
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికనలో నికర లాభం 48 శాతం క్షీణించి రూ. 1,042 కోట్లకు పరిమితమైంది. ఇందుకు అమ్మకాలు నీరసించడం, సెమీకండక్టర్‌ల కొరత, కమోడిటీల ధరలు పెరగడం ప్రభావం చూపాయి. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,997 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం నామమాత్రంగా రూ. 218 కోట్లు తగ్గి రూ. 23,253 కోట్లకు చేరింది. మొత్తం వాహన అమ్మకాలు 13 శాతం నీరసించి 4,30,668 యూనిట్లను తాకాయి. గత క్యూ3లో 4,95,897 వాహనాలు విక్రయించింది.
దేశీయంగా ఈ క్యూ3లో 3,65,673 వాహనాలను మారుతీ సుజుకీ విక్రయించింది. గతేడాది ఇదే కాలంలో 4,67,369 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. అయితే కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా ఒక త్రైమాసికంలో 64,995 వాహనాలను ఎగుమతి చేసింది. గత క్యూ3లో ఈ సంఖ్య 28,528 యూనిటు. కాగా.. 2021 డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో కంపెనీ నికర లాభం రూ. 3,148 కోట్ల నుంచి రూ. 2,004 కోట్లకు జారింది. ఆదాయం మాత్రం రూ. 46,338 కోట్ల నుంచి రూ. 61,581 కోట్లకు జంప్‌చేసింది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి.
ఫలితాల నేపథ్యంలో షేరు బీఎస్‌ఈలో 7% జంప్‌చేసి రూ. 8,601 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 8,662 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.
చదవండి: ఎగుమతుల్లో హ్యుందాయ్ సంచలనం! ఎస్‌యూవీ కేటగిరీల్లో క్రెటా ఏకంగా..
Comments
Please login to add a commentAdd a comment