
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6 కొత్త వెర్షన్ ధరను ప్రకటించింది. ఎక్స్‌షోరూంలో ధర వేరియంట్‌నుబట్టి రూ.11.3–14.5 లక్షల మధ్య ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్‌తో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుపరిచారు. ప్యాడిల్ షిఫ్టర్స్‌తో 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, 75.8 కిలోవాట్ పవర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, నాలుగు ఎయిర్‌బ్యాగ్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హిల్ హోల్డ్ అసిస్ట్‌తో ఎల్రక్టానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రిమోట్ ఆపరేషన్స్‌తో 40కిపైగా ఫీచర్లతో ఇన్‌బిల్ట్ సుజుకీ కనెక్ట్ వంటి హంగులు ఉన్నాయి.
చదవండి: వచ్చేస్తోంది..కియా ఎలక్ట్రిక్ కారు..మొదలుకానున్న బుకింగ్స్..ఎప్పుడంటే..?
Comments
Please login to add a commentAdd a comment