‘మారుతి ఎర్టిగా’ కొత్త వేరియంట్‌ | Maruti Suzuki India introduces new diesel engine in Next Gen Ertiga | Sakshi
Sakshi News home page

‘మారుతి ఎర్టిగా’ కొత్త వేరియంట్‌

Published Wed, May 1 2019 12:37 AM | Last Updated on Wed, May 1 2019 12:37 AM

Maruti Suzuki India introduces new diesel engine in Next Gen Ertiga - Sakshi

న్యూఢిల్లీ: మారుతి సుజుకీ ఇండియా తాజాగా ‘ఎర్టిగా’ మోడల్‌లో 1.5 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ కారును మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇప్పటిదాకా 1.3 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్‌ అందుబాటులో ఉండగా... ఇంజిన్‌ సామర్థ్యాన్ని మరింత పెంచి ఈ వేరియంట్‌ను విడుదల చేశారు. ఈ నూతన కారు ధరల శ్రేణి రూ.9.86 లక్షల నుంచి రూ.11.20 లక్షలు.
 

ప్రతి లీటరుకు 24.20 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్ల అవసరాలను విశ్లేషించి ఈ తదుపరి తరం ఎర్టిగాను విడుదలచేసినట్లు కంపెనీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌) ఆర్‌.ఎస్‌.కల్సి చెప్పారు. గతేడాది నవంబర్‌ నుండి ఈ ఏడాది ఏప్రిల్‌ మధ్యకాలంలో ఈ మోడల్‌ అమ్మకాలు 40,000 యూనిట్లుగా కంపెనీ వెల్లడించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement