై ఇప్పటికే ప్రతికూల ప్రభావం పడుతోందని, విద్యా సంస్థలు ఇంకా పూర్తిగా తెరుచుకోకపోవడం వల్ల ప్యాసింజర్ బస్సుల అమ్మకాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయని ఆయన చెప్పారు. ఆటో ఎల్పీజీ.. 40% చౌకైన ఇంధనం ఐఏసీ వెల్లడి పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఇతర ఇంధనాల వైపు చూస్తున్న వినియోగదారులకు ఆటో ఎల్పీజీ చౌకైన ప్రత్యామ్నాయం కాగలదని ఇండియన్ ఆటో ఎల్పీజీ కూటమి (ఏఐఎసీ) పేర్కొంది. ఇది సాంప్రదాయ ఇంధనాలతో పోలిస్తే 40 శాతం చౌకైనదని తెలిపింది. ఆటో ఎల్పీజీ/సీఎన్జీ కన్వర్షన్ కిట్లను మరింత తక్కువ రేటులో అందుబాటులోకి తెచ్చేందుకు వీటిపై విధిస్తున్న 28% జీఎస్టీని తగ్గించాలని కేంద్రాన్ని ఒక ప్రకటనలో కోరింది. సముచిత విధానాలతో ప్రోత్సహించిన పక్షంలో సాంప్రదాయ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఆటో ఎల్పీజీ మరింత ప్రాచుర్యంలోకి రాగలదని ఐఏసీ తెలిపింది. ‘ఇంధన వ్యయాపరంగా చూస్తే పెట్రోల్ కన్నా ఇది కనీసం 40% చౌకైనది’ అని పేర్కొంది. ధరపరంగా ఇంత భారీ వ్యత్యాసమున్న నేపథ్యంలో ఆటో ఎల్పీజీ కిట్లను ఏర్పాటు చేసుకునే వాహనదారులు.. వాటిపై పెట్టిన పెట్టుబడిని ఆరు నెలల్లోనే రాబట్టుకోవచ్చని ఐఏసీ డైరెక్టర్ జనరల్ సుయష్ గుప్తా తెలిపారు. దీనితో కాలుష్యకారక వాయువుల విడుదల.. సీఎన్జీ, పెట్రోల్‌తో పోలిస్తే 50 శాతం, డీజిల్‌తో పోలిస్తే 80 శాతం తక్కువగా ఉంటుందని వివరించారు. -
సీఎన్జీ ఆటో కార్మికుల ఆందోళన
నాలుగు గంటల పాటు గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ ముట్టడి ఎక్కడి ఆటోలు అక్కడే పౌరసరఫరాల శాఖాధికారి హామీతో విరమణ ఇబ్బందులను పరిష్కరించకుంటే 29న నగర బంద్ : శంకర్ నాలుగు గంటల నిరసనతో భారీగా ట్రాఫిక్ జామ్ చిట్టినగర్ : నగరంలో సీఎన్జీ ఆటో కార్మికుల నిరసన సోమవారం తీవ్ర రూపం దాల్చింది. ఆటో సంఘాల కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో కార్మికులు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీని ముట్టడించారు. తెల్లవారుజామున 6 గంటలకే ఆటో కార్మికులు చేరుకుని ఫిల్లింగ్ స్టేషన్లో కార్యకలాపాలు నిలిపివేయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆందోళన విరమించాలంటూ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. చివరకు కొత్తపేట సీఐ వెంకటేశ్వర్లు రంగంలోకి దిగి ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ దోనేపూడి శంకర్‌తో పాటు ైవె ఎస్సార్ సీపీ టీయూ నేత విశ్వనాథ రవితో మాట్లాడారు. వీరు స్పష్టమైన హామీ కోసం పట్టుబట్టారు. పరిస్థితి చేయి దాటుతున్న నేపథ్యంలో పోలీసులు సబ్ కలెక్టర్‌కు విషయం తెలపడంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కోమలి పద్మను ఘటనా స్థలానికి పంపారు. గురువారం నాటికి పరిస్థితి చక్కబడి నగరంలోని సీఎన్జీ బంకులకు 59 క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అవుతుందని ఆమె హామీ ఇచ్చారు. దీనిపై ఆటో సంఘాల జేఏసీ కన్వీనర్ దోనేపూడి శంకర్ మాట్లాడుతూ నగరంలో ఫిల్లింగ్ స్టేషన్ల సంఖ్యను 10కి పెంచడంతో పాటు గ్యాస్ సరఫరాలో చోటుచేసుకున్న సమస్యలను పరిష్కరించకుంటే 29వ తేదీ నగర బంద్ చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నగర ప్రధాన కార్యదర్శి ఆసుల రంగనాయకులు, వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా, అర్బన్ నాయకులు ఎం. శివరామకృష్ణ, విశ్వనాథ రవి, ఐఎఫ్టీయూ ప్రసాద్ ప్రసంగించారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మద్దతు ఉదయం 6 నుంచి 1 గంట వరకు కొనసాగిన ఆందోళనకు వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ జిల్లా, అర్బన్ నాయకులు మద్దతు తెలిపారు. జిల్లా కన్వీనర్ మాదు శివరామకృష్ణ, అర్బన్ కన్వీనర్ విశ్వనాథ రవిలు ఆందోళనలో భాగస్వాములయ్యారు. బారులు తీరిన వాహనాలు ఆందోళనతో కొత్తూరు తాడేపల్లి రోడ్డుకు ఇరువైపులా లారీలు, ఆటోలు బారులు తీరాయి. ద్విచక్ర వాహనాలను సైతం అనుమతించకపోవడంతో ఆటో డ్రైవర్లపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటోలు దొరక్క ఇబ్బందులు ఆటో కార్మికుల ఆందోళన కారణంగా నగరంలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. పండగ సీజన్ కావడంతో కొనుగోలుదారులతో పాటు చిరుద్యోగులు సమయానికి బస్సులు రాక, ఆటోలు దొరక్క అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే అదునుగా కొంత మంది డీజిల్ ఆటోడ్రైవర్లు చెలరేగిపోయారు. తాళ్లతో ఆటోలు లాగుతూ ప్రదర్శన భవానీపురం : సీఎన్జీ సక్రమంగా అందించి తమ ఉపాధిని కాపాడాలంటూ ఆటో కార్మికులు ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ఆటోలకు తాళ్లు కట్టి జాతీయ రహదారిపై ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో నారపాక శేఖర్, ఎ. వెంకటేశ్వరరెడ్డి, ఎస్డి. సందాని, షేక్ గాలిబ్, ఎస్కె. మస్తాన్, ఆటో కార్మికులు పాల్గొన్నారు.