ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలు, బీమా , తదితర కంపెనీలు షోకాజ్ నోటీసుల తరువాత తాజాగా ఆటోమొబైల్ మేజర్ మారుతీ సుజుకి ఇండియాకి జీఎస్‌టీ షాక్ తగిలింది. వడ్డీ , పెనాల్టీలతో పాటు రివర్స్ ఛార్జ్ ప్రాతిపదికన నిర్దిష్ట సేవలపై పన్ను బాధ్యతకు సంబంధించి రూ. 139.3 కోట్లు చెల్లించాలంటూ జీఎస్‌టీ అధికారులు కంపెనీకి షోకాజ్ నోటిసులు పంపించారు. అయితే దీనిపై స్పందించిన మారుతి ఇప్పటికే చెల్లించిన పన్నుకు, 2017 జూలై -2022 ఆగస్టు వరకు నిర్దిష్ట సేవలపై రివర్స్ ఛార్జ్ విషయానికి సంబంధించిన నోటీసు అని కంపెనీ తెలిపింది.
"అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు షోకాజ్ నోటీసుకు తమ జవాబును ఫైల్ చేయనున్నామని, అలాగే ఈ నోటీసు తమ ఆర్థిక, కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ సమాచారాన్ని అందించింది. అలాగే 2006 జూన్ నుండి మార్చి 2011 మధ్య కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ దాఖలు చేసిన అప్పీళ్లు కొట్టివేస్తూ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు నుండి తమకు అనుకూలమైన ఉత్తర్వు లభించిందని కంపెనీ తెలిపింది. దీనిపై జరిమానాను కూడా కోర్టు తొలగించినట్టు వెల్లడించింది. డిపార్ట్‌మెంట్ అప్పీల్‌లో పెనాల్టీ తోకలిపి మొత్తం పన్ను రూ. 57.2 కోట్లు.
కాగా మారుతీ ఈ ఏడాది ఆగస్టు అత్యధిక నెలవారీ అమ్మకాల్లో1,89,082 యూనిట్లతో కీలక మైలురాయిని సాధించింది. వివిధ సబ్-సెగ్మెంట్ మోడల్‌లతో సహా దేశీయ విక్రయాలలో 1,58,678 యూనిట్లను నమోదు చేసింది. తన మొత్తం లైనప్‌లో పూర్తి స్వదేశీకరణ లక్ష్యంగా పెట్టుకుంది. ప్యాసింజర్ వెహికల్ (PV) మార్కెట్ లీడర్‌గా ఉన్న మారుతి ఇప్పటికీ కొన్ని కీలకమైన భాగాలు, ముఖ్యంగా సెమీకండక్టర్ చిప్‌ల దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పటికీ, దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీపై పట్టు సాధిస్తే,విదేశీ మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని కంపెనీ విశ్వసిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment