
న్యూఢిల్లీ: దేశీ కార్ల తయారీ దిగ్గజం ‘మారుతి సుజుకీ ఇండియా’ తన పాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ‘విటారా బ్రెజా’ మొత్తం విక్రయాలు 4 లక్షల యూనిట్ల మైలురాయికి చేరుకున్నట్లు ప్రకటించింది. ఈ కారు విడుదలైన మూడేళ్లలోనే ఇంతటి అమ్మకాలను నమోదుచేసినట్లు తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సగటున నెలవారీగా 7 శాతం వృద్ధిరేటుతో 14,675 యూనిట్లు అమ్ముడైనట్లు వివరించింది. ‘ఈ ఎస్‌యూవీ డిజైన్, ఫీచర్స్ కస్టమర్ల అభిరుచులకు సరిగ్గా సరిపడే విధంగా ఎప్పటికప్పుడు మెరుగుపడుతుండడం వల్లనే ఈస్థాయి విక్రయాలు నమోదయ్యాయి’ అని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్, సేల్స్) ఆర్.ఎస్.కల్సి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment