
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు సరికొత్త మోడళ్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేయనున్నట్లు మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ప్రకటించింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 2 సరికొత్త ఉత్పత్తులను అందించనున్నట్లు సంస్థ చైర్మన్ ఆర్‌సి భార్గవ వెల్లడించారు. ఈ ఏడాది మార్చిలోపు ఒక మోడల్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారయన. ఈ అంశంపై మాట్లాడుతూ.. ‘నూతన భద్రతా నిబంధనలకు అనుగుణంగా నూతన మోడళ్లలో ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఎన్నికల సమయంలో కార్ల కొనుగోలు అధికంగా ఉంటుందనే విషయం ఇప్పటికే నిరూపితమైంది. ఈ నేపథ్యంలో నూతన మోడళ్లపై దృష్టిసారించాం.’ అని వ్యాఖ్యానించారు. ఈయన ప్రకటన అనంతరం.. ప్రీమియం కార్ నెక్సా, మరో సాధారణ మోడల్‌లో నూతన కార్లు విడుదల ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనావేశాయి.
Comments
Please login to add a commentAdd a comment