NCDRC
-
క్రెడిట్ కార్డు యూజర్లకు అలెర్ట్
గడువు ముగిసిన క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లకు సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. గడువు ముగిసిన కార్డు చెల్లింపులపై ఏటా 30 శాతానికి వడ్డీరేట్లను పరిమితం చేస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎస్సీడీఆర్సీ) 2008లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఇటీవల కొట్టివేసింది. ఈ తీర్పువల్ల కార్డు చెల్లింపులపై వడ్డీ రేట్లను నిర్ణయించడంలో బ్యాంకులకు ఎక్కువ స్వయంప్రతిపత్తిని ఇచ్చినట్లు అవుతుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు.అసలేం జరిగిందంటే..క్రెడిట్ కార్డు లేట్ పేమెంట్ చెల్లింపులపై వడ్డీ రేట్లను సంవత్సరానికి 30 శాతానికి పరిమితం చేస్తూ ఎస్సీడీఆర్సీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆవాజ్ ఫౌండేషన్ అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కార్డు బకాయిలపై ఏడాదికి 36 శాతం నుంచి 49 శాతం వరకు వడ్డీ రేట్లను వసూలు చేయడం వడ్డీ విధానాల కిందకు వస్తుందని పిటిషన్లో పేర్కొంది. కాగా, ఇటువంటి అధిక వడ్డీరేట్లు మితిమీరినవని, అన్యాయమైన వాణిజ్య పద్ధతని ఎస్సీడీఆర్సీ గతంలో తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఇటీవల ఈ నిర్ణయాన్ని కొట్టివేస్తూ, ప్రస్తుత నిబంధనలకు లోబడి బ్యాంకులు తమ సొంత వడ్డీ రేట్లను నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.ఇదీ చదవండి: రియల్టీలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులుఈ మేరకు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం ఎస్సీడీఆర్సీ నిర్ణయాన్ని కొట్టివేసింది. వడ్డీ రేట్లను మార్కెట్ డైనమిక్స్, ఆర్బీఐ నియంత్రణ పర్యవేక్షణ ద్వారా నియంత్రిస్తారని కోర్టు నొక్కి చెప్పింది. భారతదేశంలోని చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రస్తుతం వార్షిక వడ్డీ రేట్లను ప్రత్యేక పరిస్థితుల్లో 22% నుంచి 49% వరకు వసూలు చేస్తున్నాయి. -
చెప్పిన మైలేజీ రాలేదు.. కంపెనీకి షాకిచ్చిన కస్టమర్
ప్రముఖ కార్ల కంపెనీ మారుతీ సుజుకీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు ఓ కస్టమర్. తాను కొన్నకారుకు కంపెనీ చెప్పిన మైలేజీ రాలేదని వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చాలా ఏళ్ల తర్వాత ఆ కస్టమర్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కస్టమర్‌కు రూ. లక్ష చెల్లించాలని కంపెనీని ఎన్సీడీఆర్సీ ఆదేశించింది. వివరాలోకి వెళ్తే.. 2004లో రాజీవ్ శర్మ అనే కస్టమర్ లీటరుకు 16-18 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందన్న ప్రకటనలతో ఆకర్షితుడై మారుతీ సుజుకీ కారును కొనుగోలు చేశారు. తీరా కొన్న తర్వాత ఆ కారు లీటరుకు 10.2 కిలోమీటర్లు మాత్రమే మైలేజీ ఇస్తుండటంతో అసంతృప్తి చెందిన రాజీవ్ శర్మ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార ఫోరమ్‌ను ఆశ్రయించారు. రూ.4 లక్షల మొత్తాన్ని వడ్డీ, రిజిస్ట్రేషన్ ఖర్చులు, బీమాతో సహా కంపెనీ నుంచి ఇప్పించాలని కోరారు. కస్టమర్ అభ్యర్థనను కొంతమేరకు పరగణనలోకి తీసుకున్న జిల్లా ఫోరమ్ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై మారుతీ సుజుకీ రాష్ట్ర కమిషన్‌కి అప్పీల్‌కు వెళ్లింది. అలా కేసు ఎన్సీడీఆర్సీకి చేరింది. ఇరు పక్షాలు లిఖితపూర్వక వాదనలు సమర్పించాయి. శర్మ తన వాదనను ఆగస్టు 7, 2023న సమర్పించగా, మారుతి సుజుకి నవంబర్ 2, 2023న స్పందించింది. మారుతీ సుజుకి ప్రకటన మైలేజ్ క్లెయిమ్‌లు తప్పుదారి పట్టించేవిగా, వినియోగదారుల హక్కులను ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) మునుపటి తీర్పులను సమర్థించింది. కస్టమర్‌కు రూ. లక్ష పరిహారం చెల్లించాలని ఆదేశించింది. -
హెయిర్ కటింగ్‌లో పొరపాటు.. రూ.2 కోట్ల ఫైన్
హెయిర్ కటింగ్ చేయడంలో జరిగిన పొరపాటుకి శిక్షగా న్యాయస్థానం ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కి రెండు కోట్ల రూపాయల ఫైన్ విధించింది. మూడేళ్లపాటు ఈ కేసు కొనసాగగా గురువారం తీర్పు వచ్చింది. 2018 ఏప్రిల్ 18న మోడల్‌గా పని చేస్తున్న 42 ఏళ్ల మహిళ చెన్నైలోని ఐటీసీ మౌర్య హోటల్లో బస చేసింది. హెయిర్ కటింగ్ చేసుకునేందుకు ఆ రోజు హోటల్లో ఉన్న సెలూన్‌కి ఆ మహిళ వెళ్లింది. ‘ తనకు ఇంటర్వ్యూ ఉందని, జుట్టును కింది నుంచి నాలుగు అంగులాల వరకు కత్తరించమని’ సూచించింది. హెయిర్ డ్రస్సర్ కటింగ్ చేస్తుండగా ఆమె కళ్ల జోడు తీసి పక్కన పెట్టింది. ఆ తర్వాత డ్రెస్సర్ సూచనలకు అనుగుణంగా తల కిందకు దించుకుంది. తీరా కటింగ్ పూర్తయిన తర్వాత చూస్తే జుట్టును కింది నుంచి కాకుండా మొదలు నుంచి నాలుగు అంగుళాల వరకు ఉండేలా కటింగ్ చేశారు. తనకు జరిగిన నష్టంపై సదరు మహిళ హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా... వారు సరైన స్పందన ఇవ్వలేదు. దీంతో సదరు మహిళ నేషనల్ కన్సుమర్ డిస్ప్యూట్ రీడ్రెస్సల్ కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ని సంప్రదించింది. హోటల్ సిబ్బంది తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని, పైగా వారు ఉపయోగించిన కెమెకల్స్ వల్ల తన స్కాల్ప్ పాడైందంటూ కోర్టుకు విన్నవించింది. తనకు పొడవైన జుట్టు ఉండటం వల్ల పలు ప్రముఖ కంపెనీల షాంపూ యాడ్లలో నటించాని, ప్రస్తుతం తనకు ఆ అవకాశం పోయిందంటూ కోర్టుకు వివరించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు ఐటీసీ మౌర్య హోటల్లో ఉన్న హెయిర్ డ్రెస్సర్, అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే సదరు మహిళకు తీవ్ర నష్టం కలిగినట్టు భావించింది. జరిగిన నష్టానికి పరిహారంగా రూ. 2 కోట్లను బాధిత మహిళకు చెల్లించాలంటూ తీర్పు వెల్లడించింది. చదవండి : వర్కింగ్ విమెన్: మీకోసమే ఈ డ్రెస్సింగ్ స్టైల్ -
వినియోగదారుల చట్టం కిందకి విద్యాసంస్థలు?
న్యూఢిల్లీ: విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల సేవల్లో లోపం వినియోగదారుల చట్టం–1986 కిందకు వస్తుందా అనే విషయాన్ని పరిశీలించడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. తమిళనాడులోని సేలంకి చెందిన వినాయక మిషన్ యూనివర్సిటీ సరైన సేవలు అందించడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైద్యవిద్యార్థి మనుసోలంకి, ఇతర విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌వేశారు. ధర్మాసనం ఈ అప్పీల్‌ను విచారణకు అంగీకరించింది. జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ) నిర్ణయంపై అప్పీల్ ని పరిశీలించిన సుప్రీంకోర్టు, ఆరు వారాల్లోగా తమ వాదనను వినిపించాలని ఆదేశించింది. మహర్షి దయానంద్ యూనివర్సిటీ వర్సెస్ పీటీ కోషి కేసులో గతంలో సుప్రీంకోర్టు, విద్యని సరుకుగా పరిగణించలేమని తీర్పునిచ్చిన నేపథ్యంలో తిరిగి ఇది చర్చనీయాంశంగా మారింది. రెండు సంవత్సరాలు థాయ్‌లాండ్‌లోనూ, రెండున్నర సంవత్సరాలు యూనివర్సిటీలో చదువు చెప్పిస్తామని విద్యార్థులను 2005–2006 సంవత్సరంలో చేర్చకున్నారు. విద్యార్థులకు ఎంబీబీఎస్ ఫైనల్ డిగ్రీ సర్టిఫికెట్లు అందజేస్తామని, వాటికి కేంద్ర ప్రభుత్వం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపు వచ్చేలా చూస్తామని కూడా ఇచ్చిన హామీని విద్యాసంస్థలు నెరవేర్చకపోవడంతో ఈ వివాదం చెలరేగింది. -
ఆ కుటుంబానికి రూ.7.64 కోట్లివ్వండి
న్యూఢిల్లీ: 2010లో మంగళూరులో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణికుడి కుటుంబానికి రూ.7.64 కోట్ల మొత్తాన్ని పరిహారంగా చెల్లించాలని ఎయిరిండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్ నుంచి 166 మంది ప్రయాణికులతో వచ్చిన ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురికాగా 158 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో యూఏఈకి చెందిన ఓ సంస్థ రీజినల్ డైరెక్టర్ మహేంద్ర కొడ్కనీ(45) ఉన్నారు. కొడ్కనీ కుటుంబానికి రూ.7.35 కోట్లు పరిహారంగా చెల్లించాలని వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్(ఎన్సీడీఆర్సీ) అప్పట్లో ఎయిరిండియాను ఆదేశించింది. వివిధ కారణాలు చూపుతూ ఎయిరిండియా ఆ మొత్తాన్ని చెల్లించలేదు. దీంతో కొడ్కనీ కుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. ‘ఒక సంస్థ తమ ఉద్యోగుల ఆదాయాన్ని అనేక కారణాలతో వేర్వేరు కేటగిరీల కింద విభజించవచ్చు. అయితే, ఆ ఉద్యోగికున్న స్థాయి ఆధారంగా అతని ఆదాయాన్ని అంచనావేయాలి. అతని మరణంతో సంభవించిన నష్టాన్ని నిర్ణయించేటప్పుడు అతని అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి’అని పేర్కొంది. ఎన్సీడీఆర్సీ పేర్కొన్న రూ.7.35 కోట్ల నష్టపరిహారంలో ఇప్పటి వరకు చెల్లించని మొత్తానికి ఏడాదికి 9 శాతం వడ్డీ కలిపి చెల్లించాలని పేర్కొంది. ఒక వేళ అంతకంటే ఎక్కువగా చెల్లించినా పిటిషన్‌దారుల నుంచి రాబట్టేందుకు వీలు లేదని ఎయిరిండియాకు కోర్టు స్పష్టం చేసింది. -
బీమా పాలసీ క్లెయిమ్ కాలేదా? ఈ స్టోరీ చదవండి
సాక్షి, ముంబై: ఆపద సమయంలో ఆదుకుంటుందన్న భరోసాతో బీమా (ప్రభుత్వ, లేదా ప్రైవేటు) పాలసీ తీసుకునే వినియోగదారులకు భారీ నిరాశ ఎదురయ్యే ఉదంతాలు చాలా చూశాం. ఇలాంటి ఘటనలో న్యాయ పోరాటం చేయడం కూడా చాలా అరుదు. కానీ ఒక పాలసీదారుని భార్య మాత్రం ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)పై పోరుకు దిగారు. చట్టపరంగా తనకు దక్కాల్సిన పాలసీ సొమ్ముపై జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)ను ఆశ్రయించి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే..ముంబైకి చెందిన దిగంబరరావు ఠాక్రే 2000 సంవత్సరంలో ఎల్ఐసీ నుంచి మూడు బీమా పాలసీలను తీసుకున్నారు. అనారోగ్యంతో మార్చి13, 2003న ఆయన కన్నుమూశారు. దీంతో ఆయన భార్య రత్న తనకు రావాల్సిన బీమా సొమ్మును చెల్లించాల్సిందిగా ఎల్ఐసీని కోరగా అందుకు ఆ సంస్థ తిరస్కరించింది. పాలసీ తీసుకునేముందు పాలసీదారుడు ఠాక్రే ఆస్తమాతో ఆసుపత్రిలో చేరడం తదితర విషయాలను దాచి పెట్టారని వాదించింది. దీంతో 2005లో ఆమె వార్ధాలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించారు. దీన్ని విచారించిన ఫోరమ్ ఆమె క్లెయిమ్‌ను చెల్లించాలని ఎల్ఐసీని ఆదేశించింది. ఇందుకు నిరకారించిన ఎల్ఐసీ ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ ఎన్‌సీడీఆర్‌సీలో రివ్యూ పిటిషన్ వేసింది. అయితే ఎల్ఐసీ వాదనను తిరస్కరించిన ఎన్సీడీఆర్సీ ఆమెకు రావాల్సిన రూ. 9.3 లక్షలు చెల్లించాలని తాజాగా ఆదేశించింది. ఎల్ఐసీ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవనీ, పైగా ఠాక్రేకు ఇంతకుముందు అలాంటి అనారోగ్యం ఉన్నప్పటికీ, ఎల్ఐసీ పాలసీ జారీ చేసే సమయానికి ఆరోగ్యంగా ఉన్నందున, ఆ కాంట్రాక్టును తొలగించలేమని ఎన్సీడీఆర్సీ ప్రిసైడింగ్ సభ్యుడు దీపా శర్మ వ్యాఖ్యానించారు. వినియోగదారుని అభ్యర్థనను బీమా సంస్థ తిరస్కరించడం సేవలో లోపంగానే పరిగణించాలని పేర్కొన్నారు. -
ఆ కస్టమర్‌కు రూ.4 కోట్లు చెల్లించండి
న్యూఢిల్లీ: తన కస్టమర్‌కు చెల్లించాల్సిన రూ.4 కోట్లను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిహారాల కమిషన్ (ఎన్సీడీఆర్సీ) ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. అలోక్ కుమార్‌కు రూ.4.12 కోట్లు చెల్లించాల్సిందిగా హరియాణాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని ఆదేశించింది. ప్రస్తుతం జపాన్‌లోని టోక్యోలో ఉంటున్న అలోక్.. భారత్‌కు తిరిగొచ్చాక ఉండటానికి ఓ ఇంటిని కొనుగోలు చేయాలని భావించారు. దీంతో గోల్డెన్ పీకాక్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ డెవలపర్స్‌కు ఓ అపార్ట్మెంట్ కొనుగోలు కోసం బ్యాంకు లోను తీసుకున్నారు. ఈమేరకు 2015 సెప్టెంబర్ కల్లా దానికి సంబంధించిన మొత్తాన్ని చెల్లించారు. అయితే తాను ఇండియాకి వచ్చి చూడగా తన ఇంటి నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. 2015లోనే దానికి సంబంధించిన పనులు ఆగిపోయాయని గుర్తించిన అలోక్ ఎన్సీడీఆర్సీని ఆశ్రయించారు. -
నెస్లేకు మళ్లీ మ్యాగీ కష్టాలు!
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం నాటి మ్యాగీ నూడుల్స్ వివాదం నెస్లే ఇండియాను ఇంకా వెంటాడుతోంది. మ్యాగీ నూడుల్స్‌కి సంబంధించి కంపెనీ మీద ఎన్‌సీడీఆర్‌సీలో కేంద్రం పెట్టిన కేసు విచారణపై స్టేను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసు విచారణ యథాప్రకారం కొనసాగనుంది. మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌పై మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ) నిర్వహించిన పరీక్షల ఫలితాలు దీనికి ప్రాతిపదికగా ఉంటాయని సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు, సుప్రీం కోర్టు ఆదేశాలను నెస్లే స్వాగతించింది. మ్యాగీ నూడుల్స్‌లో సీసం తదితర అవశేషాలు నిర్దేశిత స్థాయిల్లోనే ఉన్నాయని సీఎఫ్టీఆర్ఐ పరీక్షల్లో తేలినట్లు పేర్కొంది. అయితే, న్యాయస్థానం ఆదేశాల కాపీ వచ్చిన తర్వాతే తమకు ఉత్తర్వుల పూర్తి వివరాలు తెలుస్తాయని వివరించింది. వివరాల్లోకి వెళితే.. మ్యాగీ నూడుల్స్‌లో హానికారక మోనోసోడియం గ్లూటమేట్ (ఎంఎస్‌జీ) అవశేషాలు అధిక మోతాదులో ఉన్నాయంటూ ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాల నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ 2015లో దీన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నెస్లే ఇండియా తప్పుదారి పట్టించే ప్రకటనలు ఇస్తోందని, తప్పుడు లేబులింగ్, అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందని ఆరోపిస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ 2015లో జాతీయ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ (ఎన్సీడీఆర్సీ)లో ఈ కేసు దాఖలు చేసింది. రూ. 640 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేసింది. అయితే, దీన్ని నెస్లే సవాల్ చేయడంతో సుప్రీంకోర్టు అప్పట్లో కేసు విచారణపై స్టే విధించింది. మరోవైపు మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్‌లో సీసం, ఎంఎస్‌జీ స్థాయి లపై పరీక్షలు జరిపి నివేదికనివ్వాలంటూ సీఎఫ్టీఆర్ఐని 2016 జనవరి 13న సుప్రీంకోర్టు ఆదేశించింది. 29 శాంపిల్స్‌లో సీసం పరిమాణం నిర్దేశిత స్థాయికి లోబడే ఉందంటూ సీఎఫ్టీఆర్ఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
డీఎల్ఎఫ్కు ఊరట
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. చండీఘడ్ లోని పంచకుల ప్రాజెక్టులోని అపార్ట్ మెంట్ల కేటాయింపు వివాదాన్ని శుక్రవారం విచారించిన సుప్రీం ఈ మేరకు తీర్పు వెలువరించింది. డీఎల్ఎఫ్కు గతంలో ఎన్ సీడీఆర్ సీ విధించిన 12 శాతం వడ్డీని 9 శాతానికి తగ్గించింది. ఆయా కొనుగోలు దార్లకు నవంబర్30 లోపు స్వాధీనం చేయాలని తీర్పు చెప్పింది. లేదంటే పెనాల్టీ కట్టాల్సిందేనని అల్టిమేటం జారీ చేసింది. ఫ్లాట్ల కేటాయింపులో జరిగిన ఆలస్యానికి గాను 2014 నుంచి 9 శాతం వడ్డీని చెల్లించాలని ఆదేశించింది. దాదాపు 50 మంది కొనుగోలుదారులకు ఈ చెల్లింపులు చేయాలని డీఎల్ఎఫ్ ను కోరింది. పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు. 2013లో తమ చేతికి రావాల్సిన ఫ్లాట్స్ రాలేదని ఆరోపిస్తూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసును విచారించిన కమిషన్ రియల్ సంస్థపై చీటింగ్ వ్యవహారం కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ ఆదేశించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ డీఎల్ ఎఫ్ ను సుప్రీం ను ఆశ్రయించింది. మరోవైపు ఢిల్లీ శివారుల్లో ఘజియాబాద్ ఒక నివాస ప్రాజెక్ట్ కు సంబంధించి 70మంది ఫ్లాట్ కొనుగోలుదారులకు ఇళ్లను కేటాయించడంలో విఫలమైన మరో రియల్ సంస్థ పార్వ్శనాధ్ డెవలపర్స్ ను , వారికి తిరిగి డబ్బులు చెల్లించే ప్రక్రియపై సమాధానం చెప్పాల్సిందిగా కోరింది. -
లేట్ చేస్తే.. రోజుకు రూ.5 వేలు ఫైన్!
న్యూఢిల్లీ : భారత్ లో అతిపెద్ద కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ డీఎల్ఎఫ్కు మొట్టికాయలు పడ్డాయి. హర్యానాలోని పంచకుల ప్రాజెక్టులో భాగంగా 50 మంది కొనుగోలుదారులకు ఫ్లాట్లను ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండటంతో అత్యున్నత వినియోగదారుల కమిషన్ చీటింగ్ కింద పెనాల్టీ విధించింది. ఏడాదికి 12 శాతం జరిమానా చెల్లించాలని పేర్కొంది. జస్టిస్ జేఎమ్ మాలిక్ నేతృత్వంలోని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కర కమిషన్(ఎన్ సీడీఆర్ సీ) బెంచ్ ఈ మేరకు తీర్పునిచ్చింది. కంపెనీ ముందుగా చెప్పిన సమయానికే కొనుగోలుదారులకు అపార్ట్మెంట్లు ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో ప్రాజెక్టు ముగిసేవరకు రోజుకు రూ.5 వేల చొప్పున జరిమానా కట్టాలని డీఎల్ఎఫ్ను ఆదేశించింది. 50మంది ఫిర్యాదుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ నష్టపరిహారం కింద ప్రతి ఒక్కరికి రూ.30 వేలు చెల్లించాలని బిల్డర్ కు ఆదేశాలు జారీచేసింది. అలాట్మెంట్ తేదీ నుంచి మూడేళ్లలోగా డీఎల్ఎఫ్ కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వాల్సి ఉంది. 2013లో కొనుగోలుదారులకు ఈ ఫ్లాట్లు ఇవ్వాలి. కానీ తన ప్రతిపాదించిన సమయాన్ని డీఎల్ఎఫ్ బ్రేక్ చేసింది. కొనుగోలుదారులకు ఫ్లాట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తోంది. దీంతో ఫిర్యాదుదారులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటివరకూ ఫ్లాట్లు ఇవ్వకుండా కొనుగోలుదారులను వేధించినందుకు డీఎల్ఎఫ్ వడ్డీ చెల్లించాలని, ప్రస్తుతం కంపెనీ ప్రతిపాదించిన సమయం లోపు ఫ్లాట్లను ఇవ్వాలని, ఇవ్వని పక్షంలో రోజుకు రూ.5వేల జరిమానా ఫిర్యాదుదారులకు చెల్లించాలని బెంచ్ తెలిపింది. -
ఎన్ఆర్ఐలు భారత్‌లో ఇల్లు కొనుక్కోవచ్చు
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులకు భారత్‌లో ఇల్లు కొనుక్కొనే హక్కు ఎప్పటికీ ఉంటుందని జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తెలిపింది. ఢిల్లీవాసి రేష్మా భగత్, ఆమె కొడుకు, ఎన్ఆర్ఐ తరుణ్‌లకు రూ.63,99,727 చెల్లించాలని సూపర్‌టెక్ బిల్డర్స్‌ను కమిషన్ ఆదేశించింది. రేష్మా, తరుణ్‌లు 2008లో సూపర్‌టెక్‌కు ఈ మొత్తాన్నీ చెల్లించి గ్రేటర్ నోయిడాలో ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. ఫ్లాట్ నిర్మించి అప్పగించకపోవడంతో వీరు కమిషన్‌ను ఆశ్రయించారు. నష్టపరిహారంగా రూ.1.4 కోట్లు ఇప్పించాలని కోరారు. నివసించడానికి కాకుండా వాణిజ్య అవసరాలకు వారు వాడాలనుకున్నారన్న సంస్థ వాదనను కమిషన్ తోసిపుచ్చింది.