
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థలు భవిష్యత్ తరం వాహనాలను రూపొందించేందుకు తోడ్పడేలా స్పష్టమైన, స్థిరమైన విధానాలు అవసరమని మారుతీ సుజుకీ ఇండియా ఎండీ కెనిచి అయుకావా తెలిపారు. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు, పరికరాల తయారీ సంస్థలు.. టెక్నాలజీపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో స్వల్పకాలిక, మధ్య కాలిక, దీర్ఘకాలిక ప్రభుత్వ విధానాలపై స్పష్టత ఉంటే ఉపయోగపడగలదని ఆయన చెప్పారు. భారతీయ ఆటోమొబైల్ పరికరాల తయారీ సంస్థల సమాఖ్య (ఏసీఎంఏ) వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కెనిచి ఈ విషయాలు వివరించారు.
ఇంధన భద్రత లక్ష్యాలను సాధించాలంటే టెక్నాలజీ విషయంలో భారత్ తటస్థ విధానాన్ని పాటించాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రీడ్స్, సీఎన్‌జీ, మెథనాల్, ఇథనాల్ మొదలైన ఇంధనాలను ఉపయోగించే వాహనాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు, తగిన మౌలికసదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వపరంగా తోడ్పాటు అవసరమని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment