నానో.. ఫెరారీ 'సవారీ'! | Profit Plus Special Story...! | Sakshi
Sakshi News home page

నానో.. ఫెరారీ 'సవారీ'!

Published Mon, Jun 20 2016 12:48 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM

నానో.. ఫెరారీ 'సవారీ'!

నానో.. ఫెరారీ 'సవారీ'!

అవసరం - సౌకర్యం - విలాసం. అడ్రస్ బట్టి మారిపోతాయి. ఒకచోట అవసరమైనది... మరోచోట విలాసం. ఒకచోట విలాసమైతే.... మరోచోట అనవసరం కూడా!! కారు కూడా అంతే. ఒకపుడు చాలామందికి విలాసం. వారి స్థాయికి గుర్తు. ఇపుడైతే అత్యధికులకు అవసరం. కొందరికైతే అత్యవసరం. మరి ఆ కార్లకు పెట్టే ధరెంత? కొందరైతే లక్షల్లో. మరి కొందరైతే కోట్లలో. అందుకే! మారుతి-800తో మొదలైన భారత దేశ కార్ల ప్రస్థానం... అలా అలా బుగట్టీ, రోల్స్ రాయిస్, బెంట్లీ, ఆస్టిన్ మార్టిన్, ఫెరారీ,  లాంబోర్గిణి, బీఎండబ్ల్యూలను దాటిపోతోంది.

నిజానికి కారు కొనేటపుడు అత్యధికులు చూసేది దాని ధర, మైలేజీ. ఈ రెండిటి తరవాత ఫీచర్లు. కాకపోతే పిండి కొద్దీ రొట్టె. డబ్బు కొద్దీ కారు. ఈ ధరను బట్టే... ఫీచర్లు, మైలేజీ అన్నీ మారిపోతుంటాయి. లక్ష రూపాయలకేనంటూ సామాన్యుల అవసరాలు తీర్చడానికి నానో ప్రత్యక్షమైతే... నేను కొందరికే సొంతం అంటూ రూ.38 కోట్ల బుగట్టీ వేరన్ రోడ్డుమీదికొస్తుంది.

రూ.3 లక్షలు పెడితే మీ కుటుంబాన్నంతటినీ మోస్తానంటూ మారుతి ఆల్టో దేశానికి దగ్గ రైతే... రూ.8 కోట్లకు తక్కువ కాదంటూ రోల్స్‌రాయిస్ పాంథమ్ రోడ్డును మింగేస్తుంది. దేని ధర దానిదే. దేని ఫీచర్లు దానివే. దేని మైలేజీ దానిదే. ఒక్కమాటలో చెప్పాలంటే... దేనికదే సాటి. ఆ స్పెషాలిటీల సమాహారమే... ఈ ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం...    
- హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
 
చిన్నకార్ల కొనుగోళ్లలో ధరకే ఓటు  
మైలేజీ, ఫీచర్లు పెంచుతూ కంపెనీల ఎంట్రీ
రూ.10 లక్షల లోపు కార్ల సెగ్మెంట్లో పోటాపోటీ  
దేశంలో కంపెనీల ఫోకస్ మొత్తంగా ఈ సెగ్మెంట్‌పైనే
లగ్జరీ కార్ల కంపెనీల రూటే వేరు  
ప్రత్యేకమైన కస్టమర్ల కోసం ప్రత్యేక కార్లు
బుక్ చేశాక కనీసం 4 నుంచి 8 నెలల దాకా వెయిటింగ్  
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న లగ్జరీ కార్లు

 
‘లక్ష’ నానోతో టాటా హల్‌చల్...
టాటా గ్రూప్‌లో భాగమైన టాటా మోటార్స్... ముంబై కేంద్రంగా 1945లో ప్రారంభమైంది. ప్రపంచ కార్ల కంపెనీల్లో దీనిది 17వ స్థానం. అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లు జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను 2008లో ఇది ఫోర్డ్ నుంచి కొనుగోలు చేసింది. స్పెయిన్‌కు చెందిన బస్, కోచ్ తయారీ సంస్థ హిస్పానో, దక్షిణ కొరియాకు చెందిన కమర్షియల్ వెహికల్ తయారీ సంస్థ డీవో కూడా టాటా అనుబంధ సంస్థలే. సంస్థకు దేశంలో జంషెడ్‌పూర్, పట్నానగర్, లక్నో, సణంద్, ధార్వాడ్, పుణెతో పాటు అర్జెంటీనా, దక్షిణ కొరియా, థాయ్‌లాండ్, యూకేలో ప్లాంట్లున్నాయి. 2008లో లక్ష రూపాయలకేనంటూ నానోను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ధర 2 లక్షలు దాటింది.
 
800 నుంచి మొదలు పెడితే...
ఒకప్పుడు మారుతీ అంటే దేశీ  కంపెనీ. ఇప్పుడిది జపాన్‌కు చెందిన సుజుకీ చేతుల్లో ఉంది. మొదట్లో మారుతీ ఉద్యోగ్ లిమిటెడ్‌గా పిలిచిన ఈ సంస్థ... మారుతీ800తో దేశంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. 2016 జనవరి నాటికి మన దేశీ కార్ల పరిశ్రమలో 47 శాతం వాటా దీనిదే. 1981లో మారుతీ ఉద్యోగ్ ఆరంభమైనా... తొలి 800 కారు బయటికొచ్చింది మాత్రం 1983లో. దేశంలో గుర్గావ్, మానేసర్‌లోని ప్లాంట్లలో సంస్థ ఏటా 14.50 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోం ది. ప్రస్తుతం ఈ సంస్థ హై ఎండ్ కార్ల మార్కెట్లో కూడా విస్తరిస్తోంది.
 
పోటాపోటీగా... హ్యుందాయ్
1967 డిసెంబర్‌లో దక్షిణ కొరియాలో ఆరంభమైన హ్యుందాయ్... ఇపుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద కార్ల కంపెనీ. కొరియాలోని ఉల్సాన్‌లో దీనికి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల తయారీ ప్లాంటుంది. దాన్లో ఏటా 16 లక్షల కార్లు ఉత్పత్తి అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 193 దేశాల్లో విక్రయాలు సాగిస్తున్న ఈ సంస్థ... 1968లో ఫోర్డ్‌తో కలిసి రూపొందించిన ‘కోర్టినా’తో తన ప్రస్థానాన్ని ఆరంభించింది. దేశంలో చెన్నైలోని శ్రీపెరంబుదూర్‌లో ఉన్న ప్లాంట్ నుంచి ఏటా 6 లక్షల కార్లు ఉత్పత్తి చేస్తోంది. 2007లో హైదరాబాద్ అభివృద్ధి, పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించింది.
 
చౌక కార్లలోనూ డెట్రాయిట్ దిగ్గజం!
ఒకనాటి నవలల్లో ‘చెవర్లెట్ కారు’ అని ముద్దుగా పిలిచినా... అసలు పేరు షెవర్లే. అమెరికన్ దిగ్గజం జనర ల్ మోటార్స్ విభాగ మిది. 1911లో స్విస్ రేస్ కార్ డ్రైవర్ లూయీ షెవర్లే, ఫైనాన్సింగ్ పార్టనర్ విలియం సి డురంట్‌తో కలిసి మిషిగన్‌లో ఈ కంపెనీని ఆరంభించా రు. ప్రస్తుతం 140 దేశాలకు విక్రయించిన షెవర్లే వాటా... మన దేశంలో 3 శాతం. గుజరాత్‌లోని హలోల్‌లో ప్లాంట్ ఏర్పాటు చేసిన ఈ సంస్థ... 2014లో 24 వేల కార్లను ఉత్పత్తి చేసింది. క్రూజ్, ఆస్ట్రా, టవేరా తప్ప మిగిలివన్నీ జపాన్ నుంచి దిగుమతి అవుతున్నవే.
 
జేఎల్‌ఆర్‌ను వదులుకున్నా....
ఫోర్డ్ మోటార్స్‌ను 1903లో హెన్రీ ఫోర్డ్ మిషిగన్‌లో ప్రారంభించారు. కార్లు, కమర్షియల్ వాహనాలను ‘ఫోర్డ్’ బ్రాండ్‌తో, లగ్జరీ కార్లను ‘లిన్‌కోల్న్’ బ్రాండ్‌తో విక్రయిస్తోంది. కొన్ని విదేశీ కార్ల కంపెనీలనూ కొనుగోలు చేసిన ఈ సంస్థ... జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను మాత్రం టాటాలకు విక్రయించేసింది. జపాన్‌కు చెందిన మజ్దాలో 2.1 శాతం, యూకేకు చెందిన ఆస్టిన్ మార్టిన్‌లో 8 శాతం, చైనాకు చెందిన జింగ్లింగ్‌లో 49 శాతం వాటా దీనికున్నాయి. దేశంలో గుజరాత్‌లోని సణంద్‌లో ఫోర్డ్ ఇంజిన్, అసెంబ్లింగ్ ప్లాంటుంది.
 
బుగట్టి వేరన్‌గ్రాండ్ స్పోర్ట్స్
దేశంలో అత్యంత ఖరీదైన కారు ఇది. బుక్ చేశాక డెలివరీకి 6-8 నెలలు పడుతుంది. అది కూడా కస్టమర్ల స్థాయిని బట్టి!!. 100 కి.మీ. వేగాన్ని అందుకోవడానికి కేవలం 2.7 సెకన్లు పడుతుందంటేనే... దీని ప్రత్యేకత అర్థమైపోతుంది. కారులోని ప్రతి అంగుళం ప్రత్యేకమైందే. కార్బన్ ఫైబర్ మోనోకోక్యూతో కారు బాడీ తయారవుతుంది.  
ఖరీదు రూ.38 కోట్లు.
8.7 లీటర్ల ఇంజిన్ సామర్థ్యం దీని సొంతం
987 బీహెచ్‌పీ పవర్ : 6,000 ఆర్‌పీఎం
1,250 ఎన్‌ఎం టార్క్ : 2,200-5,500 ఆర్‌పీఎం
7 స్పీడ్ డీఎస్‌జీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
గరిష్ట వేగం గంటకు 407 కి.మీ.
మైలేజ్ లీటరుకు సిటీలో 2.3 కి.మీ. -  హైవేలో 6.8 కి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 100 లీటర్లు
 
ఆస్టిన్ మార్టిన్ వాన్‌క్విష్
ధర రూ.3.8 కోట్లు
⇒  ఏఎం 29 వీ12 ఇంజిన్
565 బీహెచ్‌పీ : 6,750 ఆర్‌పీఎం
620 ఎన్‌ఎం టార్క్ :  5500 ఆర్‌పీఎం
6 స్పీడ్ గేర్ బాక్స్
గరిష్ట వేగం గంటకు 295 కి.మీ.
జీరో నుంచి 100 కి.మీ.లకు చేరుకోవటానికి పట్టే సమయం 4.3 సెకన్లు
ఇంధన సామర్థ్యం 78 లీటర్లు
మైలేజీ లీటర్‌కు సిటీలో: 4 కి.మీ., హైవేలో: 8 కి.మీ.
 
రోల్స్ రాయిస్ ఫాంథమ్ సిరీస్-2
ఫాంథమ్‌ను మొదటిసారి మ్యాగజైన్ల మీద ప్రకటనల్లో కాకుండా నేరుగా చూసినవారెవరైనా... నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఫాంథమ్ పాంథా రోడ్డు మీద వెళ్తుంటే కారు ముందు, వెనక ఇరుసులు రోడ్డును మింగేస్తున్నట్టుగా కనిపిస్తాయి. 5.9 సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
స్టాండర్డ్ వీల్ బేస్ ధర రూ.8 కోట్లు; ఎక్స్‌టెండెడ్ వీల్ బేస్ ధర రూ.9 కోట్లు  ళీ రెండు వర్షన్లూ 6.7 లీటర్ వీ-2 పెట్రోల్ ఇంజిన్.
453 బీహెచ్‌పీ పవర్ : 5,350 ఆర్‌పీఎం; 720 ఎన్‌ఎం టార్క్ : 3,500 ఆర్‌పీఎం ళీ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్; దీని గరిష్ట వేగం గంటకు 240 కి.మీ.
ఇంధన ట్యాంక్ కెపాసిటీ 100 లీటర్లు; మైలేజీ లీటరుకు సిటీలో: 4.38 కి.మీ.-హైవేలో 9.8 కి.మీ.
 
లంబోర్గిణి అవెంటడార్
మూడు సెకన్లలో 100 కి.మీ. వేగాన్ని అందుకునే ఈ కారు ధర... రూ.5.36 కోట్లు
6,498 సీసీ పెట్రోల్ ఇంజిన్
7 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ షిఫ్ట్
690.62 బీహెచ్‌పీ : 8,250 ఆర్‌పీఎం
690 ఎన్‌ఎం : 5,500 ఆర్‌పీఎం
గరిష్ట వేగం గంటకు 350 కి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు
మైలేజీ లీటర్‌కు సిటీలో: 3 కి.మీ., హైవేలో 5 కి.మీ.
 
బెంట్లీ ముల్సన్నే
దేశంలో పెట్రోల్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కారు... 100 వేగాన్ని 5.3 సెకన్లలో చేరుకుంటుంది.
ధర రూ.7.5 కోట్లు.
6.8 లీటర్ వీ 8 ఇంజిన్ ట్విన్ టర్బో చార్జ్‌డ్
505 బీహెచ్‌పీ : 4,200 ఆర్‌పీఎం
8 స్పీడ్ ఆటో మేటిక్ గేర్ షిఫ్ట్
టార్క్ 1,020 ఎన్‌ఎం : 1,750 ఆర్‌పీఎం
గరిష్ట వేగం గంటకు 296 కి.మీ.
ఇంధన ట్యాంక్ కెపాసిటీ 96 లీటర్లు
మైలేజీ లీటర్‌కు సిటీలో: 4.3 కి.మీ.
హైవేలో: 10.1 కి.మీ.
 
బెంట్లీ ఫ్లయింగ్ స్పౌర్
మన దేశంలో ఫ్లయింగ్ స్పౌర్.. వీ 8, డబ్ల్యూ 12 వేరియంట్స్ అనే రెండు పెట్రోల్ వెర్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
వీ8 ధర రూ.3.2 కోట్లు; 5,988 సీసీ 4 లీటర్ ఇంజిన్ సామర్థ్యం
500 బీహెచ్‌పీ : 6000 ఆర్‌పీఎం
660 ఎన్‌ఎం : 1,700 ఆర్‌పీఎం టార్క్
8 స్పీడ్ ఆటో గేర్ బాక్స్; గరిష్ట వేగం గంటకు 295 కి.మీ.
3.2 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది.
మైలేజీ లీటర్‌కు సిటీలో 4.5 కి.మీ., హైవేలో 10.2 కి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 90 లీటర్లు
 
రోల్స్ రాయిస్ రైత్
ధర రూ.4.6 కోట్లు
ట్విన్ టర్బో వీ-12 ఇంజిన్
8 స్పీడ్ ఆటోమేటిక్ జెడ్‌ఎఫ్ ట్రాన్స్‌మిషన్
6,592 సీసీ ఇంజిన్
624 బీహెచ్‌పీ : 5,600 ఆర్‌పీఎం
800 ఎన్‌ఎం : 1,500-5,000 ఆర్‌పీఎం
100 కి.మీ. వేగాన్ని చేరుకోవటానికి పట్టే సమయం 4.6 సెకన్లు.
గరిష్ట వేగం గంటకు 250 కి.మీ.; ఇంధన ట్యాంక్ సామర్థ్యం 83 లీటర్లు
మైలేజీ లీటరుకు సిటీలో: 4.7 కి.మీ., హైవేలో: 10.2 కి.మీ.
 
పోర్షే 911 టర్బో ఎస్
ధర రూ.3 కోట్లు
బుక్ చేసిన 7-10 నెలల సమయానికి కారు డెలివరీ అవుతుంది.
3.1 సెకన్లలో సున్నా నుంచి వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది.
3.8 లీటర్ 24 వీ పెట్రోల్ ఇంజిన్ సామర్థ్యం
560 బీహెచ్‌పీ : 5,750 ఆర్‌పీఎం
700 ఎన్‌ఎం టార్క్ : 2,100-4,500 ఆర్‌పీఎం
7 స్పీడ్ గేర్ బాక్స్;  గరిష్ట వేగం గంటకు 318 కి.మీ.
మైలేజీ లీటర్‌కు సిటీలో 7.46 కి.మీ., హైవేలో 12.8 కి.మీ.
ఇంధన ట్యాంక్ సామర్థ్యం 68 లీటర్లు
 
ఫెరారీ కాలిఫోర్నియా
ధర రూ.3-5 కోట్లు
ట్విన్ క్లచ్ గేర్ బాక్స్
4.3 లీటర్ వీ8 ఫ్రంట్ ఇంజిన్ సామర్థ్యం
482.7 బీహెచ్‌పీ : 7,750 ఆర్‌పీఎం; 505 ఎన్‌ఎం : 5,000 ఆర్‌పీఎం
గరిష్ట వేగం గంటకు 312.2 కి.మీ.
7 స్పీడ్ ఆటో షిఫ్ట్‌తో మాన్యువల్ గేర్స్/ఆటోమేటిక్ రెండూ ఉంటాయిందులో.
3.7 సెకన్లలో వంద కి.మీ. వేగానికి చేరుకుంటుంది.
మైలేజీ లీటర్‌కు సిటీలో 4.32 కి.మీ., హైవేలో 7.75 కి.మీ.
ఇంధన ట్యాంక్ కెపాసిటీ 73 లీటర్లు
 
గమనిక: బీహెచ్‌పీ: బ్రేక్ హార్స్ పవర్; ఆర్‌పీఎం: రివల్యూషన్స్ పర్ మినట్; ఎన్‌ఎం: నానో మీటర్; టార్క్: ఫోర్స్ (బలం);

భారతదేశంలో కార్ల కోసం అత్యధికులు పెట్టే బడ్జెట్ రూ.10 లక్షల లోపే. అందుకే ప్రతి కంపేని ఈ సెగ్మెంట్లోనే మోడళ్లను తెస్తోంది. వాటి పోటీ కూడా ఈ సెగ్మెంట్లోనే. మారుతీ, హ్యుందాయ్, టాటా. రెనో, నిస్సాన్, షెవర్లే, హోండా, ఫోర్డ్, ఫోక్స్వ్యాగన్, టొయోటా.. ఇలా అన్ని కంపెనీల పోరూ ఈ సెగ్మెంట్లోనే. కాకపోతే మారుతీ, హ్యుదాయ్, టాటాల వాటా ఎక్కువ. రూ.10లక్షల లోపు మోడళ్ల ఫీచర్లు, మైలేజీ తదితర వివరాలను చూస్తే...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement