ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ ఇండియా ఈకో వ్యాన్‌లోని అన్ని వేరియంట్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సుమారు రూ. 8000 మేర పెంచినట్లు మంగళవారం కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
పెంపు ఎందుకంటే..!
ఈకో మోడల్‌కు చెందిన అన్ని నాన్ కార్గో వేరియంట్లలో అదనంగా ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ను మారుతి సుజుకీ ప్రవేశపెట్టింది. దీంతో ఈకో వ్యాన్‌లోని అన్ని నాన్-కార్గో వేరియంట్‌ల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. పెరిగిన ధరలు ఈరోజు (నవంబర్ 30) నుంచే అమల్లోకి వస్తుందని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
ఈకో ప్యాసింజర్ వెర్షన్ ధరలు రూ. 4.3 లక్షల నుంచి రూ. 5.6 లక్షలుగా ఉంది. అంబులెన్స్ ఈకో వెర్షన్ ధర రూ. 7.29 లక్షలుగా ఉంది. (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ).ఈ ఏడాది సెప్టెంబర్‌లో సెలెరియో మోడల్ మినహా మిగతా మోడళ్ల ధరలను కంపెనీ సుమారు 1.9 శాతం వరకు పెంచింది.
చదవండి: ఓలాకు గట్టిపోటీ..! భారీ ప్రణాళికతో ఏథర్..!
Comments
Please login to add a commentAdd a comment