ప్రతీకాత్మక చిత్రం
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్‌కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది.
వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు.
కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్‌కి అప్పీల్‌కు వెళ్లింది. అలా కేసు ఎన్‌సీడీఆర్‌సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది.
మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్‌కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment