సాక్షి, ముంబై : కరోనా వైరస్ కల్లోల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక కలాపాలు పూర్తిగా స్థంభించిపోవడంతో దిగ్గజాలుసైతం కకావికల మవుతున్నాయి. దీనికి భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) తాజా ఉదాహరణగా నిలిచింది. ఏప్రిల్‌లో దేశీయ మార్కెట్లో ఎలాంటి విక్రయాలను నమోదు చేయలేదు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు లాక్‌డౌన్ ఆంక్షలతో మారుతి ఆఫీసులకు తాళాలు పడ్డాయి.ప్లాంట్లు మూత పడ్డాయి. ఉత్పత్తి నిలిచిపోయింది. మార్చి 24 నుండి దేశ ప్రజంతా లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఒక్క కారు కూడా విక్రయానికి నోచుకోలేదు. (లాక్‌డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన)
ఏప్రిల్ 2020లో దేశీయ మార్కెట్లో ఎంఎస్ఐఎల్ అమ్మకాలు శూన్యమని మారుతి శుక్రవారం నాటి రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అన్ని ఉత్పత్తి సౌకర్యాలు మూసివేయడంతో అమ్మకాలు లేవని తెలిపింది. ఏప్రిల్‌లో ఇతర ఒరిజినల్ పరికరాల తయారీ సంస్థ (ఓఇఎం) అమ్మకాలు కూడా లేవని అయితే కంపెనీ 632 యూనిట్లను ఎగుమతి చేసినట్టు మారుతి వెల్లడించింది. కాగా లాక్‌డౌన్ నేపథ్యంలో మారుతి సుజుకి కంపెనీ జూన్ 30వ తేదీ వరకు కార్ల ఉచిత సర్వీస్, ఎక్స్‌టెండెడ్ వారంటీ తేదీల గడువును పొడిగించినట్లు గతంలోనే తెలిపింది. (ఒక నెలలో ఇంత లాభం గత పదేళ్లలో ఇదే తొలిసారి)
Comments
Please login to add a commentAdd a comment