సాక్షి, ముంబై: మారుతితి సుజుకి గ్రాండ్ విటారాను ఎట్టకేలకు ఈ రోజు (జూలై 20) ఇండియాలో పరిచయం చేసింది. అర్బన్ క్రూయిజర్, గ్లాంజా తరువాత టయోటా సుజుకి భాగస్వామ్యంతో తయారైన కొత్త మోడల్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా. 28 కిలోమీటర్ల మైలేజీ ఎస్‌యూవీగా కంపెనీ వెల్లడించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఆసక్తిగల కొనుగోలుదారులు మారుతి డీలర్‌షిప్ వద్ద లేదా ఆన్‌లైన్‌లో రూ. 11,000తో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. 2020 మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ ధర రూ.9.50 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు ఉండనుంది.
డిజైన్, ఫీచర్లు, ఇంజన్
గ్రాండ్ విటారా ఎస్‌యూవీ కూడా టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఎస్‌యూవీ మాదిరిగానే ఉన్నా. SUV క్రోమ్ స్ట్రిప్, ట్రైఎల్ఈడీ టెయిల్ లైట్ల పొడవైన బంపర్, స్పోర్టి ఎయిర్ డ్యామ్, పూర్తి-LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ స్పెషల్. ప్రత్యేకమైన 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ పొందుపర్చింది. 27.97km మైలేజీని అందజేస్తుందని కంపెనీ పేర్కొంది.
ఫీచర్ల విషయానికి వస్తే,వెంటిలేటెడ్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, హెడ్స్-అప్-డిస్‌ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా , అనేక ఇతర స్మార్ట్ కార్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగూ ఆల్‌గ్రిప్ AWD సాంకేతికతను కూడా జోడించింది. AllGrip సిస్టమ్‌లో ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ అనే నాలుగు మోడ్‌లు అందుబాటులో ఉంటుంది. ఏడబ్యూడీ టెక్నాలజీని అందించిన మారుతి సుజుకీ ఏకైక కారు గ్రాండ్ విటారా. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESP, హిల్-హోల్డ్ అసిస్ట్, వెనుక ప్రయాణీకులకు 3 పాయింట్ సీట్‌బెల్ట్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, హిల్ డిసెంట్ కంట్రోల్ లాంటి సెక్యూరిటీ ఫీచర్లున్నాయి.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా రెండు ఇంజన్ ఆప్షన్లతో లభ్యం. ఇందులో ఒకటి 1.5-లీటర్ TNGA అట్కిన్సన్ సైకిల్ ఇంజన్. ఇది 92hp , 122Nm టార్క్‌ను, 79hp, 141Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.5-లీటర్ K15C మైల్డ్-హైబ్రిడ్ ఇంజన్‌తో అందుబాటులో ఉంటుంది. కొత్త బ్రెజ్జా, XL6 , ఎర్టిగాలో ఇదే ఇంజన్‌ను అమర్చింది.ఇది 103hp , 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment