మారుతి సుజుకీ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌ | Maruti Suzuki Offering Discount On Selected Models Till July 31 | Sakshi
Sakshi News home page

మారుతి సుజుకీ కార్ల మోడళ్లపై భారీ డిస్కౌంట్‌

Published Tue, Jul 6 2021 8:37 PM | Last Updated on Tue, Jul 6 2021 9:46 PM

Maruti Suzuki Offering Discount On Selected Models Till July 31 - Sakshi

ముంబై: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది.  విక్రయాలను పెంచడం కోసం మారుతి సుజుకీ శ్రేణిలోని కొన్ని కారు మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. మారుతి తన కస్టమర్లకు  క్యాష్‌ డిస్కౌంట్‌, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ల కింద ఆఫర్లను అందించనుంది. ఆల్టో,  స్విఫ్ట్, ఈకో  అనేక రకాల కార్లపై డిస్కౌంట్ అందుబాటులో ఉంది. కాగా ఏర్టిగా మోడల్‌కు సంబంధించి ఏలాంటి రాయితీ ప్రకటించలేదు. కాగా ఈ ఆఫర్‌ జూలై 31 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకీ డిస్కౌంట్‌ను అందిస్తోన్న కారు మోడళ్లు ఇవే..

మారుతి ఆల్టో
కస్టమర్లు సుమారు రూ. 15000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 3000 కార్పొరేట్‌ బోసన్‌ను అందించనుంది. కాగా మారుతి ఆల్టో పెట్రోల్‌ ఇంజన్‌ మోడల్‌కు సుమారు రూ. 25 వేల వరకు క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది. 

మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్‌
 మారుతి సెలేరియో, సెలేరియో ఎక్స్‌ మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 3,000 కార్పొరేట్‌ బోసన్‌ను ప్రకటించింది. కాగా ఈ మోడళ్లకు ఏలాంటి క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించడం లేదు.

మారుతి డిజైర్‌
మారతి డిజైర్‌ మోడల్‌ కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను ప్రకటించింది.

మారుతి ఈకో
మారుతి ఈకో మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 15,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 3,000 కార్పొరేట్‌ బోసన్‌, రూ. 10,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది.

మారుతి ఎస్-ప్రెస్సో
పెట్రోల్ ఇంజన్ మోడల్‌కు రూ .25 వేల నగదు తగ్గింపు, సిఎన్‌జి మోడల్‌కు  రూ .10,000 నగదు తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. వాటితో పాటుగా రూ .15 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, రూ .3,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందించనుంది. 

మారుతి స్విఫ్ట్
స్విఫ్ట్‌పై సుమారు రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ , రూ .4,000 కార్పొరేట్ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. స్విఫ్ట్‌ ఎల్‌ఎక్స్‌ఐ మోడల్‌కు 10,000 రూపాయల నగదు తగ్గింపు, జెడ్‌ఎక్స్ఐ, జెడ్‌ఎక్స్ఐ + వేరియంట్లకు రూ. 15,000 తగ్గింపు, స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్‌కు సుమారు . 30,000 నగదు తగ్గింపును ప్రకటించింది.

మారుతి విటారా బ్రెజ్జా
మోడళ్ల కొనుగోలుపై సుమారు రూ. 20,000 వరకు ఎక్సేఛేంజ్‌ బోనస్‌, రూ. 4,000 కార్పొరేట్‌ బోసన్‌, రూ. 15,000 క్యాష్‌ డిస్కౌంట్‌ను అందించనుంది.

మారుతి వాగన్-ఆర్
పెట్రోల్ ఇంజన్ మోడల్‌కు రూ .15 వేల నగదు తగ్గింపుతో, సిఎన్‌జి ఇంజన్ మోడళ్లకు రూ .5 వేల నగదు తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 15,000, ఎక్స్ఛేంజ్ బోనస్  రూ .3,000 ను అందిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement